STOCKS

News


కంపెనీ బలాలు శాశ్వతమేమీ కాదు..!

Wednesday 27th March 2019
Markets_main1553708415.png-24832

ఓ కంపెనీకి ఉన్న ఉత్పత్తులు లేదా సేవల విశిష్టతను చూసి ఇన్వెస్ట్‌ చేస్తున్నారా..? మీ నిర్ణయం మంచిదే. కానీ, ఈ బలాలు శాశ్వతం కాదన్న విషయాన్ని కూడా గుర్తించాలి. ఓ కంపెనీకి ప్రత్యేక బలాలు ఉన్నాయంటే అధిక ఆదాయార్జన, అధిక మార్జిన్లకు అవకాశం ఉన్నట్టు. కనుక ఈ బలాలను చూసి ఇన్వెస్ట్‌ చేసే వారు, ఆ తర్వాత కూడా వీటిని క్రమం తప్పకుండా పరిశీలిస్తూ ఉండాలని నిపుణుల సూచన. మార్కెట్‌ పోటీలో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. మైక్రోసాఫ్ట్‌కు విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఓ బలం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది కంప్యూటర్లలో దాదాపు ఎక్కువ శాతం మైక్రోసాఫ్ట్‌ ఆధారితంగా పనిచేసేవే. వీటిని ఇప్పటికిప్పుడు మార్చే సాహసం ఎవరూ చేయరు. కనుక ఈ ఉత్పత్తి మైక్రోసాఫ్ట్‌కు ఓ బలం, వరం కూడా. కానీ, భవిష్యత్తులోనూ ఇదే ఉంటుందని చెప్పలేం. 

 

ఉదాహరణలు...

మెరుగైన ఉత్పత్తులు - గూగుల్‌, యాపిల్‌

మేథోపరమైన సంపత్తి -  ఫార్మా

తక్కువ ఖర్చులతో కూడిన నిర్మాణం -  శ్రీసిమెంట్‌, టాటా స్టీల్‌

అందరికీ పరిచయమైన బ్రాండ్స్‌ - నెస్‌కెఫె, లెవిస్‌, పిడిటైల్‌ ఫెవికాల్‌ మొదలైనవి

పంపిణీ బలం కలిగినవి -  హిందుస్తాన్‌ యూనిలీవర్‌, అమేజాన్‌

 

మంచి గుర్తింపు ఉన్న బ్రాండ్‌ ఓ కంపెనీకి బలమని చెప్పలేం. ఆ బ్రాండ్‌ కంపెనీకి మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టాలి. బలంలోనూ రెండు కోణాలు ఉన్నాయి. నికలడైన పోటీనిచ్చే అనుకూలత, పోటీ పరంగా అనుకూలంగా ఉండే కాలం. చాలా మంది ఇన్వెస్టర్లు మొదటి దాన్నే చూస్తారు. కానీ, రెండోది కూడా అంతే ప్రాముఖ్యం ఉన్నది. చరిత్రలో చూస్తే కేవలం కొన్ని కంపెనీలే దీర్ఘకాలం పాటు నిలదొక్కుకోగలిగాయి. జనరల్‌ ఎలక్ట్రిక్‌ ఒక్కటే వందల సంవ్సరాలుగా తన ఆధిపత్యాన్ని నెలబెట్టుకుంటూ వస్తోంది. మొదటి సారి సెన్సెక్స్‌నూ రూపొందించినప్పుడు అందులో... ఏషియన్‌ కేబుల్స్‌, బల్లార్‌పూర్‌ ఇండస్ట్రీస్‌, బోంబే బర్మా, సియట్‌, సెంచురీ టెక్స్‌టైల్స్‌, క్రాంప్టన్‌ గ్రీవ్స్‌, గ్లాక్సో స్మిత్‌క్లైన్‌, గ్రాసిమ్‌, జీఎస్‌ఎఫ్‌సీ, హిందాల్కో, హిందుస్తాన్‌ మోటార్స్‌, హెచ్‌ఎల్‌ఎల్‌, ఇండియన్‌ హోటల్స్‌, ఇండియన్‌ ఆర్గానిక్స్‌, ఇండియన్‌ రేయాన్‌, ఐటీసీ, కిర్లోస్కర్‌ కమిన్స్‌, ఎల్‌అంట్‌టీ, ఎంఅండ్‌ఎం, ముకంద్‌, నెస్లే, రిలయన్స్‌ ఇంస్ట్రీస్‌, సీమెన్స్‌, టాటా మోటార్స్‌, ఎస్‌సీఇండియా షిప్పింగ్‌, టాటా పవర్‌, టాటా స్టీల్‌, జెనిత్‌ ఉన్నాయి. కానీ, వీటిల్లో ఈ రోజు ఒకటి రెండు మినహా ఏవీ సెన్సెక్స్‌లో లేవు.You may be interested

సహేతుక ధరల్లో లభిస్తున్న షేర్లు

Wednesday 27th March 2019

ప్రపంచ ప్రసిద్ధ స్టాక్‌ ఇన్వెస్టర్‌ పీటర్‌ లించ్‌ ‘గ్రోత్‌ ఎట్‌ రీజనబుల్‌ ప్రైస్‌’ (జీఏఆర్‌పీ) విధానం లాభాలను కురిపిస్తుందని నిరూపితమైనది. ఆదాయాల్లో స్థిరమైన వృద్ధిని నమోదు చూస్తూ, సహేతుక ధరల వద్ద ట్రేడ్‌ అవుతున్న స్టాక్స్‌ను గుర్తించడమే జీఏఆర్‌పీ. కేవలం 5,000 కిలోమీటర్లే తిరిగిన మారుతి కారును సెకండ్‌ హ్యాండ్‌లో తక్కువ ధరకు సొంతం చేసుకోవడం వంటిది. ఈ విధానంలో కొన్ని స్టాక్స్‌ను వ్యాల్యూ రీసెచ్చ్‌ సంస్థ గుర్తించింది.   కెన్‌ఫిన్‌ హోమ్స్‌ కెనరా

గరిష్టస్థాయిలో అమ్మకాలు...నష్టాల ముగింపు

Wednesday 27th March 2019

100 పాయింట్లు నష్టపోయి సెన్సెక్స్‌ 11450 పాయింట్ల దిగువకు నిఫ్టీ మిడ్‌సెషన్‌ నుంచి మొదలైన అమ్మకాలతో మార్కెట్‌ లాభాలు ఒక్కరోజుకే పరిమితమయ్యాయి. ఫార్మా, అటో, ఇంధన, ఎఫ్‌ఎంజీసీ రంగ షేర్లతో పతనంతో సెన్సెక్స్‌ 100 పాయింట్లు నష్టపోయి 38,133 వద్ద, నిఫ్టీ 38 పాయింట్లు క్షీణించి 11450 మార్కును కోల్పోయి 11,445 వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ అరశాతం లాభపడి 30,020 వద్ద ముగిసింది. బ్యాంకింగ్‌,

Most from this category