STOCKS

News


ఈ ఏడాది మిడ్‌క్యాప్స్‌దే హవా!

Thursday 10th January 2019
Markets_main1547100157.png-23503

నిపుణుల అంచనా
మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ బాటమ్‌అవుట్‌ అవుతున్నాయని, ఇకమీదట వీటిలో పునరుజ్జీవం కనిపించవచ్చని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది లార్జ్‌క్యాప్స్‌ కన్నా మిడ్‌క్యాప్స్‌ మంచి ప్రదర్శన చూపవచ్చని అభిప్రాయపడ్డారు. వాల్యూషన్లు దిగిరావడం, క్రూడాయిల్‌ ధర తగ్గడంతో వ్యయాలు తగ్గుముఖం పట్టడం, ఎర్నింగ్స్‌లో వృద్ధి కారణంగా చిన్నస్టాకులు కళకళలాడతాయని ఎలెరా క్యాపిటల్‌ నివేదిక తెలిపింది. అయితే ఇన్వెస్టర్లు తొందరపడి హడావుడి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించింది. ప్రతి పతనంలో కొంత చొప్పున కొనుగోలు చేసుకుంటూ నిర్మాణాత్మక పోర్టుఫోలియోను తయారు చేసుకోవాలని సలహా ఇచ్చింది.

ధైర్యం ఉన్న(అగ్రెసివ్‌) ఇన్వెస్టర్లు తమ పోర్టుఫోలియోలో 40 శాతం మిడ్‌, స్మాల్‌క్యాప్స్‌పై పెట్టుబడి పెట్టవచ్చని, రిస్కులకు పెద్దగా ఇష్టపడనివారు 15 శాతం వరకు మిడ్‌, స్మాల్‌క్యాప్స్‌పై పెట్టుబడులు పెట్టవచ్చని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. 
కార్వీ మిడ్‌క్యాప్‌ సిఫార్సులు:
షేరు ధర        టార్గెట్‌ రూ.
బజాజ్‌ ఎలక్ట్రిక్స్‌- 670
ఫినోలెక్స్‌ కేబుల్స్‌- 600
జైన్‌ ఇరిగేషన్‌-101
కేపీఆర్‌ మిల్స్-716
రిలాక్సో ఫుట్‌వేర్‌-911
సన్‌టెక్‌ రియల్టీ-497
టేక్‌ సొల్యూషన్స్‌-226
కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ సిఫార్సులు:
శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌- 1450
పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ-280
మైండ్‌ట్రీ-1080
లౌరస్‌ ల్యాబ్‌-460
జుబిలాంట్‌ ఫుడ్‌వర్క్స్‌-1370
ఫెడరల్‌ బ్యాంక్‌-105
ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌160
ఎస్కార్ట్స్‌- 1050



You may be interested

ప్రైవేట్‌ బ్యాంక్‌ షేర్ల క్షీణత: బ్యాంక్‌ నిఫ్టీ అరశాతం డౌన్‌..!

Thursday 10th January 2019

మార్కెట్‌ నష్టాల ట్రేడింగ్‌లో భాగంగా ఎన్‌ఎస్‌ఈ బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ అరశాతం క్షీణించింది. ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్‌ షేర్ల క్షీణత ఈ ఇండెక్స్‌ను నష్టాల్లోకి నెట్టింది. ఉదయం గం.11:30ని.లకు ఇండెక్స్‌ గతముగింపు(27,577.35)తో పోలిస్తే 0.50శాతం(150పాయింట్ల) నష్టంతో 27577ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈ ఇండెక్స్‌లోని ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ రంగానికి చెందిన ఇండస్‌ ఇండ్‌ 2శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌ షేర్లు 1శాతం నష్టపోయాయి. అలాగే

సెప్టెంబర్‌ తర్వాత ఎయిర్‌ ఇండియా అమ్మకం

Thursday 10th January 2019

రూ.7,000 కోట్లు వస్తుందని అంచనా న్యూఢిల్లీ: నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియాలో వాటాల విక్రయం ద్వారా బిలియన్‌ డాలర్లు (రూ.7,000 కోట్లు సుమారు) లభిస్తాయని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. 2019-20 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థ భాగంలో ఎయిర్‌ఇండియాలో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణను చేపట్టనుంది. ఈ లోపు ఎయిర్‌ ఇండియా అనుబంధ కంపెనీలను విక్రయించనుంది. ఈ వివరాలను ఓ అధికారి మీడియాకు తెలిపారు. ఎయిర్‌ ఇండియాకు రూ.55,000

Most from this category