News


నిఫ్టీ ఫ్యూచర్లపై ఎంఎఫ్‌ల కన్ను

Friday 14th December 2018
Markets_main1544779070.png-22937

ఏడాది చివరకు రిటర్న్‌ను పెంచుకునే నిమిత్తం పలు మ్యూచువల్‌ ఫండ్స్‌ నిఫ్టీ ప్యూచర్స్‌ను తెగ కొనుగోలు చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని లార్జ్‌ క్యాప్‌ ఫండ్‌ హౌసులు తమ పోర్టుఫోలియోలో దాదాపు 9 శాతం నిఫ్టీ ఫ్యూచర్స్‌ను చేర్చుకున్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ వాల్యూ డిస్కవరీ, యాక్సిస్‌ మల్టిక్యాప్‌, యాక్సిస్‌ బ్లూచిప్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ బ్లుచిప్‌ ఫండ్‌, కోటక్‌ స్టాండర్డ్‌ మల్టిక్యాప్‌, కోటక్‌ ఇండియా కాంట్రా ఫండ్‌ తదితరాలు పోర్టుఫోలియోల్లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ను యాడ్‌ చేసుకున్నాయి. 
ఉన్నట్లుండి నవంబర్‌లో ఈ పథకాల్లోకి రిటైల్‌ ఇన్వెస్టర్ల పెట్టుబడులు వెల్లువలా రావడంతో ఎంఎఫ్‌లు ఇండెక్స్‌ ఫ్యూచర్లపై కన్నేశాయి. ఎంఎఫ్‌లు ఇండెక్స్‌ ఎఫ్‌అండ్‌ఓలను స్వల్పకాలిక వ్యూహాత్మక ట్రేడ్‌ల్లో వాడుతుంటాయి. తమకు నచ్చిన స్టాకుల్లో కరెక‌్షన్‌ వచ్చేవరకు వేచిచూస్తూ మరోపక్క స్వల్పకాలిక రాబడుల కోసం ఇండెక్స్‌ ఫ్యూచర్స్‌ను కొనుగోలు చేస్తుంటాయి. ఎంఎఫ్‌లు ఇండెక్స్‌ ఎఫ్‌అండ్‌ఓలను వ్యూహాత్మక ధోరణితో కొంటాయని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ తెలిపింది. యాక్సిస్‌ ఎంఎఫ్‌ ప్రతినిధి సైతం ఇదే విషయం చెబుతూ ఉన్న నిధులకు సమానంగా ఈక్విటీ ఎక్స్‌పోజర్‌ కోసం ఎంఎఫ్‌లు అప్పుడప్పుడు ఇలా చేస్తాయని తెలిపింది. పెద్ద ఎత్తున స్టాక్స్‌ను కొనుగోలు చేసేందుకు తగిన వ్యూహరచన జరిగే సమయంలో ఖాళీగా ఉండకుండా ఇలా ఇండెక్స్‌పై ఎంఎఫ్‌లు పెట్టుబడి పెడుతుంటాయి. సరైన స్టాక్‌ను గుర్తించి అందులో ఎంటరయ్యేందుకు తగిన సమయం రాగానే ఎంఎఫ్‌లు ఇండెక్స్‌ ఎఫ్‌అండ్‌ఓలను వదిలించుకొని సదరు స్టాకును కొనడం జరగుతుంది.


కేవలం ఖాళీగా ఉన్నందుకే ఎంఎఫ్‌ మేనేజర్లు ఇండెక్స్‌ ఎఫ్‌అండ్‌ఓలను కొనరని అనలిస్టులు చెబుతున్నారు. స్టాక్‌ ఫ్యూచర్స్‌తో పోలిస్తే నిఫ్టీ ప్యూచర్స్‌ లిక్విడిటీ ఎక్కువ కాబట్టి వీటిని కొనుగోలు చేస్తుంటారని చెబుతున్నారు. ఏడాది చివరకు ఎంఎఫ్‌ల వద్ద ఉన్న పథకాలు అనుకున్నంత మంచి ప్రదర్శన జరపకుంటే మేనేజర్లపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో ఎలాగైన డిసెంబర్‌ ఆఖరుకు కొంత లాభం చూపే క్రమంలో మేనేజర్లు ఇండెక్స్‌ ఫ్యూచర్లను నమ్ముకుంటారు. దీంతో పాటు తాము కొనుగోలు చేసిన స్టాకులను హెడ్జ్‌ చేయడానికి కూడా నిఫ్టీ ఫ్యూచర్లు మేనేజర్లకు ఉపయోగపడుతుంటాయి. మార్కెట్‌ కదలికల్లో స్పష్టత కరువైనప్పుడు ఎంఎఫ్‌లు ఇండెక్స్‌ ఎఫ్‌అండ్‌ఓలను నమ్ముకొంటుటాయి. అందుకే నవంబర్‌లో పలు ఎంఎఫ్‌లు ఇండెక్స్‌ ఫ్యూచర్స్‌ను పోర్టుఫోలియోలో నింపుకున్నాయి. You may be interested

టెలికాం షేర్ల లాభాల మోత

Friday 14th December 2018

కాల్‌ ధరలపై ట్రాయ్ విధించిన ఆంక్షలను టెలికాం డిస్ప్యూట్స్ సెటిల్‌మెంట్ ఎండ్ అప్పిలేట్ ట్రిబ్యునల్(టీడీఎస్‌ఏటీ) తోసిపుచ్చడంతో శుక్రవారం టెలికాం షేర్లు లాభాల మోత మోగిస్తున్నాయి. టెలికాం రంగంలోకి రిలయన్స్ జియో రంగప్రవేశంతో తమ సబ్‌స్క్రెబర్లను నిలుపుకునేందుకు టారిఫ్ రేట్లను గణనీయంగా తగ్గించడంతో గత రెండేళ్లుగా పోటీదారు కంపెనీ భారీగా నష్టపోయాయి. టీడీఎస్‌ఏటీ తాజా తీర్పుతో రేట్ల విధింపు అంశంపై  ఇప్పుడు ప్రైవేట్ ఆపరేటర్లు స్వేచ్ఛను కలిగి ఉంటారు కాబట్టి ఆదాయం

ఈక్విటీకే అగ్రతాంబూలం!!

Friday 14th December 2018

ఇన్వెస్టర్లు వారి రిస్క్‌ ప్రొఫైల్‌ ఆధారంగా ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగించాలని ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ హెడ్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ అభిమన్యు సోఫత్‌ సూచించారు. రిస్క్‌ తీసుకోవడానికి ఇష్టపడే ఇన్వెస్టర్‌ తన పోర్ట్‌ఫోలియోలో 70 శాతాన్ని ఈక్విటీకి కేటాయించొచ్చని తెలిపారు. ఇక 20 శాతం డెట్‌కు, 10 శాతం బంగారంలో ఇన్వెస్ట్‌ చేయవచ్చని పేర్కొన్నారు. అదే ఒక మోస్తరుగా రిస్క్‌ను భరించగలిగే వ్యక్తి తన పోర్ట్‌ఫోలియోలో 50 శాతం ఈక్విటీకి, 35 శాతం డెట్‌కు,

Most from this category