News


కార్పొరేట్‌ బ్యాంకుల్లో ఈ మూడూ బెస్ట్‌..

Wednesday 21st November 2018
Markets_main1542789359.png-22266

కార్పొరేట్‌ బ్యాంకులపై పాజిటివ్‌గా ఉన్నానని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (హెచ్‌ ఆఫ్‌ రీసెర్చ్‌-రిటైల్‌) సిద్ధార్థ ఖెమ్కా తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేశారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. 
సుబొక్సొన్‌ జనరిక్‌కు ఆమోదం లభించం డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌కు సానుకూల అంశమని సిద్ధార్థ ఖెమ్కా తెలిపారు. ఇప్పటికే స్టాక్‌ ధరపై ఈ ప్రభావం కనిపిస్తోందని పేర్కొన్నారు. స్టాక్‌ వ్యాల్యుయేషన్స్‌ కొద్దిగా పెరిగాయని తెలిపారు. సుబొక్సొన్‌ ఆమోదం నేపథ్యంలో స్టాక్‌కు న్యూట్రల్‌ రేటింగ్‌ ఇస్తున్నామని, టార్గెట్‌ ప్రైస్‌ను రూ.2,300గా నిర్ణయించామని పేర్కొన్నారు. కొత్త ప్రొడక్టులను అనుమతులు లభించడం, వాటిని మార్కెట్‌లోకి తీసుకురావడం వల్ల రానున్న కాలంలో షేరు ధర పెరగొచ్చని అంచనా వేశారు. 
పేజ్‌ ఇండస్ట్రీస్‌ను గమనిస్తే.. కేవలం ఒక క్వార్టర్‌ ఎర్నింగ్స్‌ మాత్రమే నిరుత్సాహానికి గురిచేశాయని సిద్ధార్థ ఖెమ్కా తెలిపారు. కంపెనీకి మంచి ట్రాక్‌ రికార్డ్‌ ఉందని, 20 శాతానికి పైగా వృద్ధి రేటును నమోదు చేస్తూ వస్తోందని పేర్కొన్నారు. ధరల పెరుగుదల భారాన్ని డిసెంబర్‌-జనవరి మధ్య కాలంలో బదిలీ చేయవచ్చని తెలిపారు. దీని వల్ల మళ్లీ వృద్ధి నమోదవుతుందని పేర్కొన్నారు. ఈసారి గమనిస్తే పండుగ సీజన్‌లో అమ్మకాల వృద్ధి తక్కువగా నమోదయ్యిందని తెలిపారు. ఇతర ఆటో సహా ఇతర రంగాలోనూ ఇదే ట్రెండ్‌ కనిపించిందని పేర్కొన్నారు. పేజ్‌ ఇండస్ట్రీస్‌పై దీర్ఘకాలంలో పాజిటివ్‌గా ఉన్నామని తెలిపారు. అయితే వ్యాల్యుయేషన్స్‌ ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. స్టాక్‌ ధర కరెక‌్షన్‌కు గురైతే కొంత విలువకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఏడాది లక్ష్యంతో స్టాక్‌ను కొనుగోలు చేస్తే చెప్పుకోదగ్గ రిటర్న్స్‌ అందించకపోవచ్చని, దీర్ఘకాలంలో స్టాక్‌పై పాజిటివ్‌గా ఉన్నానని పేర్కొన్నారు. 
క్యూ2 ఎర్నింగ్స్‌ తర్వాత కార్పొరేట్‌ బ్యాంక్‌ విభాగంపై సానుకూలముగా ఉన్నామని సిద్ధార్థ ఖెమ్కా తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐలపై పాజిటివ్‌గా ఉన్నామని పేర్కొన్నారు. వీటిల్లో రుణ నాణ్యత మెరుగుపడుతోందని, వృద్ధి అంచనా వేస్తున్నామని తెలిపారు. 
దీర్ఘకాలంలో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలపై పాజిటివ్‌గా ఉన్నామని సిద్ధార్థ ఖెమ్కా పేర్కొన్నారు. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేశారు. కంపెనీ వద్ద నగదు నిల్వలు ఎక్కువగా ఉన్నాయని, క్యాష్‌ఫ్లో బాగుందని తెలిపారు. భారత్‌ పెట్రోలియంకు బై రేటింగ్‌ ఇస్తున్నామని, హిందుస్తాన్‌ పెట్రోలియంపై న్యూట్రల్‌ రేటింగ్‌తో ఉన్నామని పేర్కొన్నారు.
ఫండమెంటల్‌గా చూస్తే మెటల్స్‌కు పరిస్థితులు సానుకూలముగా ఉన్నాయని సిద్ధార్థ ఖెమ్కా తెలిపారు. హిందాల్కో, ఇతర మెటల్‌ కంపెనీలు మంచి వృద్ధిని నమోదు చేస్తూ వస్తున్నాయని పేర్కొన్నారు. క్యూ2లో నిఫ్టీ ఎర్నింగ్స్‌ పెరుగుదలకు మెటల్‌ ఇండెక్స్‌ ప్రధాన కారణమని తెలిపారు. నికర లాభం పరంగా చూసినా మంచి పనితీరు కనబర్చాయని పేర్కొన్నారు. సైక్లికల్‌గా చూస్తే మెటల్‌ ధరలు కరెక‌్షన్‌కు గురికావొచ్చని తెలిపారు. ప్రస్తుతానికి మెటల్స్‌ ట్రేడింగ్‌ అనుగుణంగా ఉన్నాయని పేర్కొన్నారు. హిందాల్కో, జేఎస్‌పీఎల్‌పై పాజిటివ్‌గా ఉన్నామని తెలిపారు. క్రూడ్‌ ధరలు పడిపోవడం వల్ల దీని ప్రభావం ఇతర బేస్‌ మెటల్స్‌పై కూడా ఉండొచ్చని పేర్కొన్నారు. 
 You may be interested

