STOCKS

News


ఇండియా మార్కెట్లో మరింత సత్తా ఉంది.. వచ్చేయండి!

Friday 22nd March 2019
Markets_main1553234556.png-24744

విదేశీ ఇన్వెస్టర్లకు క్రిస్‌ఉడ్‌ సలహా
భారత ఈక్విటీ మార్కెట్లో వెయిటేజ్‌లు పెంచుకునేందుకు ఇంకా ఎంతో ఛాన్సుందని, అందువల్ల వెనకముందు ఆలోచించక భారత మార్కెట్లో పెట్టుబడులకు తరలిరావాలని విదేశీ ఇన్వెస్టర్లకు ప్రముఖ వ్యూహకర్త క్రిస్‌ఉడ్‌ సలహా ఇచ్చారు. వారం వారం ఆయన వెలువరించే గ్రీడ్‌ అండ్‌ ఫియర్‌ నివేదికలో భారత మార్కెట్‌పై పాజిటివ్‌గా స్పందించారు. ఇటీవల దేశీ మార్కెట్లో ఉన్నట్లుండి ఎఫ్‌ఐఐల ప్రవాహం పెరగడంపై స్పందిస్తూ సుస్థిర ప్రభుత్వంపై ఆశలే ఇందుకు కారణమన్నారు. పుల్వామా ఘటన తర్వాత భారత్‌ జరిపిన వైమానికదాడులు బీజేపీ ప్రభుత్వానికి ఎంతో పాజిటివ్‌గా మారాయన్నారు. తాజా ఒపీనియన్‌ పోల్స్‌ ఇదే విషయం స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. అందుకే భారత్‌పై డబుల్‌ ఓవర్‌వెయిట్‌గా ఉన్నట్లు చెప్పారు. ఈ ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్‌టీ, నోట్లరద్దు సంస్కరణలతో ఎకానమీలో కొన్ని ఇబ్బందులు వచ్చాయని చెప్పారు. ప్రస్తుతం ఇవి క్రమంగా తొలగిపోతున్నాయన్నారు. ఒకపక్క ఎఫ్‌ఐఐలు వెల్లువగా ఇండియాలోకి వస్తుండగా, దేశీయ నిధులు సన్నగిల్లడంపై ఉడ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఎంఎఫ్‌ల్లోకి వచ్చే నిధులైనా తగ్గకుండా ఉండాలన్నారు. ఈ ఏడాది తొలి రెండు నెలల్లో దేశీయ ఈక్విటీ ఎంఎఫ్‌ల్లోకి నెలవారీ నిధుల ప్రవాహంలో దాదాపు మూడోవంతు తరుగుదల కనిపించింది. ఈ విషయం మినహాయిస్తే భారత్‌పై ఓవర్‌వెయిట్‌గా ఉండేందుకు అనేక కారణాలున్నాయని చెప్పారు. ఇప్పటికి మూడేళ్లుగా ఎఫ్‌ఐఐలు భారత ఈక్విటీల్లో పెద్దగా హోల్డింగ్స్‌ పెంచుకోనందున, ఇకపై దృష్టి పెట్టవచ్చన్నారు. 



You may be interested

రెండేళ్ల గరిష్ఠానికి ఎఫ్‌ఐఐ నెలవారీ కొనుగోళ్లు

Friday 22nd March 2019

దేశీయ మార్కెట్లపై విదేశీ సంస్థాగత మదుపరులకు ఒక్కమాటుగా మక్కువ పెరిగిపోయింది. దీంతో మార్చిలో సూచీలు చెలరేగిపోయాయి. సుస్థిర ప్రభుత్వంపై ఆశలు, కేంద్రబ్యాంకు సరళీకృత ధృక్పథం.. మార్కెట్‌పై ఎఫ్‌పీఐలను పాజిటివ్‌గా మార్చాయి. దీంతో అటు క్యాష్‌ ఇటు డెరివేటివ్స్‌ మార్కెట్లలో ఎఫ్‌ఐఐలు ఇబ్బడిముబ్బడిగా కొనుగోళ్లు జరుపుతున్నాయి. మార్చిలో ఇంతవరకు ఎఫ్‌ఐఐలు 27వేల కోట్ల రూపాయల కొనుగోళ్లు జరిపాయి. ఒకనెల్లో ఇంతమొత్తంలో ఎఫ్‌ఐఐలు దేశీ మార్కెట్లో కొనుగోళ్లు జరపడం రెండేళ్ల తర్వాత ఇదే

పసిడిలో లాభాల స్వీకరణ

Friday 22nd March 2019

ఈక్విటీ మార్కెట్ల ర్యాలీతో పసిడి ధర ప్రపంచ మార్కెట్లో 3వారాల గరిష్టస్థాయి నుంచి వెనక్కి వచ్చింది. అయితే ఈ ఏడాదిలో కూడా వడ్డీరేట్ల పెంపు ఉండదనే ఫెడ్‌ సంకేతాలు పసిడి మద్దతునిస్తున్నాయి. కీలక వడ్డీరేట్లపై ఫెడ్‌ యధాతధ పాలసీ విధాన ప్రకటన తర్వాత అమెరికా 10 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్‌ ఏడాది కనిష్టానికి, డాలర్‌ ఇండెక్స్‌ 6వారాల కనిష్టానికి క్షీణించాయి. ఫలితంగా నిన్నటి ట్రేడింగ్‌లో పసిడి ధర 20డాలర్లు లాభపడి

Most from this category