STOCKS

News


రిలయన్స్‌పై ఓవర్‌వెయిట్‌తో మోర్గాన్‌ స్టాన్లీ

Friday 9th November 2018
Markets_main1541746335.png-21820

ప్రముఖ గ్లోబల్‌ రీసెర్చ్‌ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ తాజాగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌పై (ఆర్‌ఐఎల్‌) ఓవర్‌వెయిట్‌తో ఉంది. ఆర్‌ఐఎల్‌ స్టాక్‌కు టార్గెట్‌ ప్రైస్‌ను రూ.1,230గా నిర్ణయించింది. కెమికల్‌ వ్యాపారపు మార్జిన్లు పాజిటివ్‌గా ఉండటం ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోందని తెలిపింది. ఇక డిమాండ్‌ ఔట్‌లుక్‌ సాధారణంగానే ఉండొచ్చని అంచనా వేసింది. 
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రస్తుత క్యూ2లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.9,516 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. సీక్వెన్షియల్‌గా చూస్తే 0.6 శాతం వృద్ధి నమోదయ్యింది. పెట్రోకెమికల్‌, టెలికం వ్యాపారాలు మంచి పనితీరు కనబర్చడం ఇందుకు ప్రధాన కారణం. రిఫైనింగ్‌ వ్యాపారం మాత్రం నిరుత్సాహానికి గురిచేసింది. ఇక కన్సాలిడేటెడ్‌ ఆదాయం క్వార్టర్‌ పరంగా చూస్తే 11.3 శాతం వృద్ధితో రూ.1.43 లక్షల కోట్లకు ఎగసింది. వార్షికంగా చూస్తే లాభంలో 17.35 శాతం, రెవెన్యూలో 56 శాతం వృద్ధి నమోదయ్యింది. స్థూల ఆర్థికాంశాలు బాగులేనప్పుటికీ కంపెనీ బలమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసిందని, ఎర్నింగ్స్‌లో పటిష్టమైన వృద్ధి కనిపించిందని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముకేశ్‌ అంబానీ తెలిపారు. పెట్రోకెమికల్స్‌ విభాగం ఎర్నింగ్స్‌లో అధిక వాటాను సమకూర్చిందని పేర్కొన్నారు. 

మధ్యాహ్నం 12:19 సమయంలో ఎన్‌ఎస్‌ఈలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు ధర దాదాపు స్థిరంగా రూ.1,111 వద్ద ట్రేడవుతోంది. 



You may be interested

ఐటీ షేర్లకు రూపాయి ఝలక్‌

Friday 9th November 2018

డాలర్‌ మారకంలో రూపాయి అనూహ్య రివకరీ ఇంట్రాడేలో ఐటీ షేర్లకు ఝలక్‌ ఇచ్చింది. నేడు ముడి చమురు ధరలు తగ్గడం, బాండ్‌ ఈల్డ్‌ పెరగడం తదితర అంశాలు రూపాయి ర్యాలీకి కారణమయ్యాయి. రూపాయి బలపడంతో డాలర్ల రూపంలో ఆదాయాన్ని ఆర్జించే ఐటీ షేర్లు నష్టాల బాట పట్టాయి. ఎన్‌ఎస్‌ఈ ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న నిఫ్టీ ఇండెక్స్‌ 1శాతానికి పైగా నష్టపోయింది. మధ్యాహ్నం గం.12:30ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(14674.45)తో పోలిస్తే

స్వల్ప లాభంతో నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌

Friday 9th November 2018

మార్కెట్‌ ఫ్లాట్‌ ట్రేడింగ్‌లో భాగంగా శుక్రవారం నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ కూడా స్వల్పంగా లాభపడింది. నేడు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 25,742.55 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభంలో ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌, నిఫ్టీలు నష్టాల్లో ట్రేడ్‌ అయిన్పటికీ, హెవీ వెయిటేజీ షేర్లైన యస్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ షేర్ల ర్యాలీ బ్యాంక్‌ నిప్టీ ఇండెక్స్‌ మాత్రం లాభాల్లో ట్రేడైంది. ఇంట్రాడేలో అరశాతం

Most from this category