STOCKS

News


మైండ్‌ ట్రీ షేర్లకు రాజీనామా మంట

Monday 8th July 2019
Markets_main1562572141.png-26897

  • 12శాతం పతనమైన షేర్లు

నిర్వాహణ విభాగం నుంచి ముగ్గురు కీలక అధికారులు రాజీనామాలు సమర్పించడంతో ఐటీ సేవల సంస్థ మైండ్‌ ట్రీ షేర్లు సోమవారం 12శాతం నష్టపోయాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.861.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మైండ్‌ ట్రీ కంపెనీలో ఎల్‌ అండ్‌ టీ సంస్థ నిర్ణయాత్మక వాటాను దక్కించుకున్న అనంతరం ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ పదవికి కృష్ణకుమారన్‌ నటరాజన్‌, వైస్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ పదవికి ఎన్‌ఎస్‌ పార్థసారథి, సీఎఫ్‌ఓ పదవికి రాస్ట్నో రావణన్‌లు రాజీనామాలు చేసినట్లు కంపెనీ ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది. అయితే, జూలై 17 వరకు వారు ఆయా పదవుల్లో కొనసాగుతారని కంపెనీ తెలిపింది. ఫలితంగా  మైండ్‌ ట్రీ షేర్లు ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఒక దశలో 12శాతం నష్టపోయి రూ.760.00ల వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. మధ్యాహ్నం గం.12:45ని.లకు షేరు గత ముగింపు ధర(రూ. 864.05)తో పోలిస్తే 10.50శాతం నష్టపోయి రూ.771.80ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.752.60  రూ.1181.90లుగా నమోదయ్యాయి. ఐటీ రంగంలో మధ్యస్థాయి కంపెనీగా పేరొందిన  మైండ్‌ ట్రీ 17 దేశాల్లోని సాఫ్ట్‌వేర్‌ సేవలు అందిస్తోంది. బలవంతపు టేకోవర్‌ ద్వారా మైండ్‌ ట్రీలో ఎల్‌ అండ్‌ టీ  60.06 శాతం వాటాను దక్కించుకుని నిర్ణయాత్మక వాటాదారుగా నిలిచిన సంగతి తెలిసిందే.



You may be interested

పతనానికి ఐదు కారణాలు

Monday 8th July 2019

 పలు ప్రతికూలాంశాల నడుమ సోమవారం మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. మధ్యాహ్నం 1 గంట సమయానికి సెన్సెక్స్‌ 600 పాయింట్లు, నిఫ్టీ 250 పాయింట్ల మేర నష్టపోయాయి. బడ్జెట్‌ ప్రతిపాదనలు, అమెరికా ఉద్యోగ వృద్ధి రేటు జూన్‌ నెలలో పెరగడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి. ప్రస్తుత పరిస్థితులలో అమెరికా ఫెడ్‌ వడ్డిరేట్ల తగ్గింపు ఉండదనే భయాలతో ఆసియా మార్కెట్లు 2 శాతం మేర పతనంకావడం ఇక్కడి మార్కెట్లపై ప్రభావం చూపింది. దీనికి

ఈక్వీటి మార్కెట్ల రేటింగ్‌ను తగ్గించిన మోర్గాన్‌ స్టాన్లీ

Monday 8th July 2019

అంతర్జాతీయ ఆర్థిక మందగమనం కారణంగా ప్రపంచ ఈక్వీటి మార్కెట్ల రేటింగ్‌ను ‘ఈక్వల్‌ వెయిట్‌’ నుంచి ‘అండర్‌ వెయిట్‌’కు  మోర్గాన్‌ స్టాన్లీ తన తాజా నివేదికలో తగ్గించింది. అం‍తేకాకుండా ప్రస్తుత స్థాయిల నుంచి పైకి పెరగడానికి ఈ మార్కెట్లకు పరిమితులున్నాయని పేర్కొంది. ఎస్‌ అండ్‌ పీ 500, ఎంసీఐ యూరోప్‌, ఎంఎస్‌సీఐ ఈఎం, టోపిక్స్‌ జపాన్‌ మార్కెట్లు వచ్చే 12 నెలలో మోర్గాన్‌ స్టాన్లీ ధర లక్ష్యాని కన్నా సరాసరి 1

Most from this category