STOCKS

News


ఐపీఓకు మెట్రోపోలిస్‌ హెల్త్‌కేర్‌

Saturday 29th September 2018
Markets_main1538201071.png-20694

న్యూఢిల్లీ: డయాగ్నస్టిక్స్‌ కంపెనీ మెట్రోపోలిస్‌ హెల్త్‌కేర్‌ త్వరలో ఐపీఓకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) రానుంది.  ఐపీఓ సంబంధిత పత్రాలను ఈ కంపెనీ ఇటీవలే మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. ఐపీఓలో భాగంగా కంపెనీ 1.52 కోట్ల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. అంతేకాకుండా ప్రమోటర్లు, భాగస్వాములకు చెందిన 1.52 కోట్ల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ విధానంలో విక్రయిస్తారు. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.1,500 కోట్లు సమీకరిస్తుందని అంచనా. 
ఈ ఐపీఓకు లీడ్‌ మేనేజర్లుగా జేఎమ్‌ ఫైనాన్షియల్‌, క్రెడిట్‌ సూసీ సెక్యూరిటీస్‌(ఇండియా), గోల్డ్‌మన్‌ శాక్స్ (ఇండియా), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా క్యాపిటల్‌ కంపెనీలు వ్యవహరిస్తాయి. కాగా డయాగ్నస్టిక్స్‌ సెగ్మెంట్లో ఇప్పటికే స్టాక్‌ మార్కెట్లో డాక్టర్‌  లాల్‌ పాథ్‌ల్యాబ్స్‌, థైరోకేర్‌ టెక్నాలజీస్‌ లిస్టయ్యాయి.

.



You may be interested

ట్రేడ్‌వార్‌తో తయారీ హబ్‌గా భారత్‌

Saturday 29th September 2018

న్యూఢిల్లీ: అమెరికా, చైనాల మధ్య సుంకాల బాదుడుతో జరుగుతున్న అంతర్జాతీయ వాణిజ్య యుద్ధాన్ని మనకు కలిసొచ్చే అంశంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అభివర్ణించారు. వాణిజ్య యుద్ధం తొలుత అస్థిరతకు కారణమైనా, క్రమంగా భారత్‌కు అవకాశాలను కల్పిస్తుందని, అతిపెద్ద వాణిజ్య, తయారీ కేంద్రంగా అవతరించేందుకు సాయపడుతుందని జైట్లీ పేర్కొన్నారు. వ్యాపార సంస్థలు నీతి, నిజాయతీతో వ్యహరించాలని, పన్నుల్లో తమ వాటాను చెల్లించాలని సూచించారు. లేదంటే విశ్వసనీయత లేని వ్యాపారాల

రంగాల వారీగా ఎక్స్‌పోజర్‌పై ఎస్‌బీఐ సమీక్ష

Saturday 29th September 2018

కోల్‌కతా: ప్రభుత్వరంగ దిగ్గజ బ్యాంకు ఎస్‌బీఐ, వివిధ రంగాల వారీగా క్రెడిట్‌ ఎక్స్‌పోజర్‌కు సంబంధించి మధ్యంతర సమీక్ష నిర్వహించనుంది. ఓ రుణానికి సంబంధించి డిఫాల్ట్‌ అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి?, దాన్ని మంజూరు చేయాలా? లేదా అన్నది ఈ సమీక్షలో నిర్ణయించడం జరుగుతుందని ఎస్‌బీఐ ఎండీ దినేష్‌ ఖరా చెప్పారు. సీఐఐ నిర్వహించిన ఓ కార్యక్రమం సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. బ్యాంకు రుణాల్లో కార్పొరేట్‌ రంగానికి ఇచ్చినవి ప్రస్తుతం

Most from this category