STOCKS

News


నెల రోజుల కోసం బొనాంజా సిఫార్సులు

Thursday 9th August 2018
Markets_main1533793021.png-19088

వచ్చే 30 రోజుల్లో 11 శాతం వరకు రాబడినిచ్చే 3 స్టాకులను బొనాంజా పోర్టుఫోలియో రికమండ్‌ చేస్తోంది.
1. అజంతా ఫార్మా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1295. స్టాప్‌లాస్‌ రూ. 1127. డైలీ చార్టుల్లో ఇంతవరకు పయనిస్తూ వచ్చిన రేంజ్‌బౌండ్‌ పాటర్న్‌కు పైన క్లోజయింది. ధర పెరగడంతో పాటు వాల్యూంలు కూడా బాగా పెరిగి కౌంటర్లో ఉత్సాహాన్ని నింపాయి. ఆర్‌ఎస్‌ఐ పాజిటివ్‌ క్రాసోవర్‌ ఏర్పరిచి అప్‌మూవ్‌కు అనుకూలంగా కనిపిస్తోంది.
2. చోళమండలమ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1570. స్టాప్‌లాస్‌ రూ. 1398. ఇటీవలి కన్సాలిడేషన్‌ జోన్‌ నుంచి పైకి మూవ్‌మెంట్‌ చూపింది. దీంతో స్టాకు కౌంటర్లో కొనుగోళ్లు పెరిగాయి. డైలీ చార్టుల్లో రౌండింగ్‌ బాటమ్‌ తరహా ఆకృతిని ఏర్పరిచింది. ఆర్‌ఎస్‌ఐ కదలికలు బుల్స్‌కు అనుకూలంగా ఉన్నాయి.
3. స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 400. స్టాప్‌లాస్‌ రూ. 339. గత నిరోధ స్థాయిని విజయవంతంగా దాటినట్లు డైలీ చార్టుల్లో కనిపిస్తోంది. దీంతో పాటు షేరు తన 200 రోజుల డీఎంఏ స్థాయికి పైన క్లోజయింది. ఆర్‌ఎస్‌ఐ తదితర ఇండికేటర్లు పాజిటివ్‌గా ఉన్నాయి. 



You may be interested

ఎన్నారై దిగ్గజాలకు ట్రంప్ విందు

Thursday 9th August 2018

న్యూయార్క్‌:  పెప్సీకో సీఈవో ఇంద్రా నూయి, మాస్టర్‌ కార్డ్ సీఈఓ అజయ్ బంగా వంటి ప్రవాస భారత కార్పొరేట్‌ అధిపతులతో పాటు పలువురు పారిశ్రామిక దిగ్గజాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విందునిచ్చారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులపై వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. న్యూజెర్సీలోని ప్రైవేట్ గోల్ఫ్‌ క్లబ్‌లో ఇచ్చిన ఈ విందుకు భర్త రాజ్‌ నూయితో కలిసి ఇంద్రా నూయి, భార్య రీతు బంగాతో కలిసి అజయ్‌

మార్కెట్లోకి మారుతీ స్విఫ్ట్‌ ఏజీఎస్‌ వేరియంట్‌

Thursday 9th August 2018

న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా కంపెనీ స్విఫ్ట్‌కి చెందిన హై ఎండ్‌ మోడళ్లలో ఆటో గేర్‌ షిఫ్ట్‌ (ఏజీఎస్‌) సౌకర్యమున్న కార్లను మార్కెట్లోకి తెచ్చింది. దీంట్లో పెట్రోల్‌ వేరియంట్‌ ధర రూ.7.76 లక్షలని, డీజిల్‌ వేరియంట్‌ ధర రూ.8.76 లక్షలని (రెండు ధరలూ ఎక్స్‌ షోరూమ్‌, ఢిల్లీ) మారుతీ తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్త స్విఫ్ట్‌ మోడల్‌ను మార్కెట్లోకి తెచ్చామని పేర్కొంది. అప్పుడే స్విఫ్ట్‌కు చెందిన వీఎక్స్‌ఐ, జడ్‌ఎక్స్‌ఐ,

Most from this category