STOCKS

News


మెటల్‌ షేర్ల టార్గెట్‌ ధరల్లో కోత విధించిన మోర్గాన్ స్టాన్లీ

Tuesday 27th November 2018
Markets_main1543308065.png-22418

ముంబై: దేశీ దిగ్గజ మెటల్‌ కంపెనీల లాభదాయకత దశాబ్దకాల గరిష్టానికి చేరుకోగా.. ఇదే సమయంలో వాల్యూయేషన్స్‌ కూడా ఇదే విధంగా పెరిగిపోయాయని మోర్గాన్ స్టాన్లీ వివరించింది. డిమాండ్‌ పరంగా ఉన్నటువంటి రిస్క్‌, అధిక లివరేజ్‌ అంశాలను బేరీజువేసుకుని అనేక స్టీల్‌ రంగ షేర్ల టార్గెట్‌ ధరలను తగ్గించింది. ఎర్నింగ్స్‌, బ్యాలెన్స్‌ షీట్‌ పరంగా బలంగా ఉన్నటువంటి కంపెనీల షేర్లను కొనుగోలు చేయవచ్చని సూచిస్తూనే.. ఇంతకుముందు ప్రకటించిన టార్గెట్‌లను తాజాగా సవరించింది. జేఎస్‌డబ్ల్యూ స్టీల్ రేటింగ్‌ను ఈక్వల్‌వెయిట్‌ నుంచి అండర్‌వెయిట్‌కు తగ్గించింది. టార్గెట్‌ ధరలో ఏకంగా 25 శాతం కోత విధించిన కారణంగా ఈ కంపెనీ షేరు ధర మంగళవారం ట్రేడింగ్‌లో 5 శాతం నష్టాలను నమోదుచేసింది. ఇంట్రాడేలో రూ.299.50 కనిష్టస్థాయికి పడిపోయింది. ఇంతకుముందు రూ.369 వద్ద ప్రకటించిన టార్గెట్‌ను రూ.278 వద్దకు కుదించింది. ఈ షేరు 52 వారాల కనిష్టస్థాయి రూ.237 వద్ద.. గరిష్టస్థాయి రూ.427 వద్ద నమోదయ్యాయి. 

జిందాల్ స్టీల్ రేటింగ్‌ను ఓవర్‌వెయిట్‌ నుంచి ఈక్వల్‌వెయిట్‌కు తగ్గించింది. టార్గెట్‌ ధరలో ఏకంగా 45 శాతం కోత విధించింది. ఇంతకుముందు రూ.314 వద్ద ప్రకటించిన టార్గెట్‌ను తాజాగా రూ.174 వద్దకు తగ్గించింది. ఇంట్రాడేలో (5 శాతం పతనమై) రూ.151 కనిష్టస్థాయికి పడిపోయి 52 వారాల కనిష్టస్థాయిని నమోదుచేసింది. 

ఇక హిందాల్కోకు ఓవర్‌వెయిట్‌, వేదాంతాకు ఈక్వల్‌వెయిట్‌, సెయిల్‌కు అండర్‌వెయిట్‌ ఇచ్చింది. హిందాల్కో టార్గెట్‌ను రూ.295 నుంచి రూ.290 వద్దకు, వేదాంతా టార్గెట్‌ను రూ.263 నుంచి రూ.235 వద్దకు, సెయిల్‌ టార్గెట్‌ను రూ.75 నుంచి రూ.53 వద్దకు తగ్గించినట్లు ప్రకటించింది. కోల్‌ ఇండియా టార్గెట్‌ను రూ.306 నుంచి రూ.296 వద్దకు తగ్గించింది. అయితే ఈక్వల్‌వెయిట్‌ నుంచి ఓవర్‌వెయిట్‌కు అప్‌గ్రేడ్‌ చేసింది.



You may be interested

10650 పైన నిఫ్టీ

Tuesday 27th November 2018

రెండో రోజూ లాభాల ముగింపే రాణించిన ఐటీ, బ్యాంకింగ్‌ షేర్లు మిడ్‌సెషన్‌ నుంచి పెరిగిన కొనుగోళ్లతో మార్కెట్‌ మంగళవారం లాభాలతో ముగిసింది. ఐటీ, ఆర్థిక, బ్యాంకింగ్‌ రంగ షేర్లతో సూచీలు వరుసగా రెండో లాభపడ్డాయి. నిఫ్టీ 10650పైన, సెన్సెక్స్‌ 35500ల పైన ముగిశాయి. అంతర్జాతీయ పరిణామాలు అంతంత మాత్రంగా ఉండటంతో మిడ్‌సెషన్‌ వరకు లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు అనంతరం స్థిరమైన ర్యాలీ చేశాయి. చివరి గంటలో పెరిగిన కొనుగోళ్లతో సూచీలు మరిన్ని లాభాలను

4నెలల కనిష్టానికి నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌

Tuesday 27th November 2018

52-వారాల కనిష్టానికి  జేఎస్‌పీఎల్‌, వేదాంత స్టీల్‌ షేర్లు మెటల్‌ షేర్ల పతనం మంగళవారం ట్రేడింగ్‌ సెషన్స్‌లోనూ కొనసాగుతుంది. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ నేటి ట్రేడింగ్‌ మరో 2.50శాతం నష్టపోయింది. నేడు నిఫ్టీ ఇండెక్స్‌ 3,157ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 2.50శాతం క్షీణించి 3,092శాతానికి పతనమైంది. ఇది నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌కు 4నెలల కనిష్టస్థాయి. మధ్యాహ్నం గం.1:30ని.లకు ఇండెక్స్‌ గత ముగింపుతో పోలిస్తే 0.50శాతం

Most from this category