STOCKS

News


మెటల్స్‌, మైనింగ్‌ షేర్లు ఆకర్షిస్తున్నాయ్‌!!

Thursday 18th October 2018
Markets_main1539849900.png-21271

నీతి ఆయోగ్‌ ఇటీవల్ల పీఎంవోకు పలు ప్రతిపాదనలు అందించినట్లు మీడియాలో వార్తలు వెలువడ్డాయి. వీటి ప్రకారం నీతి ఆయోగ్‌ చేసిన ప్రతిపాదనలు గమనిస్తే..
♦ ఐరన్‌ ఓర్‌, అల్యూమినియం, కాపర్‌ దిగుమతులపై సుంకాలను పెంచాలి.
♦ ఐరన్‌ ఓర్‌ ఎగుమతులపై సుంకాలను తగ్గించాలి.
♦ కర్నాటక నుంచి ఐరన్‌ ఓర్‌ ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేయాలి.
ఈ ప్రతిపాదనల ఆధారంగా వాణిజ్య లోటును తగ్గించుకునేందుకు కేంద్ర వాణిజ్య శాఖ తగిన నిర్ణయాలు తీసుకోనుంది. నీతి ఆయోగ్‌ ప్రతిపాదనల వల్ల పలు కంపెనీలకు ప్రయోజనం కలిగితే, మరికొన్ని కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది. ప్రతిపాదనలు అమల్లోకి వస్తే.. ఐరన్‌ ఓర్‌ ఎగుమతులు పెరుగుతాయి. అలాగే దేశీయంగా ఐరన్‌ ఓర్‌ ధరలు కూడా పెరుగుతాయి. ఇది ఐరన్‌ ఓర్‌ మైనింగ్‌ కంపెనీలకు ప్రయోజనకరం. అదేసమయంలో నాన్‌-ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ కంపెనీలకు ప్రతికూలం. తక్కువ అల్యుమినియం, కాపర్‌ దిగుమతులు.. దేశీయంగా అధిక అల్యూమినియం ధరలు వంటివి అల్యూమినియం, కాపర్‌ తయారీ కంపెనీలకు ప్రయోజనకరం. ఈ అంశాల నేపథ్యంలో ఎన్‌ఎండీసీ ఎర్నిం‍గ్స్‌ మెరుగుపడొచ్చు. జేఎస్‌డబ్ల్యూ ఐరన్‌ ఓర్‌ వ్యయాలు పెరుగుతాయి. హిందాల్కో కన్సాలిడేటెడ్‌ ఎర్నింగ్స్‌ 7 శాతం మేర ఎగిసే అవకాశముంది. అల్యూమినియంపై దిగుమతి సుంకాల పెరుగుదల వల్ల హిందాల్కో మాత్రమే కాకుండా వేదాంత కూడా ప్రయోజనం పొందనుంది. కంపెనీ ఎర్నింగ్స్‌ 3 శాతం మేర పెరగొచ్చు. జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ కంపెనీ ఐరన్‌ ఓర్‌ వ్యయాలు పెరుగుతాయి. అందువల్ల కంపెనీ ఎర్నింగ్స్‌పై ప్రతికూల ప్రభావం పడొచ్చు.  



You may be interested

జెట్‌లో టాటాకు వాటా??

Thursday 18th October 2018

దేశీ వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్‌.. నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌లో వాటా కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతోందనే వార్త ఇప్పుడు మీడియాలో చక్కెర్లు కొడుతోంది. ఇది ఎంత వరకు నిజమో తెలీదు కానీ.. ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం చూస్తే.. టాటా గ్రూప్‌.. జెట్‌ ఎయిర్‌వేస్‌లో వాటా కొనుగోలు కోసం చర్చలు ప్రారంభించింది. ఇందులో భాగంగా టాటా గ్రూప్‌.. జెట్‌ ఎయిర్‌వేస్‌లో మేనేజ్‌మెంట్‌

మెటీరియల్స్‌ క్యూ2 ఎర్నింగ్స్‌ ఆకట్టుకుంటాయా?

Thursday 18th October 2018

మెటీరియల్స్‌ (ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, కెమికల్స్‌) రంగ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసికంలో (క్యూ2, జూలై-సెప్టెంబర్‌) ఎలాంటి ఎర్నింగ్స్‌ ప్రకటించవచ్చొ బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ఒక నివేదికలో పేర్కొంది. కాగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఇప్పటికే క్యూ2 ఎర్నింగ్స్‌ను ప్రకటించేసింది. రికార్డ లాభాలను సాధించింది. మిగిలిన కంపెనీల ఫలితాలు ఎలా ఉంటాయో ఒకసారి చూస్తే..  కంపెనీ        క్యూ2 ఎర్నింగ్స్‌ అంచనాలు ఓఎన్‌జీసీ        చాలా బాగుంటాయి ఐఓసీ        యావరేజ్‌ బీపీసీఎల్‌  

Most from this category