STOCKS

News


నెలరోజుల కోసం టాప్‌ టెన్‌ సిఫార్సులు

Monday 13th August 2018
Markets_main1534138777.png-19214

వచ్చే నెల రెండు నెలల్లో 14 శాతం వరకు లాభాన్నిచ్చే పది స్టాక్స్‌ను వివిధ బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేస్తున్నాయి.
ఏంజల్‌ బ్రోకింగ్‌ సిఫార్సులు
1. టాటాస్టీల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 610. స్టాప్‌లాస్‌ రూ. 553. గత రెండు వారాలుగా మెటల్‌ స్టాకుల్లో టాటాస్టీల్‌ టర్న్ ఎరౌండ్‌ చూపి అప్‌మూవ్‌లోకి మళ్లింది. గత వారం రూ. 565ను దాటి బుల్లిష్‌ బ్రేకవుట్‌ సాధించింది. వారం చార్టుల్లో మరింత అప్‌మూవ్‌ అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో రూ. 600ను దాటే ఛాన్సులున్నాయి.
2. కన్సాయ్‌ నెరోలాక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 600. స్టాప్‌లాస్‌ రూ. 482. వరుసగా నాలుగు సెషన్లు లాభాల్లో పయనించింది. వాల్యూంలు కూడా బాగున్నాయి. కౌంటర్లో కొనుగోళ్ల సందడి ఎక్కువగా ఉంది. వీక్లీ చార్టుల్లో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఆర్‌ఎస్‌ఐ 70 స్థాయిని దాటి బుల్లిష్‌గా ఉంది. 
యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ సిఫార్సులు
1. ఎఅండ్‌ఎం: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 994. స్టాప్‌లాస్‌ రూ. 919. తొమ్మిదివారాల పాటు రూ. 875- 940 మధ్య కన్సాలిడేషన్‌ జరిపి తాజాగా బ్రేకవుట్‌ సాధించింది. కన్సాలిడేషన్‌ ముగింపు వాల్యూంలు బాగున్నాయి. ఆర్‌ఎస్‌, స్టోకాస్టిక్‌ ఇండికేటర్లు పాజిటివ్‌ క్రాసోవర్‌ చూపుతున్నాయి. ప్రస్తుతం తన 20, 50, 100 రోజుల డీఎంఏ స్థాయిలకు పైన కదలాడుతూ బుల్లిష్‌గా కనిపిస్తోంది. 
2. శోభా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 560. స్టాప్‌లాస్‌ రూ. 498. గతవారం అధోముఖ వాలు రేఖను రూ. 490 వద్ద పైవైపుగా ఛేదించింది. వాల్యూంలు సౌతం బాగున్నాయి. చార్టుల్లో ఆర్‌ఎస్‌ఐ పాజిటివ్‌ సంకేతాలు ఇస్తోంది. స్వల్పకాలిక డీఎంఏ స్థాయిలకు పైన స్టాకు కదలాడుతూ బుల్లిష్‌గా ఉంది. 
3. ఆర్తి ఇండస్ట్రీస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1440. స్టాప్‌లాస్‌ రూ. 1329. చార్టుల్లో రౌండింగ్‌ బాటమ్‌ పాటర్న్‌ నుంచి పాజిటివ్‌ బ్రేకవుట్‌ సాధించింది. ఈ సందర్భంగా హెవీ వాల్యూంలు నమోదయ్యాయి. చార్టుల్లో స్టోకాస్టిక్‌ ఇండికేటర్‌ అప్‌మూవ్‌కు మద్దతు సంకేతాలు ఇస్తోంది. 
చార్ట్‌వ్యూ ఇండియా సిఫార్సులు
1. ఎంఅండ్‌ఎం: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1020. స్టాప్‌లాస్‌ రూ. 927. శుక్రవారం లైఫ్‌టైమ్‌ హైని తాకి కొత్త బ్రేకవుట్‌ చూపింది. 2018 మేలో రూ. 933ను తాకిన అనంతరం కన్సాలిడేషన్‌కు లోనై తాజాగా అందులోంచి బయటకు వచ్చింది. రూ. 950 స్థాయిలకు పైన వేగం పెరుగుతుంది. ఈ స్థాయికి పైన 1020 రూపాయల వరకు ర్యాలీ కొనసాగనుంది.
2. బీపీసీఎల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 429. స్టాప్‌లాస్‌ రూ. 380. రెండు సెషన్లుగా రూ. 384- 404 స్థాయిలో తిరుగుతూ బ్రేకవుట్‌ సాధించే యత్నాల్లో ఉంది. ఈ శ్రేణిని పైవైపుగా ఛేదిస్తే మరింత అప్‌మూవ్‌ ఉంటుంది.
3. ఏసియన్‌ పెయింట్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1490. స్టాప్‌లాస్‌ రూ. 1390. గరిష్ఠస్థాయిలను రూ. 1490 వద్ద తాకి వేగంగా వెనుతిరిగింది. రూ. 1394 వద్ద బలమైన మద్దతు పొందింది. చార్టుల్లో పాజిటివ్‌ సిగ్నల్స్‌ కనిపిస్తున్నాయి. 
కార్వీ సిఫార్సులు
1. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 7450. స్టాప్‌లాస్‌ రూ. 6850. డైలీ, వీక్లీ చార్టుల్లో హయ్యర్‌ హై, లోయర్‌ లో ఏర్పరుస్తూ అప్‌ట్రెండ్‌ కొనసాగిస్తోంది. నిఫ్టీ ఫైనాన్స్‌ సూచీతో పోలిస్తే మెరుగైన ప్రదర్శన చూపుతోంఇ. తాజాగా కన్సాలిడేషన్‌ రేంజ్‌ను పైవైపుగా దాటి మరింత్‌ అప్‌మూవ్‌కు రెడీ అయింది. ఆర్‌ఎస్‌ఐ ఇండికేటర్‌ బుల్లిష్‌గా ఉంది. 
2. జుబిలాంట్‌ ఫుడ్‌వర్క్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1600. స్టాప్‌లాస్‌ రూ. 1459. నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ సూచీతో పోలిస్తే భారీ లాభంతో గతవారాన్ని ముగించింది. రూ. 1382 వద్ద బలమైన మద్దతు లభిస్తోంది. ఏడాది కాలంగా బలమైన అప్‌ట్రెండ్‌లో ఉంది. ఇదే ధోరణి ఇకముందు కూడా కొనసాగుతుంది. చార్టుల్లో ఆర్‌ఎస్‌ఐ తదితర ఇండికేటర్లు పాజిటివ్‌గా ఉన్నాయి.

