STOCKS

News


మెటల్‌ షేర్ల పతనం

Monday 24th December 2018
Markets_main1545627524.png-23197

నష్టాల ట్రేడింగ్‌లో భాగంగా సోమవారం మార్కెట్లో మెటల్‌ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ నేడు ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 1.50శాతం క్షీణించింది. అమెరికా - చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం ఇప్పట్లో ముగియదనే వార్తలు మరోసాని తెరపైకి రావడం కూడా సెంటిమెంట్‌ను బలహీనపరిచింది. నేడు నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 3,158.05 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఈ ఇండెక్స్‌లోని హెవీ వెయిట్‌ షేర్లైన జేఎస్‌డబ్లూ‍్య, వేదాంత షేర్ల పతనంతో ట్రేడింగ్‌ ప్రారంభంలో ఇండెక్స్‌ 1.50శాతం నష్టపోయి 3,115.50 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. ఉదయం గం.10:00లకు ఇండెక్స్‌ గతముగింపు(3,162.30)తో పోలిస్తే 1.25శాతం నష్టోయి 3,130.15ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో అత్యధికంగా జేఎస్‌డబ్ల్యూస్టీల్‌ 4శాతం నష్టపోయింది. సెయిల్‌, జిందాల్‌స్టీల్‌, జెఎస్సార్‌స్టీల్‌, మెయిల్‌ షేర్లు 2శాతం క్షీణించాయి. అలాగే వేదాంత, టాటాస్టీల్‌, హిందాల్కో, ఎన్‌ఎండీసీ, హిందూస్థాన్‌ కాపర్‌ 1శాతం పతనమయ్యాయి, నాల్కో, హిందూస్థాన్‌ జింక్‌, వెల్‌స్పాన్‌ కార్పోరషన్‌, కోల్‌ ఇండియా, ఏపిఎల్‌ అపోలో షేర్లు అరశాతం నష్టపోయాయి.



You may be interested

మళ్లీ ఇన్ఫోసిస్‌ షేర్ల బైబ్యాక్‌?

Monday 24th December 2018

టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ రెండోసారి షేర్ల బైబ్యాక్‌కు రెడీ అవుతోంది. ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలోపేతం చేసేందుకు కంపెనీ బోర్డు 1.6 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.10,400 కోట్లు) విలువైన షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదనను పరిశీలిస్తోంది. అతిత్వరలో ఈ విషయంపై ఒక ప్రకటన వెలువడొచ్చు. కంపెనీ వ్యవస్థాపక సభ్యుల్లో కొందరు తాజా బైబ్యాక్‌లో వారి షేర్లను విక్రయించొచ్చు. కాగా ఇన్ఫోసిస్‌ గత షేర్ల బైబ్యాక్‌ మారటోరియం గడువు డిసెంబర్‌తో ముగుస్తుంది. కంపెనీ

అంతర్జాతీయంగా ఆందోళనే

Monday 24th December 2018

మార్కెట్లలో ఎగుడుదిగుళ్లు సహజమేనని, జరగబోయే పరిణామాల్ని మనం పూర్తిస్థాయిలో ఊహించలేం కాబట్టి... కంపెనీల రాబడులను, వాటి భవిష్యత్తునే పెట్టుబడులకు ప్రాతిపదిక చేసుకోవాలని ఎడెల్‌వీస్‌ అసెట్‌ మేనేజిమెంట్‌ కంపెనీ సీఈఓ రాధికా గుప్తా సూచించారు. అంతర్జాతీయ పరిణామాలు కొంత ఆందోళనకర స్థాయిలోనే ఉన్నా... దేశీయంగా మాత్రం అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయన్నారు. దేశంలో ఫండ్‌ మేనేజర్లుగా రాణిస్తున్న అతికొద్ది మంది మహిళల్లో రాధికది ప్రత్యేక స్థానం. ఫోర్‌ఫ్రంట్‌ క్యాపిటల్‌ పేరిట సొంత ఇన్వెస్ట్‌మెంట్‌

Most from this category