STOCKS

News


టాటామోటర్స్‌....మూడీస్‌ నెగిటివ్‌ రేటింగ్‌

Wednesday 14th November 2018
Markets_main1542190638.png-22003

ప్రముఖ రేటింగ్‌ మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ సంస్థ టాటామోటర్స్‌ షేరుపై రేటింగ్‌ అవుట్‌లుక్‌ను ‘‘స్థిరత్వం’’ నుంచి ‘‘ప్రతికూలం’’కు మార్చింది. టాటా మోటర్స్‌ బ్రిటన్‌ అనుబంధ సంస్థ జాగ్వర్‌ లాండ్‌ రోవర్‌(జేఎల్‌ఆర్‌) నిర్వహణ ప్రదర్శన అంచనాలకు మించి తక్కువగా నమోదు చేసింది రేటింగ్‌ తగ్గిస్తున్నట్టు మూడీస్‌ తెలిపింది. పెరుగుతున్న ఇన్‌పుట్‌ వ్యయాలు, ఇంధన ధరలు జేఎల్‌ఆర్‌ కంపెనీ పరపతి సామర్థ్యం బలహీనంగా ఉండటం, ఇటీవల మరోసారి తెరపైకి వచ్చిన యూరోపియన్‌ కూటమి నుంచి బ్రిటన్‌ వైదొలిగే ప్రక్రియ బ్రెగ్జిట్‌పై నెలకొన్న సందిగ్ధత తదితర అంశాలను పరిగణాలోకి టాటా మోటర్‌ షేరుకు రేటింగ్‌ సవరించడమైనదని మూడీస్‌ వైస్‌ ఛైర్మన్‌ కౌస్తుబు చౌబాల్ చెప్పుకొచ్చారు. ఈ ప్రతికూల పరిస్థితుల ప్రభావం షేరుపై మరో ఏడాదిన్నర కాలం ఉంటుందని చౌబాల్ స్పష్టం చేశారు. అదేవిధంగా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి సంవత్సరంలో నిర్వహణ ప్రదర్శన ఆశించిన స్థాయిలో నమోదుచేయలేదని అందుకు అనుగుణంగా ఈ జేఎల్‌ఆర్‌ వాహన విక్రయాలు అక్టోబర్‌లో తగ్గిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

టాటామోటర్స్‌ షేరుకు మూడీస్‌ నెగిటివ్‌ రేటింగ్‌ కేటాయింపు నేపథ్యంలో బీఎస్‌ఈలో ఆ షేరు 1.60శాతం నష్టంతో రూ.176.80ల వద్ద ముగిసింది.You may be interested

ఆకర్షణీయమైన 5 బ్యాంక్‌ స్టాక్స్‌..

Wednesday 14th November 2018

అసెట్‌ క్వాలిటీ బాగలేకపోవడం, అధిక కార్పొరేట్‌ రుణాలు, ఆర్థిక వృద్ధి నెమ్మదించడం, డిఫాల్ట్‌ సమస్యలు, ఆర్‌బీఐ సత్వర దిద్దుబాటు చర్యలు వంటివాటి వల్ల ప్రభుత్వ రంగ బ్యాంక్‌ (పీఎస్‌యూ బ్యాంకులు) షేర్లు ఇన్వెస్టర్ల ఆదరణ పొందలేకపోతున్నాయి. రుణాల్లో వృద్ధి మోస్తారుగా ఉన్నా కూడా పీఎస్‌యూ బ్యాంకులు డిపాజిట్లు పెరిగాయని హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ ఈడీ, సీఐవో ప్రశాంత్‌ జైన్‌ తెలిపారు. క్రెడిట్‌ సైకిల్‌ టర్న్‌అరౌండ్‌ అయితే పలు బ్యాంకులు మంచి పనితీరు

ఎంఎస్‌సీఐ స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌లో మరో 13 భారత కంపెనీలు

Wednesday 14th November 2018

ఎంఎస్‌సీఐ గ్లోబల్‌ స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లో తాజాగా 13 దేశీ కంపెనీలకు స్థానం దక్కింది. ఫైనాన్షియల్‌ విభాగంలో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, భార‌త్ ఫైనాన్షియ‌ల్ ఇంక్లూజ‌న్, ఈక్విటాస్ హోల్డింగ్స్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్,  పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు చోటుదక్కింది. వీటితో పాటు అదానీ ట్రాన్స్‌మిషన్స్‌, ఫ్యూచర్ కన్స్యూమర్, లెమన్ ట్రీ హోటల్స్, మెర్క్, స్కెఫ్లర్‌ ఇండియా, సస్‌టెక్‌ రియాల్టీ, టాటా కెమికల్స్, వెస్ట్ లైఫ్ డెవలప్‌మెంట్‌ ఉన్నాయి.  తొలగించిన జాబితా మొత్తం

Most from this category