 You may be interested

28,000 దిగువకు బ్యాంక్‌ నిఫ్టీ

Monday 13th August 2018

ముంబై:- ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన నిఫ్టీ బ్యాంకు సూచీ సోమవారం ట్రేడింగ్‌లో 1శాతానికి పైగా పతనమై 28వేల మార్కును కోల్పోయింది. నేడు ఈ సూచీ 27,760 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నేటి మార్కెట్‌ పతనంలో భాగంగా బ్యాంకు షేర్లు నష్టాల బాట పట్టడంతో ఇటీవల అందుకున్న నిఫ్టీ బ్యాంకు  28వేల పాయింట్ల మార్కును కోల్పోయింది. ఈ సూచీలోని హెవీ వెయిటేజ్‌ షేర్లైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, యస్‌బ్యాంకు,

ఈ స్టాక్స్‌ కొనచ్చు..

Monday 13th August 2018

టైటాన్‌    కొనచ్చు  బ్రోకరేజ్‌ సంస్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌ ప్రస్తుత ధర: రూ.921 టార్గెట్‌ ధర: రూ.1,130 ఎందుకంటే: వాచ్‌లు, బ్రాండెడ్‌ జ్యూయలరీ రంగాల్లో అగ్రస్థానం ఈ కంపెనీదే. ఈ కంపెనీకి చెందిన ఎకానమీ వాచ్‌ సెగ్మెంట్‌... సొనాటా.. భారత్‌లోనే అత్యధికంగా అమ్ముడయ్యే వాచ్‌ బ్రాండ్‌. టాటా గ్రూప్‌కు చెందిన ఈ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. ఆదాయం 9 శాతం వృద్ధితో రూ.4,450 కోట్లకు పెరిగింది.

Most from this category