STOCKS

News


మిడ్‌క్యాప్స్‌లో మరో 30 శాతం ర్యాలీ!

Tuesday 19th March 2019
Markets_main1552984444.png-24692

ఐసీఐసీఐ డైరెక్ట్‌ అంచనా
ఫిబ్రవరి కనిష్ఠాల నుంచి ఇప్పటికి మిడ్‌క్యాప్‌ సూచీ దాదాపు 12 శాతం కోలుకుంది. అయితే ఈ పరుగులు ఇంకా కొనసాగుతాయని, మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ మరో 30 శాతం మేర ర్యాలీ జరిపే ఛాన్సులున్నాయని ఐసీఐసీఐ డైరెక్ట్‌ అంచనా వేసింది. గతంలో మిడ్‌క్యాప్స్‌లో వచ్చిన భారీ పతనాలు 14 నెలలకు పూర్తయ్యాయని, ఆ తర్వాత మిడ్‌క్యాప్‌ సూచీ దాదాపు 40 శాతం వరకు ర్యాలీ జరిపిన చరిత్ర ఉందని తెలిపింది. ఇదే ధోరణి మరలా రిపీటు కావచ్చని, మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌లో మెరుపులు కొనసాగవచ్చని పేర్కొంది. మరోమారు స్మాల్‌క్యాప్‌ లేదా మిడ్‌క్యాప్‌ సూచీలు ఫిబ్రవరి కనిష్ఠాలను చూసే అవకాశాలైతే ఇప్పట్లో దాదాపు లేవని తెలిపింది. ప్రస్తుత ర్యాలీ తొలిదశలో ఉందని, ఈ పరుగు మరింత ముందుకే కొనసాగుతుందని వివరించింది. మధ్యలో ఎన్నికల సందర్భంగా కొంత ఒడిదుడుకులు కనిపిస్తాయని తెలిపింది. ఇలాంటి సందర్భాలను వీలైతే కొనుగోళ్లకు అవకాశంగా వినియోగించుకోవాలని సలహా ఇచ్చింది. 
ఆరు నెలల కోసం ఐదు మిడ్‌క్యాప్‌ షేర్లను బ్రోకింగ్‌ సంస్థ సిఫార్సు చేసింది...



You may be interested

అర్ధంపర్ధం లేని వాల్యూషన్లు!

Tuesday 19th March 2019

మార్కెట్‌పై కోటక్‌ ఈక్విటీస్‌ అభిప్రాయం ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువమంది ఆలోచనకు భిన్నమైన ఆలోచనను కోటక్‌ ఈక్విటీస్‌ వెలువరించింది. ప్రస్తుత మార్కెట్లో వాల్యూషన్లు అర్ధరహితంగా ఉన్నాయని, చాలా విభాగాలు ఏమాత్రం ఆకర్షణీయంగా లేవని కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ తెలిపింది. అందువల్ల వీలయినంతవరకు బలహీనమైన రంగాలు, అధిక వాల్యూషన్లు ఉన్న రంగాలు, స్టాకుల నుంచి వైదొలుగుతున్నామని కోటక్‌ వెల్లడించింది. మార్చి ఆరంభంలో స్టార్టయిన తాజా ర్యాలీలో అనేక స్టాకులు పాలుపంచుకుంటున్నాయి. కానీ కొన్ని ఫైనాన్షియల్‌

సిమెంట్‌ షేర్లకు డిమాండ్‌

Tuesday 19th March 2019

స్వల్ప లాభాలతో ట్రేడ్‌ అవుతున్న మార్కెట్లో మంగళవారం సిమెంట్‌ షేర్లకు డిమాండ్‌ నెలకొంది. ఇటీవల మౌలిక సదుపాయాల రంగం జోరందుకోవడంతో మార్కెట్లో సిమెంట్‌ షేర్లకు డిమాండ్‌ కొనసాగుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అత్యధికంగా ఇండియా సిమెంట్‌ 4.50శాతం లాభపడింది. రైన్ ఇండస్ట్రీస్‌ 3.50శాతం, ప్రిజం సిమెంట్స్‌ 3శాతం లాభపడ్డాయి. జే.కే సిమెంట్స్‌, అంబుజా సిమెంట్స్‌ షేర్లు 2శాతం ర్యాలీ చేశాయి. అలాగే అల్ట్రాటెక్‌ సిమెంట్‌, గ్రాసీం, ఏసీసీ సిమెంట్స్‌ షేర్లు 1శాతం

Most from this category