STOCKS

News


మురిపించిన మెటల్‌ షేర్లు

Friday 7th September 2018
Markets_main1536308749.png-20060

మెటల్‌ షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో మురిపించాయి. మిడ్‌సెషన్‌ సమయానికి మెటల్‌ షేర్లలో నెలకొన్న కొనుగోళ్లతో బీఎస్‌ఈలో మెటల్‌ ఇండెక్స్‌ 2శాతం వరకూ లాభపడింది. మధ్యాహ్నం గం.1:20ని.లకు ఇండెక్స్‌ గతముగింపు(13776)తో పోలిస్తే 2శాతం లాభంతో 14048 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ సూచీలో భాగమైన 10 షేర్లకు గానూ మొత్తం 9షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా హిందూస్థాన్‌ జింక్‌ మాత్రం అరశాతం నష్టంతో ట్రేడ్‌ అవుతోంది. ఎన్‌ఎండీసీ అత్యధికంగా 6శాతం లాభపడింది. హిందాల్కో 4శాతం, జిందాల్‌ స్టీల్‌ 3.50శాతం, టాటాస్టీల్‌ 3శాతం, సెయిల్‌ 2.50శాతం, నాల్కో 2శాతం, జేఎస్‌డబ్లూ‍్య స్టీల్‌ 1శాతం, కోల్‌ ఇండియా 1శాతం, వేదాంత అరశాతం లాభపడ్డాయి. మరోవైపు హిందూస్థాన్‌ జింక్‌ మాత్రం అరశాతం నష్టపోయింది.
-    ఇదే సమయానికి ప్రధాన సూచీలైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌; ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలు పరిమితి శ్రేణిలో ట్రేడ్‌ అవుతున్నాయి.
-    సెన్సెక్స్‌ 62 పాయింట్ల లాభంతో 38,30461 వద్ద; నిఫ్టీ 30 పాయింట్ల లాభంలో 11,566 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి
-    ఆసియా మార్కెట్ల నష్టాల ట్రేడింగ్‌ ప్రధాన సూచీల పరిమితి శ్రేణి ట్రేడింగ్‌కు కారణమవుతోంది.



You may be interested

తగ్గినప్పుడల్లా కొనండి..

Friday 7th September 2018

వినియోగ రంగ స్టాక్స్‌ను పడిపోయినప్పుడల్లా కొనొచ్చంటున్నారు ఏంజెల్‌ బ్రోకింగ్‌ ఫండ్‌ మేనేజర్‌ మయురేష్‌ జోషి. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.  ఎఫ్‌ఎంసీజీ స్టాక్స్‌ ఒక సమయంలో కన్సాలిడేట్‌ అవుతాయని తెలిపారు. విక్రయాల వృద్ధి గతేడాది తక్కువ స్థాయిలో నమోదయ్యిందే విషయాన్ని గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం కంపెనీల మేనేజ్‌మెంట్లు భవిష్యత్‌లో బలమైన విక్రయాల వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నాయని పేర్కొన్నారు. కనీస మద్దతు ధర, కొత్త

వచ్చే ఏడాది కాలానికి టాప్‌-5 స్టాక్స్‌

Friday 7th September 2018

వచ్చే ఏడాది కాలానికి గానూ ఇన్వెస్ట్‌ చేయడానికి అనువైన టాప్‌-5 స్టాక్స్‌ను సిఫార్సు చేస్తున్నారు నర్నోలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ డైరెక్టర్‌, సీఐవో శైలేంద్ర కుమార్‌. అవేంటో ఒకసారి చూద్దాం.. స్టాక్‌: లార్సెన్‌ అండ్‌ టుబ్రో రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.1,350 టార్గెట్‌ ప్రైస్‌: రూ.1,734 రిటర్న్‌ అంచనా: 22 శాతం కంపెనీ మేనేజ్‌మెంట్‌ భవిష్యత్‌పై ధీమాగా ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి కల్లా రెవెన్యూను రూ.2 లక్షల కోట్లకు తీసుకెళ్లాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అలాగే మర్జిన్లను 10

Most from this category