STOCKS

News


రేటింగ్‌ కోత.. మైండ్‌ట్రీ 17 శాతం పతనం..

Friday 19th October 2018
Markets_main1539935508.png-21289

సిటీ గ్రూప్‌, ఫిలిప్‌ క్యాపిటల్‌, మోతీలాల్‌ ఓస్వాల్‌ వంటి బ్రోకరేజ్‌ సంస్థలు క్యూ2 ఎర్నింగ్స్‌ వెల్లడి తర్వాత మిడ్‌ క్యాప్‌ ఐటీ కంపెనీ మైండ్‌ట్రీ టార్గెట్‌ ప్రైస్‌ను తగ్గించాయి. క్యూ2లో మైండ్‌ట్రీ రెవెన్యూ అంచనాలను అందుకోలేకపోవడం, వ్యాల్యుయేషన్స్‌ ఎక్కువగా ఉండటం, కంపెనీ స్థూల అంశాలు సంబంధిత రంగానికి భిన్నంగా ఉండటం, బ్రెగ్జిట్‌ ఆందోళనలు వంటి అంశాలు రేటింగ్‌ కోతకు కారణం. బ్రోకరేజ్‌ సంస్థల నిర్ణయంతో మైండ్‌ట్రీ షేరు శుక్రవారం 17.5 శాతంమేర పతనమైంది. మధ్యాహ్నాం 1:24 సమయంలో ఎన్‌ఎస్‌ఈలో షేరు ధర 15.24 శాతం క్షీణతతో రూ.828 వద్ద ట్రేడవుతోంది.  
♦ మోతీలాల్‌ ఓస్వాల్‌.. మైండ్‌ట్రీ షేరుపై బై రేటింగ్‌ను కొనసాగించింది. అయితే టార్గెట్‌ ప్రైస్‌ను రూ.1,260 నుంచి రూ.1,125కు తగ్గించింది. 
♦ సిటీ గ్రూప్‌.. మైండ్‌ట్రీ షేరు రేటింగ్‌ను బై నుంచి న్యూట్రల్‌కు తగ్గించింది. అలాగే టార్గెట్‌ ప్రైస్‌ను రూ.1,240 నుంచి రూ.1,090కి తగ్గించింది. వ్యాల్యుయేషన్‌, ఈపీఎస్‌ అంచనాల్లో కూడా కోత విధించింది. 
♦ ఫిలిప్‌ క్యాపిటల్‌.. మైండ్‌ట్రీ స్టాక్‌పై న్యూట్రల్‌ రేటింగ్‌ను కొనసాగించింది. అయితే టార్గెట్‌ ప్రైస్‌ను రూ.1,070 నుంచి రూ.1,020కి తగ్గించింది. 

క్యూ2 ఫలితాలను విశ్లేషిస్తే..
మైండ్‌ట్రీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 65 శాతం ఎగసింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.125 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.206 కోట్లకు పెరిగిందని మైండ్‌ట్రీ తెలిపింది. ఆదాయం రూ.1,332 కోట్ల నుంచి 32 శాతం పెరిగి రూ.1,755 కోట్లకు చేరిందని మైండ్‌ట్రీ సీఈవో, ఎండీ రోస్టో రావణన్‌ తెలిపారు. సీక్వెన్షియల్‌గా చూస్తే నికర లాభం 30 శాతం, ఆదాయం 7 శాతం చొప్పున వృద్ధి సాధించాయని వివరించారు. ఒక్కో షేర్‌కు రూ.3 మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. క్వార్టర్‌ పరంగా స్థిర కరెన్సీ ఆదాయంలో 2.4 శాతం వృద్ధి నమోదయ్యింది. ఇది మార్కెట్‌ 5.7 శాతం వృద్ధి అంచనాలను అందుకోలేకపోయింది. క్యూ1లో స్థిర కరెన్సీ ఆదాయం 8.2 శాతంగా నమోదయ్యింది.



You may be interested

ఏడాది కోసం ఐదు సిఫార్సులు

Friday 19th October 2018

వచ్చే 12- 15 నెలల కాలంలో మంచి రాబడినందించే ఐదు స్టాకులను ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థలు రికమండ్‌ చేస్తున్నాయి. 1. గ్రాఫైట్‌ ఇండియా: ఈ ఏడాది కంపెనీ ఎర్నింగ్స్‌ రికార్డు స్థాయికి చేరతాయని అంచనా. మూడేళ్లు వరుసగా నష్టాలు నమోదు చేసిన సంస్థ ఈ ఏడాది అద్భుత ప్రదర్శన చూపుతోంది. దీనికితోడు అత్యంత చౌక వాల్యూషన్ల వద్ద ట్రేడవుతోంది. గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్‌ వినియోగంలో అప్‌ట్రెండ్‌ ఆరంభం కావడం కంపెనీకి కలిసివచ్చే అంశం.

డబ్బుంది.. వ్యయాలే పెరిగాయ్‌..

Friday 19th October 2018

వ్యవస్థలో డబ్బు కొరత లేదని, దాని సమీకరణ వ్యయాలే పెరిగాయని హెచ్‌డీఎఫ్‌సీ వైస్‌ ప్రెసిడెంట్‌, సీఈవో కేకీ మిస్త్రీ తెలిపారు. ఒక బిల్డర్‌ పేమెంట్‌ను చెల్లించడంలో ఆలస్యమైతే భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఒక కంపెనీ దేశం మొత్తానికి ప్రాతినిధ్యం వహిందని పేర్కొన్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. ఆర్‌బీఐ తీసుకున్న చర్యలు వ్యవస్థలో లిక్విడిటీ సమస్య తగ్గడానికి దోహదపడ్డాయని తెలిపారు. నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌

Most from this category