STOCKS

News


సెన్సెక్స్‌ లాభం...నిఫ్టీ నష్టం

Thursday 14th February 2019
Markets_main1550115485.png-24184

వరుస నష్టాల్ని కొనసాగిస్తూ గురువారం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సూచి 7 పాయింట్ల నష్టంతో 10,786 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ మాత్రం 30 పాయింట్ల లాభంతో 36,065 పాయింట్ల వద్ద మొదలయ్యింది. ప్రారంభమైన కొద్ది క్షణాల్లో సూచీలు రెండూ నష్టాల్లోకి జారుకున్నాయి. ఆర్థిక అవకతవకల ఆరోపణలపై ఆర్‌బీఐ నుంచి క్లీన్‌చిట్‌ పొందినట్లు ప్రకటించిన యస్‌ బ్యాంక్‌ ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 25 శాతం జంప్‌చేసి రూ. 215 వద్దకు చేరింది. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ 3.5 శాతం పెరిగింది. హీరో మోటో, ఐషర్‌ మోటార్స్‌, ఐటీసీలు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. భారతి ఎయిర్‌టెల్‌, కోల్‌ ఇండియా, కొటక్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లు 1-3 శాతం మధ్య నష్టాలతో మొదలయ్యాయి. 

హాంకాంగ్‌, చైనా డౌన్‌

, తాజాగా చైనా ఎగుమతి దిగుమతి గణాంకాలు విడుదలకానున్న నేపథ్యంలో ఆసియా మార్కెట్లలో హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌, చైనా షాంఘైలు అరశాతంపైగా క్షీణించాయి. సింగపూర్‌, కొరియా సూచీలు స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి.  జపాన్‌, తైవాన్‌ సూచీలు మాత్రం స్వల్పలాభాలతో కదులుతున్నాయి. అమెరికా ప్రభుత్వ షట్‌డవున్‌కు తెరపడుతుందన్న వార్తలు, అమెరికా, చైనా వాణిజ్య చర్చల సఫలంపై ఆశావహ అంచనాలతో గత రాత్రి అమెరికా, యూరప్‌ సూచీలు 0.5-1 శాతం మధ్య ర్యాలీ జరిపాయి.



You may be interested

ఆర్‌బీఐ క్లీన్‌చిట్‌: యస్‌ బ్యాంక్‌ 29శాతం అప్‌

Thursday 14th February 2019

ఎన్‌పీఏల అంశంలో కేంద్ర రిజర్వ్‌బ్యాంక్‌ నుంచి క్లీన్‌చిట్‌ రావడంతో యస్‌బ్యాంక్‌ షేర్లు గురువారం బీఎస్‌ఈలో 10శాతం లాభంతో రూ.రూ.185.95 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. 2015-16 కాలంలో ఎన్‌పీఏల నిర్దారణ, ప్రొవిజనింగ్‌ అంశాల విషయంలో దర్యాప్తు చేసిన ఆర్‌బీఐ యస్‌ బ్యాంక్‌ ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని తెలిపింది. ఇటీవల రాణాకపూర్‌ వ్యవహారంతో పాటు ఎన్‌పీఏల నిర్దారణ నిర్దారణ తదితర ప్రతికూలాంశాలతో భారీ నష్టపోయిన షేరు తక్కువ ధరకే లభిస్తుండంతో ఇన్వెస్టర్లు నేడు

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 62 పాయింట్లు డౌన్‌

Thursday 14th February 2019

ప్రపంచ మార్కెట్లతో సంబంధంలేకుండా వరుస నష్టాల్ని చవిచూస్తున్న భారత్‌ సూచీలు గురువారం సైతం ప్రతికూలంగా ప్రారంభయ్యే సంకేతాల్ని సూచిస్తూ ఈ ఉదయం ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 62 పాయింట్లు తగ్గింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.40  గంటలకు 10,761 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం రోజు ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్‌ 10,823 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు  అమెరికా ప్రభుత్వ షట్‌డవున్‌కు తెరపడుతుందన్న వార్తలు, అమెరికా, చైనా

Most from this category