STOCKS

News


యస్‌ సెక్యూరిటీస్‌ మిడ్‌క్యాప్‌ సిఫార్సులు

Wednesday 11th July 2018
Markets_main1531290224.png-18200

వచ్చే మూడునాలుగు వారాల్లో 15 శాతం వరకు రాబడినిచ్చే మూడు మిడ్‌క్యాప్స్‌ను యస్‌ సెక్యూరిటీస్‌ సిఫార్సు చేస్తోంది.
1. ఏఐఏ ఇంజనీరింగ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1855. స్టాప్‌లాస్‌ రూ. 1500. వీక్లీ చార్టుల్లో ఊర్ధ్వముఖ త్రిభుజాకృతి పాటర్న్‌ నుంచి బ్రేకవుట్‌ ఇచ్చేందుకు తయారుగా ఉంది. ఈ త్రిభుజాకృతి అవధి రేఖ రూ. 1645 వద్ద ఉంది. దీన్ని భారీ వాల్యూంలతో దాటితే మరింత అప్‌ట్రెండ్‌ కనిపిస్తుంది. డైలీ చార్టుల్లో ఇప్పటికే కప్‌ అండ్‌ హ్యాండిల్‌ పాటర్న్‌ను ఛేదించి పాజిటివ్‌నెస్‌ చూపుతోంది. ఆర్‌ఎస్‌ఐ క్రమంగా పైకి ఎగిసి ప్రస్తుతం బుల్లిష్‌ కదలికలు చూపుతోంది.
2. రిలాక్సో ఫుట్‌వేర్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 800. స్టాప్‌లాస్‌ రూ. 680. డైలీ చార్టుల్లో కన్సాలిడేషన్‌ పాటర్న్‌ నుంచి బయటపడే సంకేతాలు ఇస్తోంది. రూ. 740కి పైన స్థిరంగా ట్రేడయితే బ్రేకవుట్‌ నిర్ధారించుకోవచ్చు. వీక్లీ చార్టుల్లో హయ్యర్‌ హై, లో ఏర్పరుస్తూ బుల్లిష్‌నెస్‌ కొనసాగిస్తోంది. ఆర్‌ఎస్‌ఐ డబుల్‌ బాటమ్‌ ఏర్పరిచిన తర్వాత అప్‌మూవ్‌ ఆరంభించింది. 
3. ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 560. స్టాప్‌లాస్‌ రూ. 465. రోజూవారీ చార్టుల్లో వెనువెంటనే బ్రేకవుట్‌ ఇచ్చే సంకేతాలు చూపుతోంది. ఇటీవలే వెడ్జ్‌ ధోరణి నుంచి బయటపడి బుల్లిష్‌ లక్షణాలు అందిపుచ్చుకుంది. ఆర్‌ఎస్‌ఐ పాజిటివ్‌ కదలికలు చూపుతూ మరింత అప్‌ట్రెండ్‌ సంకేతాలనిస్తోంది. 



You may be interested

తగ్గుముఖం పట్టిన పసిడి ధర

Wednesday 11th July 2018

ముంబై:- డాలర్‌ పటిష్టమైన ర్యాలీతో బుధవారం పసిడి ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. చైనా నుంచి దిగుమతిమయ్యే వస్తువులపై ఇప్పటికే దిగుమతి సుంకాలను విధించిన అమెరికా తాజాగా మరోసారి సుంకాల విధింపునకు సిద్ధమైంది. ఇప్పుడు అదనంగా మరో 200 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా దిగుమతులపై  పది శాతం సుంకాలు పెంచనున్నట్లు అమెరికా స్పష్టంచేసింది. ఫలితంగా ఆరు ప్రపంచ కరెన్సీ విలువతో పోలిస్తే డాలర్‌ విలువ పెరిగింది. నేడు ఆసియా

దుమ్మురేపిన టీసీఎస్‌

Wednesday 11th July 2018

జోష్‌నిచ్చిన క్యూ1 ఫలితాలు ముంబై:- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అంచనాలను మించి లాభాలను సాధించడంతో టీసీఎస్‌ షేరు గురువారం ఆల్‌టైం హైని నమోదు చేసింది. అన్ని వ్యాపార విభాగాలు మెరుగైన పనితీరును కనబర్చడంతో టీసీఎస్‌ ఈ క్యూ1 కాలానికి సంబంధించి ఆకర్షణీయమైన ఫలితాలను బుధవారం ప్రకటించింది. ఫలితాలు ఆకర్షణీయంగా ఉండటంతో నేడు ట్రేడింగ్‌ ప్రారంభం నుంచే టీసీఎస్‌ షేరు దుమ్మురేపింది. రెండు రోజుల వరుస నష్టాల ముగింపు తరువాత

Most from this category