STOCKS

News


కొనేందుకు ఇదే సరైన సమయం..

Monday 17th September 2018
Markets_main1537177196.png-20329

రూపాయి సరైన విలువ 73. ఆందోళన చెండాల్సిన పరిస్థితులు ఏమీ లేవు. అయితే మార్కెట్లు స్వల్పకాలిక కరెక‌్షన్లకు గురికావొచ్చని ఇండియా జెన్‌ ఫండ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ మనీష్‌ సొంతాలియా తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. ఫండమెంటల్స్‌ బాగున్నాయని తెలిపారు. స్వల్పకాలిక సెంటిమెంట్స్‌ వల్ల సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని పేర్కొన్నారు. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి సరైన మారక విలువ 73 అని తెలిపారు. వ్యాల్యుయేషన్స్‌ ఎక్కువగా లేవని పేర్కొన్నారు. ప్రస్తుతం కొనుగోలుకు అవకాశముందని తెలిపారు. 
వడ్డీ రేట్ల పెరుగుదల వల్ల బ్యాంకుల కన్నా ఎన్‌బీఎఫ్‌సీలపై కొంత ‍ప్రభావం ఉంటుందని మనీష్‌ పేర్కొన్నారు. బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లపై కొంత ఒత్తిడి నెలకొని ఉందన్నారు. ఫండమెంటల్‌గా చూస్తే వీటిల్లో ఎలాంటి మార్పు లేదని గుర్తుచేశారు. స్వల్పకాలం నుంచి మధ్యస్థ కాలంలో కార్పొరేట్‌ బ్యాంకులు మంచి పనితీరు కనబరుస్తాయని తెలిపారు. ‘ఇథనాల్‌ ధర పెంపు వల్ల షుగర్‌ మిల్స్‌కు కొంత పరిహారం లభించొచ్చు. చక్కెర పరిశ్రమ డైనమిక్స్‌ సైక్లికల్‌గా, చాలా ప్రతికూలముగా ఉంటాయి. అందువల్ల షుగర్‌ మిల్స్‌ ఎలాంటి లాభాలను అర్జించలేవు’ అని పేర్కొన్నారు. 
మెటల్‌ కంపెనీల స్టాక్స్‌లో వ్యాల్యుయేషన్స్‌ ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. కొన్ని కంపెనీల ఎర్నింగ్స్‌ పెరిగాయని గుర్తుచేశారు. వచ్చే రెండేళ్ల వృద్ధి ఇప్పటికే స్టాక్‌ ధరలో కనిపిస్తోందన్నారు. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల స్టాక్స్‌లో విలువకు అవకాశముందని పేర్కొన్నారు. వచ్చే 2-3 ఏళ్ల కాలంలో కంపెనీల లాభాలు 15-20 శాతంమేర పెరిగే అవకాశముందని తెలిపారు. హెచ్‌పీసీఎల్‌ కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేశారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తన పెట్రోకెమికల్స్‌, రిటైల్‌, టెలికం వెంచర్లను మూడు ప్రత్యేక సంస్థలుగా విభజించొచ్చనే అంచనాలున్నాయని పేర్కొన్నారు. ఇదే జరిగితే వీటి విలువ చాలా ఎక్కువగా ఉంటుందని తెలిపారు. టెలికం కంపెనీల్లో విలువ ఉంటుందని భావించడం లేదన్నారు. ధరల పోటీ, నిధుల లేమీ వంటివి ప్రతికూలమని తెలిపారు. ‘రిటైల్‌ ద్రవ్యోల్బణం తక్కువగా నమోదయ్యింది. క్యూ1లో జీడీపీ వృద్ధి 8.2 శాతంగా ఉంది. ఇన్వెస్ట్‌మెట్‌ సైకిల్‌ పుంజుకోలేదు. మరి ఇలాంటప్పుడు డబ్బు ఎక్కడి పోతున్నట్లు? వినియోగ రంగంలోకి వెళ్తోంది’ అని పేర్కొన్నారు. కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, పేజ్‌ ఇండస్ట్రీస్‌ స్టాక్స్‌కు అధిక ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. You may be interested

ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ది లిక్విడిటీ సమస్య

Monday 17th September 2018

మార్కెట్‌ నిపుణుడు ధీరేంద్ర కుమార్‌ రుణ భారం కారణంగా తలనొప్పులు ఎదుర్కొంటున్న ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌పై మార్కెట్‌ నిపుణుడు ధీరేంద్ర కుమార్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. కంపెనీది లిక్విడిటీ సమస్య కానీ ఆస్తులు లేకపోవడం సమస్య కాదన్నారు. కంపెనీలో ప్రముఖ వాటాదారులన్నీ పీఎస్‌యూ కంపెనీలని అందువల్ల కంపెనీ పరిస్థితిపై భారీగా భయపడాల్సిన అవసరం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. అలాగని కంపెనీలో అసలు సమస్యేలేదని కాదని, కానీ అది తీర్చగలిగే సమస్యేనని అన్నారు. కంపెనీలో

నెల రోజుల కోసం టాప్‌ బ్రోకరేజ్‌ల సిఫార్సులు

Monday 17th September 2018

వచ్చే మూడు, నాలుగువారాల్లో మంచి రాబడినిచ్చే పది స్టాకులను ప్రముఖ బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సిఫార్సులు 1. బయోకాన్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 725. స్టాప్‌లాస్‌ రూ. 620. కొన్నివారాలుగా అప్‌మూవ్‌లో ఉంది. హయ్యర్‌టాప్స్‌, బాటమ్స్‌ ఏర్పరుస్తోంది. ఇటీవల కరెక‌్షన్‌ ముగిసినట్లు భావించవచ్చు. బుల్లిష్‌ రివర్సల్‌ కాండిల్‌ పాటర్న్‌ ఏర్పడడం ఇందుకు నిదర్శనం.   2. ఐషర్‌ మోటర్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 31700. స్టాప్‌లాస్‌ రూ. 27950. చాలా కాలం

Most from this category