STOCKS

News


ఆగస్టులో ఆచితూచి కొనుగోళ్లు చేసిన ఎంఎఫ్‌లు

Tuesday 25th September 2018
Markets_main1537872797.png-20563

దేశీయ ఫండ్‌ మేనేజర్లు ఆగస్టులో ఆచితూచి నాణ్యమైన స్టాకులను కొనుగోలు చేసినట్లు గణాంకాలు చూపుతున్నాయి. నిజానికి ఆగస్టు నెలలో కేవలం కొన్ని స్టాకులు తప్ప ఇతర స్టాకులన్నీ నేల చూపులు చూశాయి. అయితే కొన్ని మంచి కంపెనీల స్టాకుల్లో ఎంఎఫ్‌లు వాటాలు పెంచుకున్నాయి.
- అదానీ పోర్ట్స్‌: గత జూలైతో పోలిస్తే ఆగస్టులో ఎంఎఫ్‌ల వాటా 15.4 శాతం మేర పెరిగింది. 
- ఐటీసీ: ఎంఎఫ్‌లు వాటాను 11.9 శాతం మేర పెంచుకున్నాయి. 
- ఆర్‌ఐఎల్‌: ఎంఎఫ్‌లు ఈ  షేరు కౌంటర్లో బాగా కొనుగోళ్లు జరిపాయి. వీటి వాటాలో 9.5 శాతం పెరుగుదల కనిపించింది. 
- టెక్‌మహీంద్రా, ఇండియా బుల్స్‌ హౌఽసింగ్‌, ఏసియన్‌ పెయింట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, గ్రాసిమ్‌, హిండాల్కోల్లో వాటాను 5- 11 శాతం మేర పెంచుకున్నాయి.
- ఆగస్టులో ఈక్విటీ ఫండ్స్‌లోకి నిధుల వరద 9 శాతం పెరిగి 28300 కోట్ల రూపాయలకు చేరింది. ఇదే సమయంలో నిధుల ఉపసంహరణ 66 శాతం పెరిగి 22400 కోట్లరూపాయలకు చేరింది. 
- రంగాల వారీగా చూస్తే ఫైనాన్షియల్స్‌, టెక్నాలజీ రంగాల కౌంటర్లలో ఎంఎఫ్‌ హోల్డింగ్స్‌ బాగా మారాయి. 
- బ్యాంకింగ్‌ రంగంలోని యాక్సిస్‌ బ్యాంక్‌లో ఎంఎఫ్‌లు వాటా తగ్గించుకున్నాయి. 

 


MFs

You may be interested

106 కౌంటర్లు బలహీనం

Tuesday 25th September 2018

సూచిస్తున్న ఎంఏసీడీ దేశీయ సూచీల్లో సోమవారం ముగింపు ప్రకారం 106 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బేరిష్‌ సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా నెగిటివ్‌గా  మారిన కంపెనీల్లో సుజ్లాన్‌, బలరామ్‌ పూర్‌చిని, టాటా స్టీల్‌, హాత్‌వే, జిందాల్‌ స్టెయిన్‌లెఽస్‌, కాస్ట్రాల్‌, ఎంటీఎన్‌ఎల్‌, మేఘమణి ఆర్గానిక్స్‌, మెర్కాటర్‌, గ్రాసిం, గృహ్‌ఫైనాన్స్‌ తదితరాలున్నాయి. ఈ కౌంటర్లలో ట్రెండ్‌ బలహీనంగా

పతనం ఆగింది-లాభాల ముగింపు

Tuesday 25th September 2018

నిఫ్టీ 11000 పాయింట్ల పైకి నిప్టీ ముంబై:- కొద్దిరోజులుగా షేరు, బాండ్ల మార్కెట్లను అతలాకుతలం చేస్తున్న ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ను పరిరక్షిస్తామని, డిఫాల్ట్‌ కానివ్వమని, మరిన్ని పెట్టుబడులు పడతామంటూ ప్రభుత్వ రంగ ఎల్‌ఐసీ చేసిన ప్రకటనతో మంగళవారం మార్కెట్‌ ఊరటపొందింది. ఐదు రోజుల నష్టాలకు బ్రేక్‌ పడింది. ఎల్‌ఐసీ ప్రకటన అనంతరం చివరి గంటలో వేల్యూ కొనుగోళ్లతో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ తిరిగి 11,000 పాయింట్ల పైకి ఎగబాకింది. గత ఐదు రోజుల

Most from this category