STOCKS

News


మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ గరిష్టాలకు చాలా సమయముంది!

Thursday 28th February 2019
Markets_main1551376950.png-24384

మార్కెట్‌ బోటమ్డ్‌ అవుట్‌ అయిందని, అయితే, ఈ ప్రక్రియ చాలా ఎక్కువ సమయం తీసుకుంటుందని యస్‌ సెక్యూరిటీస్‌ ప్రెసిడెంట్‌ అమర్‌ అంబానీ తెలిపారు. మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ తిరిగి వాటి గరిష్ట స్థాయిలకు ఇప్పుడప్పుడే వెళ్లవని భావిస్తున్నట్టు చెప్పారు. ఈ మేరకు ఓ వార్తా పత్రికకు ఆయన పలు అంశాలపై ఇంటర్వ్యూ ఇచ్చారు. 

 

ఈక్విటీ మార్కెట్లలో ఆటు పోట్లు సహజమేనని, మార్కెట్లను ఇవి ఆరోగ్యంగా ఉంచుతాయని అమర్‌ అంబానీ తెలిపారు. కొన్ని సార్లు ఎటువంటి ట్రిగ్గర్లు లేకపోవడమే మార్కెట్లకు మంచి ట్రిగ్గర్‌ అవుతుందని పేర్కొన్నారు. ఎన్నికల నాటికి పెద్ద అప్‌ మూవ్‌ ఉంటుందని తాను సైతం భావిస్తు‍న్నట్టు చెప్పారు. ఉగ్రవాద స్థావరాలపై భారత్‌ వైమానిక దాడులు ప్రతీ భారతీయునికీ గర్వకారణమని, మార్కెట్లపై వీటి ప్రభావం ఒకటి రెండు రోజులే ఉంటుందన్నారు. పూర్తి స్థాయి యుద్ధంగా మారనంతవరకు మార్కెట్లు వేగంగానే రికవరీ అవుతాయని పేర్కొన్నారు.   

 

దిద్దుబాటుకు గురైన చాలా స్టాక్స్‌ బాటమ్డ్‌ అయినట్టేనా? అన్న ప్రశ్నకు... కొత్త స్టాక్స్‌లో (దిద్దుబాటుకు పెద్దగా గురికానివి) కరెక్షన్‌ను తోసిపుచ్చలేమన్నారు. ‘‘పలు రంగాలు, స్టాక్స్‌ ప్రభావితమయ్యాయి. అయితే, బ్రోడర్‌ మార్కెట్‌ కనిష్టాలను పూర్తి చేసిందని భావిస్తున్నా. అయితే, రివకరీ వీ షేప్‌లో ఉండదు. బోటమింగ్‌ అవుట్‌ ప్రక్రియ చాలా సమయం తీసుకుంటుంది. స్టాక్స్‌ 20-30 శాతం వరకు తిరిగి బౌన్స్‌ కావొచ్చు. కానీ, మిడ్‌ క్యాప్స్‌, స్మాల్‌క్యాప్స్‌ తిరిగి వాటి గరిష్ట స్థాయిలకు చేరుకోవాలంటే అందుకు 15-18 నెలల సమయం పడుతుంది’’ అని అమర్‌ అంబానీ తెలిపారు. వ్యాల్యూ స్టాక్స్‌ ఎంపికకు ఇది సరమైన సమయమేనా? అన్న ప్రశ్నకు స్టాక్‌ వారీగా ఇధి ఆధారపడి ఉంటుందన్నారు. చాలా స్టాక్స్‌ మార్కెట్లు పెరిగినప్పుడు అసహజంగా పెరిగాయని, అవి తర్వాత పడిపోయినప్పటికీ ఇంకా వాస్తవ విలువను ప్రతిబింబించడం లేదని తెలిపారు. వీటిని వ్యాల్యూ ట్రాప్‌గా పేర్కొన్నారు. మూడేళ్ల కాలం పాటు కొనసాగే వారు అయితే కంపెనీల యాజమాన్యం, బ్యాలన్స్‌ షీట్‌, వృద్ధి అవకాశాలను పరిశీలించి ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చని అంబానీ సూచించారు. 

 

ఈ స్టాక్స్‌ సేఫ్‌
ఆర్‌ఐఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, బిర్లా కార్ప్‌, కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీల్లో పెట్టుబడి అవకాశాలను పరిశీలించొచ్చని అమర్‌ అంబానీ సూచించారు. ప్రమోటర్లు పెద్ద మొత్తంలో తమ వాటాలను తనఖాగా పెడితే ఆయా కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయవద్దనే తాను సూచిస్తానన్నారు. మార్కెట్లలో అస్థిరతతో మార్జిన్‌కాల్‌ ట్రిగ్గర్‌ అవుతుందని, సకాలంలో టాప్‌ అప్‌ (అదనపు షేర్లు) సమకూర్చకపోతే రుణమిచ్చిన సంస్థలు స్టాక్స్‌ను నిలువునా అమ్మేస్తాయని తెలిపారు. You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 22 పాయింట్లు అప్‌ 

Friday 1st March 2019

ఇండోపాక్‌ ఉద్రిక్తతల నడుమ వరుసగా మూడు రోజులపాటు నష్టాల్ని చవిచూసిన భారత్‌ సూచీలు శుక్రవారం  పాజిటివ్‌గా ప్రారభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది.  ఈ ఉదయం ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 9 పాయింట్లు పెరిగింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.45 గంటలకు 10,866 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం రోజు ఇక్కడ నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌..స్పాట్‌తో పోలిస్తే భారీ ప్రీమియంతో 10,857 పాయింట్ల వద్ద ముగిసింది. గత రాత్రి అమెరికా, యూరప్‌

ఈ సమయంలో ఏ ఫండ్స్‌ బెటర్‌?

Thursday 28th February 2019

మార్కెట్లు తీవ్ర అస్థిరతల మధ్య చలిస్తున్న ఈ సమయంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్టర్లలో ఏ ఫండ్స్‌ను ఆశ్రయించాలన్న సందేహం రావొచ్చు. అయితే, దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయదలిచిన ఇన్వెస్టర్లు ఈ సందేహాలను పక్కన పెట్టేసి సిప్‌ రూపంలో ఇన్వెస్ట్‌మెంట్‌ చేసుకుంటూ వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, ఏ ఫండ్స్‌ను నమ్ముకోవచ్చన్న ప్రశ్నకు... ఇండెక్స్‌ ఫండ్స్‌, మల్టీక్యాప్‌ ఫండ్స్‌ సమ్మిళితంగా ఎంపిక ఉంటే బావుంటుందని సూచిస్తున్నారు.    ఇన్వెస్టర్లు మల్టీక్యాప్‌ పథకాలను ఎంచుకుంటే... ప్రత్యేకంగా

Most from this category