STOCKS

News


ఎన్‌డీఏ మళ్లీ వస్తే.. మరింత జోరు!

Thursday 18th April 2019
Markets_main1555568804.png-25202

సీఎల్‌ఎస్‌ఏ అంచనా
ఈ దఫా మరోమారు బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్‌డీఏ అధికారంలోకి వస్తుందని దేశీయ మార్కెట్లు క్రమంగా ప్రైస్‌ఇన్‌ చేసుకుంటున్నాయని బ్రోకింగ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ అభిప్రాయపడింది. మార్కెట్‌ అంచనాలు నిజమైతే సూచీల్లో మరింత అప్‌మూవ్‌ ఉంటుందని అంచనా వేసింది. ఈ సమయంలో ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, గోద్రేజ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, రామ్‌కో, ఆర్‌ఐఎల్‌, ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, ఐటీసీ, ఇండస్‌ ఇండ్‌బ్యాంక్‌ షేర్లను రికమండ్‌ చేసింది. ప్రస్తుతం ఎఫ్‌ఐఐ, డీఐఐల్లో మార్కెట్‌పై ఆశావహ ధృక్పథం సాధారణ స్థాయిల కన్నా 6 శాతం ఎక్కువగా ఉందని తెలిపింది. ఇప్పటివరకు మార్కెట్లో వచ్చిన విదేశీ నిధులన్నీ వర్ధమాన మార్కెట్లపై ఎఫ్‌ఐఐలకు పెరిగిన మక్కువకు తార్కాణమని తెలిపింది. ఎన్నికల తర్వాత బలమైన ప్రభుత్వం వస్తే భారత్‌లోకి నిజమైన విదేశీ నిధుల వెల్లువ వస్తుందని అంచనా వేసింది.
ఎవరొస్తే ఎలా ఉండొచ్చు...
- బీజేపీ ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తే సూచీల్లో స్వల్ప ర్యాలీ ఉంటుంది. 
- ఎన్‌డీఏకు అనూహ్య మెజార్టీ వచ్చిందంటే మాత్రం భారీ ర్యాలీ ఉంటుంది. 
- కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వం వస్తే తొలుత కరెక‌్షన్‌ ఉంటుంది. కానీ ఈ పతనం పెద్దగా ప్రమాదకారి కాబోదు. ఈ కరెక‌్షన్‌ను కొనుగోళ్లకు అవకాశంగా చూడొచ్చు.
- థర్డ్‌ ఫ్రంట్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వం లేదా అస్థిర ప్రభుత్వం వస్తే భారీ పతనం ఉంటుంది. ఈ పతనం పది శాతానికి పైనే ఉండొచ్చు. 



You may be interested

బ్యాంకులు, ఎఫ్‌ఎంసీజీలపై ఎఫ్‌ఐఐల మక్కువ

Thursday 18th April 2019

ఎన్నికల సీజన్‌ ఆరంభమవుతున్న తరుణంలో విదేశీ మదుపరులు దేశీ సూచీల్లో ఇబ్బడిముబ్బడిగా నిధులు కుమ్మరించారు. దీంతో నిఫ్టీ, సెన్సెక్స్‌లు ఆల్‌టైమ్‌ హైని తాకాయి. ఈ నేపథ్యంలో ఎఫ్‌ఐఐలు దేశీ మార్కెట్లో ఎక్కువగా బ్యాంకింగ్‌, కన్జూమర్‌ స్టాపిల్స్‌ రంగాలపై ఎక్కువ పెట్టుబడులు పెట్టినట్లు ఎన్‌ఎస్‌డీఎల్‌ డేటా చెబుతోంది. ఎఫ్‌ఐఐల మొత్తం పెట్టుబడుల్లో 32 శాతం ఈ రెండు రంగాల్లోకి మరలినట్లు తెలిపింది. ఆర్థిక సేవల కంపెనీలను కూడా కలుపుకుంటే ఈ మొత్తం

ఈ ఏడాది కనిష్టం వద్ద పసిడి ధర

Thursday 18th April 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర గురువారం ఈ ఏడాది కనిష్టం వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఆర్థిక మందగమన ఆందోళన భయాలు తగ్గుముఖం పట్టడం ఇందుకు కారణం. ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌సెషన్‌లో ఔన్స్‌ పసిడి 3డాలర్లు నష్టపోయి 1,273 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇటీవల పలు దేశాలు వెల్లడించిన మెరుగైన ఆర్థిక గణాంకాలు అంతర్జాతీయ ఆర్థిక మందగమనం తగ్గుముఖం పట్టిందనే అంశం స్పష్టం అవుతోంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను

Most from this category