STOCKS

News


ఈ 4 రంగాల్లో ఆకర్షణీయ రాబడి..!

Friday 2nd November 2018
Markets_main1541154600.png-21670

  • మిడ్‌క్యాప్‌ ఐటీ, కన్సూమర్‌ స్టెపుల్స్‌, ఇన్‌ఫ్రా, సిటీ గ్యాస్‌ రంగాల షేర్లపై బుల్లిష్‌గా ఉన్న డోలాట్ కాపిటల్ డైరెక్టర్ రీసెర్చ్ అమిత్ ఖురానా
  • విమానయాన రంగ షేర్లకు దూరంగా ఉండమని సూచన

ముంబై: రోడ్‌ ప్రాజెక్టేతర సోషల్‌ ఇన్‌ఫ్రా రంగంపై తాను బుల్లిష్‌గా ఉన్నట్లు డోలాట్ కాపిటల్ మార్కెట్‌ రీసెర్చ్‌ విభాగ డైరెక్టర్ అమిత్ ఖురానా అన్నారు. అయితే, ఈ రంగ కంపెనీలలో కూడా డీ-రేటింగ్‌ ఉందని వివరించారు. వడ్డీ రేట్ల మార్పు కారణంగా వాల్యూయేషన్స్‌లో సర్దుబాటు కొనసాగుతుందన్నారు. మౌలిక రంగ దిగ్గజం లార్సెన్‌ అండ్‌ టుబ్రో (ఎల్‌ అండ్‌ టీ) నికర లాభం కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో 28 శాతం పెరగడం చూస్తుంటే.. ఈ రంగ భవిష్యత్తు వృద్ధిరేటు చాలా స్పష్టంగా కనబడుతుందన్నారయన. ఆర్డర్లు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ.. ద్రవ్యలభ్యత, వడ్డీ రేట్ల అంశాల కారణంగా ర్యాలీలో వెనకబడుతున్నాయి. ఆశాజనక పనితీరు కనబరుస్తున్న, ఫండింగ్‌ బాగున్నటువంటి సోషల్‌ ఇన్‌ఫ్రా రంగంలో అప్పులు భారీగానే ఉన్నప్పటికీ, ఇది పెద్ద విషయం కాదని వ్యాఖ్యానించారు. ఈ రంగంలో ఎల్‌ అండ్‌ టీ తమకు బాగా నచ్చిన కంపెనీ అని వెల్లడించారు. మిడ్‌క్యాప్‌ ఐటీ చాలా ఆకర్షణీయంగా ఉందన్న అమిత్‌.. వచ్చే రెండు త్రైమాసికాలలో ఈ రంగ షేర్లు అవుట్‌పెర్ఫార్మ్‌ చేస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు. నికర ఎగుమతులు బాగున్నాయన్నారు. కన్సూమర్‌ స్టెపుల్స్‌ విభాగంలో మారికో తమకు అత్యంత ఇష్టమైన షేరుగా వెల్లడించారు. ముడిచమురు, గ్యాస్‌ ధరలు పెరిగినప్పటికీ కూడా సిటీ గ్యాస్‌ కంపెనీల మార్జిన్లు నిలదొక్కుకునే ఉన్నట్లు విశ్లేషించారు. రూపాయి విలువ పడిపోయిన సమయంలో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల కంటే మెరుగైన వృద్ధిరేటును నమోదుచేశాయన్నారు. You may be interested

10550 పైకి నిఫ్టీ

Friday 2nd November 2018

579 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌ ప్రపంచమార్కెట్ల అందిన సానుకూలతతో మార్కెట్‌ ఈ వారాంతపు రోజైన శుక్రవారం భారీ లాభాల్లో ముగిసింది. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ఝం ముగియబోతుందన్న అంచనాలతో ప్రపంచ మార్కెట్లన్నీ వువ్వెత్తున పెరిగిన ప్రభావంతో ఇక్కడి సూచీలు పరుగులు తీసాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు దిగిరావడం, ఇంట్రాడేలో డాలర్‌ మారకంలో రూపాయి  రీకవరీ తదితర కారణాలు కూడా మార్కెట్‌ భారీ లాభాల ముగింపునుకు కారణమయ్యాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 35వేల మార్కు పైన, నిఫ్టీ

అదరగొట్టిన అటో షేర్లు

Friday 2nd November 2018

అక్టోబర్‌లో వాహన విక్రయాలు ఆశించినస్థాయిలో లేనప్పటికీ.., శుక్రవారం ఆటోరంగ షేర్లు అదరగొట్టాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ అటో ఇండెక్స్‌ నేటి ఇంట్రాడేలో 4.50శాతం ర్యాలీ చేసింది. గత కొంతకాలంగా స్తబ్ధుగా సాగుతున్న అటోరంగ షేర్లలో నేడు కొనుగోళ్లు వెల్లువెత్తడంతో ఇండెక్స్‌ ర్యాలీకి కారణమైందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. చివరకు 4.15 శాతం లాభంతో 9,180.20 వద్ద ముగిసింది. సూచిలో భాగమైన మొత్తం 16 షేర్లలో ఒక్క ఎక్సైడ్‌ ఇండియా లిమిటెడ్‌(1శాతం నష్టం)

Most from this category