News


మెరుస్తున్న మెటల్‌ షేర్లు

Thursday 9th August 2018
Markets_main1533807659.png-19102

ముంబై:- హెవీ వెయిట్‌ షేర్ల ర్యాలీ గురువారం ఎన్‌ఎస్‌ఈ మెటల్‌ సూచి వెలుగులు విరజిమ్ముతోంది. నేడు ఎన్‌ఎస్‌ఈలోని మెటల్‌ ఇండెక్స్‌ 3,476 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో లోహ రంగ దిగ్గజాలైన కోల్‌ ఇండియా (2 శాతం) హిందాల్కో(4 శాతం), వేదాంత(3 శాతం), టాటా స్టీల్‌ (2 శాతం) షేర్లు లాభపడంతో మెటల్‌ ఇండెక్స్‌ 2శాతం ర్యాలీ చేసింది. మధ్యాహ్నం గం.3:00లకు ఇండెక్స్‌ గత ముగింపు(3,453.60)తో పోలిస్తే 1.50శాతం లాభపడి 3,508 పాయింట్ల ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి హిందాల్కో(4 శాతం), వేదాంత(3 శాతం)షేర్లు ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ - 50లో చోటు దక్కించుకున్నాయి. నిఫ్టీ మెటల్‌ సూచీలోని అత్యధికంగా నాల్కో(7.50 శాతం) లాభపడగా, ఏపిఎల్‌ అపోలో, వెల్‌స్పాన్‌ కార్పోరేషన్‌, కోల్‌ ఇండియా, సెయిల్‌, హిందూస్థాన్‌ కాపర్‌, టాటా స్టీల్‌, హిందూస్థాన్‌ జింర్‌ షేర్లు 3నుంచి 1శాతం లాభపడ్డాయి. అలాగే, జేఎస్‌ఎల్‌ హిస్సార్‌, జేఎస్‌డబ్ల్యూ, జిందాల్‌ స్టీల్‌ అరశాతం ర్యాలీ చేశాయి. అయితే మరోవైపు ఎన్‌ఎండీసీ అ‍త్యధికంగా 6.50శాతం నష్టపోగా, ఎంఓఐఎల్‌ షేరు అరశాతం నష్టపోయింది.



You may be interested

స్వరాజ్‌ ఇంజిన్స్‌కు బై రేటింగ్‌

Thursday 9th August 2018

బ్రోకరేజ్‌: ఆనంద్‌రాఠి స్టాక్‌: స్వరాజ్‌ ఇంజిన్స్‌ ఇండస్ట్రీ: ఆటో రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర రూ.1820 టార్గెట్‌ ప్రైస్‌: రూ.2,498  స్వరాజ్‌ ఇంజిన్స్‌ షేరుపై బ్రోకరేజ్‌ సంస్థ ఆనంద్‌రాఠి.. స్వరాజ్‌ స్టాక్స్‌పై బుల్లిష్‌గా ఉంది. షేరు కొనొచ్చని సిఫార్సు చేస్తోంది. స్వరాజ్‌ ఇంజిన్స్‌ షేరు ధర రూ.2,498 వరకూ వెళ్లొచ్చని అంచనా వేస్తోంది. ప్రభుత్వాల సబ్సిడీ స్కీమ్స్‌, ట్రాక్టర్‌ విక్రయాల బాగా పెరగొచ్చనే అంచనాలు, తక్కువ ‍వ్యయాలు, బలమైన బ్యాలెన్స్‌ షీటు వంటి పలు అంశాల ఇందుకు కారణంగా నిలుస్తాయని పేర్కొంది.

అపోలో టైర్స్‌పై ఆనంద్‌రాఠి బుల్లిష్‌

Thursday 9th August 2018

బ్రోకరేజ్‌: ఆనంద్‌రాఠి స్టాక్‌: అపోలో టైర్స్‌ ఇండస్ట్రీ: ఆటో రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర రూ.270 టార్గెట్‌ ప్రైస్‌: రూ.314 బ్రోకరేజ్‌ సంస్థ ఆనంద్‌రాఠి.. అపోలో టైర్స్‌పై బుల్లిష్‌గా ఉంది. దీర్ఘకాలంలో మంచి రాబడి అందుకోవచ్చని అంచనా వేస్తోంది. స్టాక్‌పై బై కాల్‌ను కొనసాగిస్తోంది. ట్రక్స్‌ టైర్లలో బలమైన డిమాండ్‌ నమోదవ్వడం, సామర్థ్యం పెంపు, యూరోపియన్‌ వ్యాపారం పుంజుకోవడం, కార్యకలాపాల విస్తరణ, ఆదాయ వృద్ధి అంచనాలు ఇందుకు కారణంగా పేర్కొంది. అదే సమయంలో రబ్బరు ధరలు అధికంగా ఉండటం, సామర్థ్యం

Most from this category