ఎన్‌బీఎస్‌సీ వృద్ధి అంతంతమాత్రమే: సీఎల్‌ఎస్‌ఏ

Wednesday 21st November 2018

మొండి బకాయిలను పరిష్కరించుకునేందుకు బ్యాంకులు 60-70 శాతం వదులుకోవాల్సిన(హెయిర్‌ కట్‌) అవసరం ఉందని సీఎల్‌ఎస్‌ఏ పేర్కొంది. ముంబై: నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ)ల వృద్ధిరేటు నెమ్మదిస్తుందని అంతర్జాతీయ బ్రోకరేజి సంస్థ సీఎల్‌ఎస్‌ఏ అంచనావేసింది. వచ్చే 6-12 నెలలకాలం వరకు ఇదే పరిస్థితి కొనసాగేందుకు అవకాశం ఉందని విశ్లేషించిన ఈ సంస్థ.. నాలుగవ త్రైమాసికంలో ఎన్‌బీఎఫ్‌సీలు రోలోవర్‌ సమస్యను ఎదుర్కోనున్నట్లు తెలిపింది. బ్యాంక్‌ రుణాలు, కామర్షియల్‌ పేపర్ల అమ్మకాల ద్వారా ఈ

ఎదురీదుతున్న పీఎస్‌యూ బ్యాంక్స్‌ షేర్లు

Wednesday 21st November 2018

ఫార్మా షేర్లతో పాటు ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్ల కూడా నష్టాల మార్కెట్‌కు ఎదురీదుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఇండెక్స్‌ 2శాతం పెరిగింది. ఇంట్రాడేలో డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్ల ర్యాలీ ప్రోత్సాహంతో నిఫ్టీ పార్మా ఇండెక్స్‌ కూడా 2శాతానికి పైగా ర్యాలీ చేసిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నగం 1:15ని.లకు నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ 1.50శాతం లాభంతో 2,968.80 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈ సూచీలో

Most from this category