STOCKS

News


మిడ్‌క్యాప్స్‌లో మరింత పతనం..!

Friday 23rd March 2018
Markets_main1521792186.png-14897

ముంబై: ప్రతిచిన్న అప్‌స్వింగ్‌ను పొజిషన్లు తగ్గించుకోవడానికి లేదంటే, తాజా షార్ట్స్‌ బిల్డప్‌కు ఉపయోగించుకోవడమే మార్కెట్‌ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉత్తమమైన మార్గమని ఇండియా ఇన్ఫోలైన్‌ సీనియర్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ హడ్రియన్ మెన్డోంకా సూచించారు.  10220-10230 స్థాయి నుంచి లాభాల స్వీకరణ అత్యంత ఎక్కువగా ఉంటుండగా.. 200 రోజుల సగటు కదలికల స్థాయి (10,110 పాయింట్లు) డిసెంబరు 2016 తరువాత తొలిసారిగా బ్రేక్‌ అయిపోవడం ఇకముందు కూడా మార్కెట్‌ మరింత పతనం అయ్యేందుకు సంకేతంగా కనబడుతుందని అన్నారు. ఫండమెంటల్‌గా చూస్తే క్రూడాయిల్‌ ధరలు పెరుగుతుండడం, దేశీయ బ్యాంకింగ్‌ రంగంలో స్కామ్‌లు, బాండ్‌ ఈల్డ్‌ పెరిగిపోవడం లాంటి ప్రతికూల అంశాలు మార్కెట్‌ను పడేస్తున్నాయని ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. బ్యాంక్‌ నిఫ్టీ తాజాగా 24,000 మార్కును కోల్పోవడం ఈ సూచీలో సైతం మరింత పతనం ఉంటుందనే అంశానికి అద్దం పడుతుందని అంచనావేశారు. ఇంతటి పతనం సమయంలోనూ టెక్నికల్‌గా చూస్తే 7 శాతం వరకు రాబడిని ఇవ్వగలిగిన 3 షేర్లను సిఫార్సు చేశారు. అవేంటంటే..

లార్సెన్ & టబ్రో ఇన్ఫోటెక్ (ఎల్‌టీఐ): ప్రస్తుత ధర (మార్చి 23, 2018) రూ.1,347 | టార్గెట్‌ రూ.1450 | స్టాప్‌లాస్‌ రూ.1310
ఈఏడాది ఫిబ్రవరి 22న రూ.1549 వద్ద జీవితకాల గరిష్టస్థాయిని తాకిన తరువాత ఈ దశలో రివర్సల్‌ సంకేతం కనబడుతుందని హడ్రియన్ అన్నారు. రోజువారి చార్డు ఆధారంగా చూస్తే బుల్లిష్‌ యాంగల్‌ఫింగ్‌ ఏర్పాటు కావడం ఆవెంటనే కొనుగోలు జరగడం టార్గెట్‌ ధర నిర్ణయించడానికి కారణాలుగా వెల్లడించారు.

జూబిలెంట్‌ ఫుడ్‌వర్క్స్ లిమిటెడ్‌: ప్రస్తుత ధర | టార్గెట్‌ రూ.2,380 | స్టాప్‌లాస్‌ రూ.2,223
మార్కెట్‌ నష్టాల్లోనే కొనసాగుతున్నప్పటికీ ఈ షేరు మాత్రం స్టాండ్‌ అవుట్‌ పెర్ఫార్మర్‌గా నిలిచింది. ఈ షేరు ఇంతకుముందు నమోదుచేసిన రూ.2,330.90 ఆల్‌టైంహై వద్దకు చేరుకునే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.

టైటాన్‌ కంపెనీ: ప్రస్తుత ధర రూ.896 | టార్గెట్‌ రూ.935 | స్టాప్‌లాస్‌ రూ.865
గడిచిన 5 ట్రేడింగ్‌ సెషన్ల నుంచి షేరు కన్సాలిడేషన్‌ దశలో ఉండగా.. డైలీ చార్డుల ప్రకారం చూస్తే తాజాగా బ్రేకవుట్‌ సాధించింనట్లు తెలుస్తుందని అన్నారు. 

ఇవి కేవలం మార్కెట్‌ విశ్లేషకుల అభిప్రాయాలు మాత్రమే. ఇన్వెస్టర్లు తమ సొంత అధ్యయనం తరువాత మాత్రమే తుది నిర్ణయం తీసుకోవడం మంచిదని సాక్షీబిజినెస్‌డాట్‌కామ్‌ సూచన.You may be interested

ఈ రెండు రంగాల షేర్లు కొనొచ్చు

Friday 23rd March 2018

క్వాంట్‌ బ్రోకింగ్‌ ఎండీ సందీప్‌ టాండన్‌ సూచన నిఫ్టీ 10,000 పాయింట్లకు అటూ, ఇటూగా 200–300 పాయింట్లు పెరిగినా, తగ్గినా..రెండు రంగాల్లో మంచి షేర్లను ఎంపికచేసి కొనేందుకు మంచి అవకాశమని క్వాంట్‌ బ్రోకింగ్‌ ఎండీ సందీప్‌ టాండన్‌ సూచిస్తున్నారు. ఒక ఆంగ్ల చానల్‌తో ఆయన మాట్లాడుతూ కన్జూమర్, మెటల్‌ రంగాల షేర్లలో కొనుగోలు అవకాశాలున్నాయని అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చర్యలు పూర్తిస్థాయి వాణిజ్య యుద్ధానికి దారితీస్తాయని తాను భావించడం లేదని,

అనిశ్చితి కొనసాగుతుంది...పెరిగినపుడు విక్రయించడమే మంచిది

Friday 23rd March 2018

ఇన్వెస్టర్లకు విశ్లేషకుల సూచనలు అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం విస్త్రతమవుతుందన్న భయాలు, ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపు, మన దేశంలో మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ పరిస్థితులు వంటి అంశాల కారణంగా రానున్న రోజుల్లో మార్కెట్లో అనిశ్చితి కొనసాగుతుందని అధికశాతం మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కారణంగా షేర్లు తగ్గినపుడు కొనేబదులు, పెరిగినప్పుడు అమ్మడమే సరైన వ్యూహంగా వారు సూచిస్తున్నారు. కొద్ది రోజులుగా నిఫ్టీ పెరిగినపుడల్లా అమ్మకాల

Most from this category