STOCKS

News


2018లో ఫండ్స్‌ ఆస్తుల వృద్ధి రూ.1.24 లక్షల కోట్లు

Monday 7th January 2019
Markets_main1546858254.png-23455

సిప్‌ పెట్టుబడుల్లో స్థిరమైన పెరుగుదల
న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్స్‌ ఆస్తుల విలువ 2019లో నికరంగా రూ.1.24 లక్షల కోట్ల మేర పెరిగింది. ఇది 5.54 శాతం వృద్ధి. దీంతో అన్ని ఏఎంసీల నిర్వహణలోని ఆస్తుల విలువ 2018 డిసెంబర్‌ నాటికి రూ.23.61 లక్షల కోట్లుగా ఉంది. రిటైల్‌ ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యం మంచిగా ఉండడం, సిప్‌ ద్వారా వచ్చే పెట్టుబడులు స్థిరంగా పెరుగుతూ వస్తుండడం ఏఎంసీల నిర్వహణలోని ఆస్తుల వృద్ధికి దోహదపడింది. 2017 డిసెంబర్‌ నాటికి ఏఎంసీల ఆస్తుల విలువ రూ.22.37 లక్షల కోట్లుగా ఉందని యాంఫి వెల్లడించింది. ఫండ్స్‌ ఆస్తుల విలువ వృద్ధి చెందడం వరుసగా ఆరో ఏడాది. అయితే, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఉన్న వృద్ధి వేగంతో పోల్చుకుంటే తగ్గింది. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం తర్వాత డెట్‌ఫండ్స్‌పై ఒత్తిడి నెలకొనడం, ఈక్విటీ మార్కెట్లలో అస్థిరతలు ఇందుకు కారణాలు. రిటైల్‌ ఇన్వెస్టర్ల బలమైన ప్రాతినిధ్యంతోపాటు, సిప్‌ పెట్టుబడుల్లో నిలకడైన వృద్ధి, ఫండ్స్‌ ఆస్తులు పెరగడానికి కారణమని క్వాంటమ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఎండీ, సీఈవో జిమ్మీ పటేల్‌ పేర్కొన్నారు.  



You may be interested

క్రూడాయిల్‌ ధర అంచనా తగ్గించిన గోల్డ్‌మన్‌

Monday 7th January 2019

కొత్త ఏడాదికి బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర అంచనాలను అంతర్జాతీయ బ్రోకింగ్‌ దిగ్గజం గోల్డ్‌మన్‌ సాక్స్‌ 62.50 డాలర్లకు తగ్గించింది. యూఎస్‌ షేల్‌ గ్యాస్‌ ఉత్పత్తి పెరుగుదల, చమురు మిగులు అధికం కావడంతో ఏడాది అంచనాలను 70 డాలర్లనుంచి తగ్గించినట్లు బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. బ్రెంట్‌తో పాటు డబ్ల్యుటీఐ క్రూడ్‌ అంచనాలను కూడా గోల్డ్‌మన్‌ తగ్గించింది. డబ్ల్యుటీఐ క్రూడాయిల్‌ ధర ఏడాది అంచనాను 64.5 డాలర్ల నుంచి 55.50 డాలర్లకు

9 శాతం రాబడినిచ్చే డెట్‌ ఫండ్లు ఉన్నాయా?

Monday 7th January 2019

- పెద్ద మొత్తంలో ఒకేసారి ఇన్వెస్ట్‌ చేయటం తప్పా? - ఫండ్‌ నిపుణుడు ధీరేంద్రకు ‘సాక్షి’ పాఠకుల ప్రశ్నలు ప్ర: నేను ఏడాది క్రితం ఫ్రాంక్లిన్‌ ఇండియా స్మాలర్‌ కంపెనీస్‌ ఫండ్‌లో పెద్ద మొత్తం ఇన్వెస్ట్‌ చేశాను. అప్పటి నుంచి ఈ ఫండ్‌ పనితీరు ఏ మాత్రం బాగులేదు. నా ఇన్వెస్ట్‌మెంట్‌ 20 శాతం వరకూ తరిగిపోయింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? -సత్యం, విజయవాడ  జ: సాధారణంగా చాలా మంది ఇన్వెస్టర్లు చేసే తప్పునే

Most from this category