STOCKS

News


మూడు స్టాకులపై మోర్గాన్‌స్టాన్లీ మక్కువ

Thursday 20th September 2018
Markets_main1537442257.png-20415

ఎస్‌బీఐ, అపోలో హాస్పిటల్స్‌, ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌ ప్రాజెక్ట్‌ షేర్లపై దృష్టి పెట్టామని ప్రముఖ బ్రోకింగ్‌ దిగ్గజం మోర్గాన్‌ స్టాన్లీ వెల్లడించింది. ఇప్పటివరకు పోర్టుఫోలియోలో ఉన్న ఇన్ఫోసిస్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, హావెల్స్‌ స్థానంలో ఈ మూడింటిని తీసుకున్నట్లు తెలిపింది. తాజాగా ఎంచుకున్న మూడు స్టాకులు ఈ ఏడాది పేలవ ప్రదర్శన చూపడం గమనార్హం. కానీ మోర్గాన్‌స్టాన్లీ వీటిపై ఓవర్‌వెయిట్‌ ధృక్పథంతో ఉన్నట్లు తెలిపింది.
ఎంపికకు కారణాలు..
1. ఎస్‌బీఐ: ప్రభుత్వం చేపట్టిన రీక్యాప్‌ పథకంతో పీఎస్‌బీలు ఊపిరి పీల్చుకునే వీలుకలిగింది. ఆర్థిక సంవత్సరం రెండో భాగంలో బ్యాంకు స్లిపేజ్‌లు మరింత తగ్గవచ్చు. అదేవిధంగా కీలక పీపీఓపీ వృద్ధిలో మెరుగుదల సైతం కనిపించవచ్చు. ఎన్‌పీఎల్‌ ఏర్పాటు, రేట్లు పెరగడం బ్యాంకుకు కలిసివచ్చే అంశాలు. ఇతర పీఎస్‌బీలతో పోలిస్తే ఆర్‌ఓఈ పరంగా బాగుంది.
2. అపోలో హాస్పిటల్స్‌: ఆస్పత్రుల ఆక్యుపెన్సీ నిష్పత్తి మెరుగవడం, ఫార్మసీల ఆదాయంలో నిలకడైన వృద్ది, ఏహెచ్‌ఎల్‌ఎల్‌ రిటైల్‌ నష్టాలు తగ్గడం.. కలిసిరానున్నాయి. వాల్యూషన్లు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. 
3. ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌: సంతులితమైన పోర్టుఫోలియో ఉంది. బలమైన దక్షిణాది నగరాల్లో విస్తరించడం పాజిటివ్‌ అంశం. గతంతో పోలిస్తే వాల్యూషన్లు భారీగా దిగివచ్చాయి.  



You may be interested

రాణా నిష్క్రమణతో ఇక్కట్లు!

Thursday 20th September 2018

యస్‌బ్యాంక్‌పై బ్రోకరేజ్‌ల అభిప్రాయం యస్‌బ్యాంక్‌ సారధ్య బాధ్యతల నుంచి రాణా కపూర్‌ వచ్చే ఏడాది జనవరి కల్లా వైదొలగాలని ఆర్‌బీఐ ఆదేశించింది. రాణా వైదొలగడం బ్యాంకు వృద్ధిపై ప్రభావం చూపుతుందని, బ్యాంకు నిధుల సమీకరణ యత్నాలు ఆలస్యమవుతాయని ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. బ్యాంకు షేరు మరింత క్షీణించవచ్చని భావిస్తున్నాయి. బ్యాంకు షేరుపై బ్రోకింగ్‌ దిగ్గజాల అంచనాలు, అభిప్రాయాలు.. - ఐడీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌: రేటింగ్‌ను అండర్‌ పెర్ఫామర్‌కు తగ్గించింది. టార్గెట్‌ ధరను రూ. 350

బ్యాంకులకు ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ దెబ్బ తప్పదు!

Thursday 20th September 2018

మూడీస్‌ హెచ్చరిక ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ ఎదుర్కొంటున్న లిక్విడిటీ సమస్య దేశీయ బ్యాంకులకు క్రెడిట్‌ నెగిటివ్‌అని గ్లోబల్‌ ఏజన్సీ మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ హెచ్చరించింది. ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల కారణంగా ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ సంస్థ తాజాగా భారీ రుణ సంక్షోభం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ సంక్షోభంతో కంపెనీ క్రెడిట్‌ రేటింగ్‌ దారుణంగా పడిపోయింది. గ్రూప్‌నకు చెందిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన ఎంఎఫ్‌లు చలా నష్టాలు ఎదుర్కొంటున్నాయి. కంపెనీలో వాటాలున్న బడా

Most from this category