STOCKS

News


నిధుల ప్రవాహం బలంగా ఉంటే ఫండమెంటల్స్‌ పట్టించుకోరు!

Thursday 21st March 2019
Markets_main1553164875.png-24738

అజయ్‌ బగ్గా
సాధారణంగా మార్కెట్లో ట్రెండ్‌కు వ్యతిరేకంగా పోవద్దని సలహా ఇస్తారు. ప్రస్తుతం మార్కెట్లోకి లిక్విడిటీ ప్రవాహం ఒక్కమారుగా పెరిగిందని, ఈ ట్రెండ్‌కు ఎదురుపోవడం మంచిదికాదని ప్రముఖ ఇన్వెస్టర్‌ అజయ్‌ బగ్గా సలహా ఇస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఫండమెంటల్స్‌లో పెద్దమార్పులేమీ రాలేదని, కానీ ఉన్నట్లుండి ఎఫ్‌ఐఐల నుంచి నిధుల ప్రవాహం పెరగడంతో మార్కెట్లు మూలాలను మర్చిపోయాయని చెప్పారు. ఒపీనియన్‌ పోల్స్‌ ప్రకారం మరోమారు సుస్థిర ప్రభుత్వం వస్తుందన్న నమ్మకాలు దేశీయంగా సెంటిమెంట్‌ను బలపరిచాయన్నారు. మదుపరులు సుస్థిరతను స్వాగతిస్తున్నారన్నారు. అంతర్జాతీయంగా క్రమంగా మందగమన మేఘాలు అలముకుంటున్నాయని, అందుకు పలు కేంద్ర బ్యాంకులు తమ పాలసీ పగ్గాలను సడలిస్తున్నాయని తెలిపారు. మందగమన భయాలతోటే ఫెడ్‌ సైతం రేట్ల పెంపునకు విముఖత చూపిందన్నారు. బాలెన్స్‌ షీట్‌ తగ్గింపు కార్యక్రమాన్ని కూడా సెప్టెంబర్‌ నుంచి ఆపుతామని ప్రకటించిందని గుర్తు చేశారు. ఇవన్నీ వర్ధమాన మార్కెట్లకు చాలా పాజిటివ్‌ విషయాలని వివరించారు. వర్ధమాన మార్కెట్లలో భారత్‌ బలంగా కనిపిస్తోందని, అందుకే బలమైన విదేశీ నిధుల ప్రవాహం వస్తోందని తెలిపారు. ఈ తరుణంలో ఫండమెంటల్స్‌ను ఎవరూ పట్టించుకోరన్నారు. ఇది కేవలం వన్‌వే(అప్‌మూవ్‌) మార్కెటని అభివర్ణించారు. ఇలాంటి మార్కెట్లలో ముందుకు వెళ్లడానికి సిద్ధమైతే అడుగుపెట్టాలని లేదంటే నిశ్శబ్దంగా ఉండాలని, వ్యతిరేక దిశలో ఆలోచనలు చేస్తే దెబ్బతింటారని సలహా ఇచ్చారు. వచ్చే నెల్లో ఎన్నికల సందర్భంగా చిన్నపాటి పతనాలు, కన్సాలిడేషన్లు రావచ్చని అజయ్‌ అంచనా వేశారు. అయితే ఇవన్నీ మరింతగా పెట్టుబడులు పెరిగేందుకే దోహదం చేస్తాయని, ఈ లిక్విడిటీని మనం స్వాగతించాలని చెప్పారు. You may be interested

ఆర్‌ఈసీ ఇక పీఎఫ్‌సీ సొంతం

Thursday 21st March 2019

ప్రభుత్వరంగంలోని విద్యుత్‌ రంగ ఫైనాన్స్‌ సంస్థలు పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ మధ్య డీల్‌ ఖరారైంది. పెట్టుబడుల ఉపసంహరణ, వాటాల విక్రయంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం రూ.80,000 కోట్లను సమీకరించాలనే లక్ష్యాన్ని విధించుకున్న విషయం తెలిసిందే. ఈ లక్ష్యం చేరికలో భాగంగానే కేంద్ర సర్కారు ఆర్‌ఈసీలో తనకున్న 52.63 శాతం వాటాను పీఎఫ్‌సీకి విక్రయించడం ద్వారా నిధుల సమీకరణకు మొగ్గు చూపించింది. ఈ డీల్‌కు ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ

120 కోట్లు దాటిన టెలికం సబ్‌స్క్రైబర్ల సంఖ్య

Thursday 21st March 2019

- జనవరి వృద్ధిరేటు 0.49 శాతం న్యూఢిల్లీ: టెలికం సబ్‌స్ర్కైబర్ల సంఖ్య ఈ ఏడాది జనవరిలో మరోసారి 120 కోట్ల మార్కును అధిగమించింది. ఈ మార్కును మించి సబ్‌స్ర్కైబర్లు జతకావడం ఇది మూడవసారని టెలికం రెగ్యులేటర్‌ ట్రాయ్‌ తాజాగా విడుదల చేసిన నివేదిక ద్వారా వెల్లడైంది. 2017 జూలై, 2018 మే తరువాత 120 కోట్లు మార్కును చేరడం ఇదే తొలిసారి. గతేడాది డిసెంబర్‌లో నమోదైన మొత్తం సబ్‌స్క్రైబర్ల సంఖ్య 119.7

Most from this category