News


ఓపిక ఉన్న వారికే లాభాలు!

Monday 26th November 2018
Markets_main1543170925.png-22371

ఇటీవలి కరెక్షన్‌ సాధారణ ఇన్వెస్టర్ల పట్టుదలను, సహనాన్ని, ఓపికను తెగ పరీక్షించింది. సాధారణంగా ఇటువంటి సందర్భాల్లో ఎక్కువ మంది రిటైల్‌ ఇన్వెస్టర్లు చేయకూడని తప్పులే చేస్తుంటారు. మార్కెట్లు పెరిగినప్పుడు పడడం... అలాగే, పడిన తర్వాత తిరిగి పెరగడం అనేవి ఎప్పుడూ జరుగుతుండే ప్రక్రియలేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈక్విటీలు అంటేనే ఆటుపోట్లతో కూడినవని, ఒక్కసారిగా వచ్చి పడే నష్టాలను ఎదుర్కొనేందుకు మార్గాలు ఉన్నాయని మార్కెట్‌ సీనియర్లు చెబుతున్నారు. లాభాలు గడించాలంటే నష్టాలను పరిమితం చేసుకోవడం కీలకమైన అంశంగా తెలియజేస్తున్నారు. అది ఎలా? అన్న సందేహం రావచ్చు. నష్టాలను అధిగమించడం, లాభాలు కాపాడుకోవడం, మార్కెట్లలో లాభాలు సొంతం చేసుకోవడం అనే కళ తెలియాలంటే అందుకు నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుంటే పోదూ...

 

విలువకు ప్రాధాన్యం
మార్కెట్‌ సెంటిమెంట్‌ ఆధారంగా వచ్చే ఆటుపోట్లకు దూరంగా ఉండిపోవాలి. మార్కెట్‌ కరెక్షన్‌ కంటే ఇన్వెస్ట్‌ చేసిన కంపెనీ అంతర్గత విలువకే ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. అందుకే పెట్టుబడికి ముందే కంపెనీ గురించి తెలుసుకోమంటారు. కంపెనీ ఏం తయారు చేస్తుంది, కార్యకలాపాలు ఏంటి, ఆ కంపెనీ ఆస్తులు, అప్పులు ఇవన్నీ తెలుసుకోవాలి. 

 

వదంతులు వద్దు... లెక్కలే ముఖ్యం
వదంతులపై ఎక్కువ మంది ఆధారపడి ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. పెట్టుబడి అన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ జూదం కాకూడదు. భవిష్యత్తుపై ఊహాజనితాల కంటే కూడా వాస్తవాలపైనే ఆధారపడాలి. కంపెనీ వార్షిక నివేదిక, ఫలితాల వివరాలు, వ్యాపార విస్తరణ, రుణ భారం ఇత్యాది వివరాలన్నీ బేరీజు వేసుకోవాలి.

 

ఓపిక పడితే మంచిదే
స్టాక్‌ ఇన్వెస్టింగ్‌లో సహనం అనేది మంచి ఫలితాలనే ఇస్తుందని మార్కెట్‌ పండితులు సైతం చెబుతుంటారు. చురుకుదనం నుంచి సహనానికి డబ్బులను బదలాయించేందుకే స్టాక్‌ మార్కెట్‌ డిజైన్‌ చేయబడిందన్నది వారెన్‌ బఫెట్‌ విశ్లేషణ. 

 

పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యం
అన్ని గుడ్లను ఒకే పెట్టెలో పెడితే పగిలిపోయే ‍ప్రమాదం ఎలా ఉంటుందో... పెట్టుబడి అంతంటినీ తీసుకెళ్లి ఒకే కంపెనీలో ఇన్వెస్ట్‌ చేశారనుకోండి. ఆ కంపెనీ ఉన్నట్టుండి ఏదైనా సంక్షోభంలో పడితే, లేదా సమస్యల్లో చిక్కుకుంటే పెట్టుబడి భారీగా కోల్పోవాల్సి వస్తుంది. అందుకే పెట్టుబడుల్లో వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి. అంటే ఒకే కంపెనీలో, ఒకే తరహా కంపెనీల్లో, ఒకే రంగంలోని కంపెనీల్లో కాకుండా... లార్జ్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌, భిన్న రంగాల కలయికగా ఉండాలి.

 

తొందరపడి లాభాల స్వీకరణ
ప్రతికూల వార్తలకు భయపడి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కూడా ఒక్కో సారి నష్టం కలిగించొచ్చు. కనుక, వాస్తవాలను చూసి నిర్ణయం తీసుకోవాలి. అందుకు ఓపిక అవసరం.
 You may be interested

కంపెనీ అమ్మకాలు, లాభాలు.. ఏది చూడాలి?

Monday 26th November 2018

ఓ కంపెనీ పనితీరును మదింపు వేసేందుకు ఆ కంపెనీ వ్యాపారం ద్వారా ఆర్జిస్తున్న ఆదాయం, లాభాలు ఈ రెండూ చాలా కీలకమైన అంశాలవుతాయి. అమ్మకాలు, లాభాలు పెంచుకోవడం అన్నవి వేర్వేరు. ఒకదానితో పోలిస్తే మరొకటి అధికంగా పెరిగినప్పుడు కచ్చితంగా అది చర్చకు తావిస్తుంది.    అమ్మకాలు పెంచుకోవడం అన్నది మార్కెట్‌ వాటా విస్తరణే లక్ష్యమని భావించాల్సి ఉంటుంది. ధరలపై తగ్గింపులు ఇవ్వడం, లేదా తక్కువ ధరలకు వస్తువులను ఆఫర్‌ చేయడం ద్వారా కస్టమర్ల

క్రూడ్‌ పతనం.. ఈ షేర్లకు లాభం

Saturday 24th November 2018

ముంబై: ముడిచమురు ధరలు భారీగా దిగివచ్చిన నేపథ్యంలో ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణ భయాలు తగ్గిపోయి ఈనెలలో స్టాక్‌ మార్కెట్‌ కోలుకోగా.. క్రూడ్‌ ధరలతో ప్రత్యక్ష సంబంధం కలిగిన అనేక కంపెనీల షేర్లు ర్యాలీని నమోదుచేశాయి. అక్టోబర్‌ 3 నుంచి ఇప్పటివరకు ముడిచమురు ధరలు 31 శాతం పతనమవగా.. ఈకాలంలో విమానయాన, టైర్‌, పెయింట్‌ కంపెనీల షేర్లు 6 నుంచి 80 శాతం వరకు పెరిగాయి. గతనెల 3న రూ.177 వద్ద ఉన్నటువంటి

Most from this category