STOCKS

News


మిడ్‌క్యాప్‌లో రికవరీకి అవకాశం: ఎలారా

Tuesday 26th March 2019
Markets_main1553624648.png-24810

మిడ్‌క్యాప్‌లో రికవరీకి అవకాశం ఉందని ఎలారా క్యాపిటల్‌ పేర్కొంది. చారిత్రక ధోరణలు, ధరలు, వ్యాల్యూషన్లు సౌకర్యంగా ఉండడంతో ఈ అంచనాకు వచ్చింది. లార్జ్‌క్యాప్‌తో పోలిస్తే మిడ్‌క్యాప్‌ వ్యాల్యూషన్లు చారిత్రకంగా కనిష్ట స్థాయిలో ఉన్నాయని తెలిపింది. రోలింగ్‌, అబ్జల్యూట్‌ పరంగానూ ఇదే కనిపిస్తోందని పేర్కొంది. దీంతో మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లో రికవరీ ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం వ్యాల్యూషన్ల పరంగా కొనుగోలు చేసుకోవడానికి అనుకూలంగా ఉన్న 20  మిడ్‌క్యాప్‌ కంపెనీలతో జాబితాను విడుదల చేసింది. 

 

ఎలారా సిఫారసులు
అబ్బాట్‌ ఇండియా, ఆస్ట్రల్‌పాలీ, అవంతి ఫీడ్స్‌, బెర్జర్‌ పెయింట్స్‌, కమిన్స్‌ ఇండియా, ఎండ్యురెన్స్‌ టెక్నాలజీస్‌, ఇంద్రప్రస్థ గ్యాస్‌, ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌, పేజ్‌ ఇండస్ట్రీస్‌, ఎస్‌కేఎఫ్‌ ఇండియా, సోలార్‌ ఇండస్ట్రీస్‌, సింఫనీ, వర్ల్‌పూల్‌ ఇండియాలను ఎలారా రికమండ్‌ చేసింది. స్థిరమైన అధిక ఆర్‌వోసీఈ (రిటర్న్‌ ఆన్‌ క్యాపిటల్‌ ఎంప్లాయిడ్‌), పెరుగుతున్న లేదా స్థిరమైన ఆపరేటింగ్‌ మార్జిన్లు, సానుకూల నగదు ప్రవాహాలు, తక్కువ రుణ భారం, అధిక ఆదాయ వృద్ధి అంశాల ఆధారంగా ఈ స్టాక్స్‌ను ఎంపిక చేసింది. ఆర్‌వోసీఈ గత ఐదేళ్లలో కనీసం నాలుగేళ్ల కాలంలో 15 శాతానికంటే తగ్గకుండా ఉండాలి. ఆపరేటింగ్‌ మార్జిన్‌ ఎంతో కొంత పెరుగుతూ ఉండాలి. ఒక ఏడాది 10 శాతంగా నమోదైతే మరుసటి ఏడాది ఆపరేటింగ్‌ మార్జిన్‌ 10 శాతం కంటే ఎక్కువ ఉండాలి. కనీసం 10 శాతం తగ్గకూడదు. ఈక్విటీతో పోలిస్తే రుణ భారం ఒక రేషియోకి మించి ఉండకూడదు. సానుకూల ఫ్రీ క్యాష్‌ ఫ్లో గత ఐదేళ్లలో కనీసం నాలుగేళ్లలో నమోదవ్వాలి. ఈ అంశాల‍న్నీ ఎలారా ఎంపిక చేసిన కంపెనీల్లో కనిపిస్తాయి. 



You may be interested

ధీరేంద్రకుమార్‌ సూచించే ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌

Tuesday 26th March 2019

ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌) వంటి దీర్ఘకాల పెట్టుబడులు భారీ రిటైర్మెంట్‌ నిధికి దారితీస్తాయని వ్యాల్యూ రీసెర్చ్‌ సంస్థ అధినేత ధీరేంద్ర కుమార్‌ సూచించారు. పన్ను ఆదా కోసం చివరి వరకు వేచి చూస్తుంటారని, ప్రణాళిక ప్రకారం ఈ పెట్టుబడులు ముందు నుంచే చేయడం మంచిదని సూచించారు. ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్‌ నుంచే సిప్‌ ఆరంభించాలన్నారు. పన్ను ఆదా కోసం చేసే పెట్టుబడులు 10-15-20 ఏళ్ల

మల్టీబ్యాగర్లు తగ్గడం మంచిదే!

Tuesday 26th March 2019

కొత్త ఏడాది మరిన్ని మల్టీబ్యాగర్లు తయారవుతాయంటున్న నిపుణులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్కెట్లో మల్టీబ్యాగర్లు చాలా తక్కువగా నమోదయ్యాయి. ఒకపక్క ఏడాదిలో సూచీలు దాదాపు 15 శాతం ర్యాలీ జరిపినా, మల్టీబ్యాగర్‌ రిటర్న్స్‌ ఇచ్చిన స్టాకుల సంఖ్యమాత్రం గత పదేళ్ల కనిష్టానికి పడిపోయింది. అయితే ఇలా ఒక ఏడాది మల్టీబ్యాగర్ల సంఖ్య తగ్గడం వచ్చే ఏడాది మరిన్ని మల్టీబ్యాగర్లుంటాయనేందుకు సంకేతమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 2019-20లో భారీగా మల్టీబ్యాగర్లు తయారవుతాయని కొందరు అంచనా

Most from this category