STOCKS

News


నష్టాల్లో మెటల్‌ షేర్లు

Friday 10th May 2019
Markets_main1557479679.png-25665

మెటల్‌ షేర్లు శుక్రవారం మిడ్‌సెషన్‌ సమయానికి భారీగా నష్టపోయాయి. మెటల్‌ షేర్లకు ప్రాతనిధ్యం వహించే నిఫ్టీ మెటల్‌ నేడు దాదాపు 2శాతం నష్టపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో మెటల్‌ షేర్ల నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండంతో మన మార్కెట్లో మెటల్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. టాటా స్టీల్‌తో జాయింట్‌వెంచర్‌ ఏర్పాటు విఫలం కావచ్చని జర్మనీ స్టీల్ దిగ్గజ కంపెనీ థిసేన్‌క్రుప్ భావిస్తున్నట్లు రాయిటర్‌ మీడియా సంస్థ ఒక కథనాన్ని వెల్లడించడంతో టాటాస్టీల్‌ కంపెనీ షేర్లు అత్యధికంగా 7.50శాతం నష్టపోయాయి. ఏపిల్‌ అపోలో స్టీ్‌ల్‌ 2.50శాతం, ఎన్‌ఎండీసీ 2శాతం, వేదాంత 1శాతం, హిందాల్కో, హిందూస్థాన్‌ జింక్‌ షేర్లు అరశాతం పతనమయ్యాయి. అలాగే జేఎస్‌ఎల్‌డబ్ల్యూ హిస్సార్‌ పావుశాతం నష్టపోయింది. వెల్‌స్పాన్‌ కార్పోషన్‌ 2.50శాతం పెరిగింది. సెయిల్‌, మెయిల్‌, జిందాల్‌ స్టీల్‌ షేర్లు అరశాతం లాభపడ్డాయి. మధ్యాహ్న గం.2:30ని.లకు ఇండెక్స్‌ 1.50శాతం నష్టంతో 2,884.30  వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

ఓపిక ఉంటే మిడ్‌క్యాప్స్‌లో మంచి అవకాశాలు!

Friday 10th May 2019

దీర్ఘకాలిక ధృక్పథంతో వేచిచూసే మదుపరులకు మిడ్‌క్యాప్స్‌ మంచి అవకాశాన్నిస్తున్నాయని ఏగన్‌ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌ సీఐఓ సైబల్‌ ఘోష్‌ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే మార్కెట్లో తీవ్రకదలికలు, లార్జ్‌క్యాప్స్‌ హవా అనే రెండు అంశాలు ఎలాంటి మార్పులేకుండా ఉన్నాయన్నారు. ఆర్థిక సంవత్సరం మారినా మార్కెట్లో నిర్దిష్ట దిశానిర్దేశం లేదన్నారు. దీంతో మదుపరులు ఎక్కువగా పెద్ద స్టాకులవైపు చూస్తున్నారని, అందువల్లే మొత్తం మార్కెట్‌ కన్నా లార్జ్‌క్యాప్స్‌ మాత్రమే మంచి ప్రదర్శన చూపుతున్నాయని

అంచనాలను అందుకోని ఎస్‌బీఐ

Friday 10th May 2019

దేశీయ అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ మార్చి త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. క్యు4లో బ్యాంకు రూ. 838.40 కోట్ల నికరలాభం నమోదు చేసింది. అంతకుముందేడాది ఇదే సమయంలో బ్యాంకు రూ. 7718 కోట్ల నష్టం నమోదు చేసింది. తాజా త్రైమాసికంలో లాభాలు ప్రకటించినా, ఈ లాభం అనలిస్టులు అంచనా వేసిన రూ. 4890 కోట్ల కన్నా చాలా తక్కువ. క్యు3లో బ్యాంకు రూ. 3954 కోట్ల లాభం ఆర్జించింది. అయితే అసెట్‌

Most from this category