ఫార్మా, ఐటీ షేర్ల కొనుగోళ్లకు మ్యూచువల్ ఫండ్స్ మొగ్గు
By Sakshi

ముంబై:- డాలర్ మారకంలో రూపాయి క్షీణత కారణంగా మ్యూచువల్ ఫండ్ హౌస్‌లు ఐటీ, ఫార్మా రంగ షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నాయి. ఆగస్ట్‌లో పలు మ్యూచువల్ ఫండ్స్‌లు ఎగుమతులపై ఆదారపడే ఐటీ, ఫార్మా రంగ షేర్లలో తమ వాటాలను పెంచుకున్నట్లు ఫించ్ రేటింగ్ గణాంకాలు చెబుతున్నాయి. ఐసీఐసీఐ ప్రిడెన్షియల్ మ్యూచువల్ ఫండ్:- ఫార్మారంగంలో లుపిన్షేర్లను 35లక్షలు, డాక్టర్ రెడ్డీస్ లాబ్ షేర్లను 4.5లక్షలు కొనుగోలు చేసింది. ఇక ఐటీ విభాగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న టీసీఎస్‌కు చెందిన 6.2లక్షల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది. విశ్లేషణ:- రూపాయి పతనం కారణంగా ఎగుమతులపై ఆధారపడే ఐటీ, ఫార్మా రంగ షేర్లపై తాము సానుకూలంగా ఉన్నట్లు ఐసీఐసీఐ ఛీప్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ శంకర్ నరేన్ అంటున్నారు. ‘‘ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అడుగుపెట్టిన తరువాత ఐటీ రంగం బాటమ్ అవుట్ చేరుకుంది. అంతర్జాతీయంగా డిజిటల్ సాంకేతికతకు డిమాండ్ పెరగడం, యూఎస్, యూరప్ దేశాల్లో అవుట్సోర్సింగ్ పెరగడం కారణాలలో ఈ రంగం రీకవరి దశకు చేరుకుందని మేము నమమ్మతున్నాము. అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు డాలర్ల రూపంలో ఎక్కువ ఆదాయాల్ని ఆర్జించగలవు. రూపాయి క్షీణతతో సాఫ్ట్వేర్ కంపెనీలు ప్రత్యక్షంగా లాభపడతాయని ఆయన తెలిపారు. ఇదివరకు మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు కేవలం టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి అగ్ర కంపెనీలకు చెందిన షేర్లను మాత్రమే కొనుగోలు చేసేవారు. ఇప్పుడు హెక్సావేర్, ఎల్ అండ్ టీ టెక్నాలజీస్ సర్వీసెన్ లాంటి షేర్లను కొనుగోలు చేయడం ఐటీ రంగానికి శుభపరిణామని నరేన్ అభిప్రాయపడుతున్నారు. డాలర్ మారకంలో రూపాయి 1శాతం క్షీణిస్తే ఐటీ కంపెనీల ఎర్నింగ్ పర్ షేరు 1.5శాతం వృద్ధిని సాధిస్తుందని ఆయన తెలిపారు.
హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్:- ఎల్ అండ్ టీ టెక్నాలజీలో 20లక్షలు, ఇన్ఫోసిస్‌లో 6 లక్షల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది. ఇక ఫార్మా రంగంలో అరబిందో ఫార్మాకు చెందిన 3.5లక్షల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది.
ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్:- ఫార్మా రంగంలోని అరబిందో ఫార్మాకు చెందిన 23.5లక్షల ఈక్విటీ షేర్లను, టెక్ మహీంద్రాకు చెందిన 2.86లక్షల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది.
రిలయన్స్ నిప్పాన్ ఎఎంసీ:- ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్‌కు చెందిన 6లక్షల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది.
ఫండ్ హౌస్ పేరు
ఫార్మా రంగం
ఐటీ రంగం
ఐసీఐసీఐ మ్యూచువల్ ఫండ్
కేడిల్లా హెల్త్‌కేర్, లుపిన్, డాక్టర్ రెడ్డీస్
టీసీఎస్
హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్
అరబిందో, టోరెంటో ఫార్మా
ఎల్ అండ్ టీ టెక్నాలజీస్, కేపీఐటీ, ఇన్ఫోసిస్
రిలయన్స్ మ్యూచువల్ ఫండ్స్
కేడిల్లా హెల్త్‌కేర్
ఎల్ అండ్ టీ టెక్నాలజీస్
ఆదిత్యా బిర్లా సన్లైలప్ మ్యూచువల్ ఫండ్
ఫైజర్
హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఎల్ అండ్ టీ టెక్నాలజీస్
ఎస్బీఐ
అరబిందో ఫార్మా, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, స్రైడ్స్ ఆర్కోలాబ్
డిక్సాన్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్
You may be interested
ట్రేడింగ్ వేళల పొడిగింపు వాయిదా..!?
Tuesday 18th September 2018మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ అక్టోబర్ 1నుంచి దేశీయ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సమయాన్ని పొడిగించే అంశాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఉదయం 9:00 నుంచి రాత్రి 11.55 గంటల వరకూ ట్రేడింగ్ నిర్వహించే అంశంపై స్టాక్ ఎక్చ్సేంజ్‌లు, బ్రోకర్లలు ఏకాభిప్రాయానికి రాలేకపోవడం సెబీ వాయిదా నిర్ణయాన్ని తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గతంలో ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో ఉదయం 9:00 నుంచి రాత్రి 11.55 గంటల వరకూ ట్రేడింగ్
తదుపరి వీలీన ప్రక్రియలో ఈ మూడే లీడ్ బ్యాంకులు
Tuesday 18th September 2018ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా, దేనా బ్యాంక్, విజయా బ్యాంక్‌ల్ని విలీనపరుస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తదుపరి విలీన ప్రక్రియలో మరో మూడు బ్యాంకులు నేతృత్వం వహిస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అవి....బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్‌లు. ఈ మూడు రాబోయే విలీన ప్రక్రియలో ఆగ్రిగేటర్లు కావొచ్చంటూ ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ జేపీ మోర్గాన్ తాజాగా విడుదల చేసిన నోట్లో పేర్కొంది. ఒక