STOCKS

News


మెటల్‌ షేర్లకు ట్రేడ్‌వార్‌ సెగలు..!

Wednesday 11th July 2018
Markets_main1531298107.png-18205

ముంబై:- ట్రేడ్‌వార్‌ సెగలతో బుధవారం మెటల్‌ షేర్లు కరిగిపోతున్నాయి. అమెరికా-చైనా దేశాల మధ్య ట్రేడ్‌వార్‌ మరోసారి మొదలవడంతో ప్రపంచవ్యాప్తంగా మెటల్ ఉత్పత్తి తగ్గుతుందనే ఆందోళనలు వెల్లువెత్తాయి. ఫలితంగా నేడు అటు అంతర్జాతీయ మార్కెట్లోనూ, ఇటు దేశీయ మార్కెట్లో మెటల్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 3శాతానికి పైగా నష్టపోయింది. మధ్యాహ్నాం గం.1:45ని.లకు నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ గత ముగింపు ముగింపు(3,422)తో పోలిస్తే 3శాతం(100 పాయింట్లు) నష్టపాయి 3320 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఇదే సమయానికి నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌లోని కోల్‌ ఇండియా షేరు అత్యధికంగా 5శాతానికిపైగా నష్టపోయి నిఫ్టీ - 50 సూచీలో టాప్‌ లూజర్‌గా ట్రేడ్‌ అవుతోంది. దానితో పాటు వేదాంత, హిందాల్కో షేర్లు 4శాతం పతనమై నిఫ్టీ - 50 సూచీలోని టాప్‌ - 5 లూజర్లలో వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. వాటితో పాటు జిందాల్‌ స్టీల్‌, జేఎస్‌ఆర్‌స్టీల్‌, సెయిల్‌, హిందూస్థాన్‌ జింక్‌, నాల్కో షేర్లు 4 నుంచి మూడు శాతం పతనమయ్యాయి. వాటితో పాటు వెల్‌'స్పన్‌ కార్పోరేషన్‌, మెయిల్‌, టాటాస్టీల్‌, హిందూస్థాన్‌ కాపర్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు 2శాతం క్షీణించగా, ఎన్‌ఎండీసీ షేరు​1.50 శాతం నష్టపోయింది. అయితే ఏపిఎల్‌ అపోలో షేర్లు 3శాతం లాభాల్లో ట్రేడ్‌ అవుతుండం విశేషం.



You may be interested

ట్రేడ్‌వార్‌.. ఆర్ధిక సంక్షోభానికి సంకేతం!

Wednesday 11th July 2018

మార్క్‌మొబియస్‌  ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి యూఎస్‌ఏ- చైనా మధ్య వాణిజ్యయుద్ధం తొలిసూచనగా ప్రముఖ ఇన్వెస్టర్‌ మార్క్‌ మొబియస్‌ అభివర్ణించారు. ఈ ఏడాది ఆరంభం నుంచి ట్రేడ్‌వార్‌ భయాలతో వర్ధమాన దేశాల మార్కెట్లు దాదాపు 10 శాతం క్షీణించడం తెలిసిందే. అయితే ఇంతటితో ఈ ఏడాది బ్యాడ్‌ న్యూస్‌ ముగిసిపోలేదంటున్నారు మార్క్‌. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం అలముకుంటుందనేందుకు ఇవి సంకేతాలని హెచ్చరించారు. అతి త్వరలో మరో మందగమనం తప్పదని ఆయన అభిప్రాయపడ్డారు.

పంద్రాగస్టు లోపే మరో ఆల్‌టైమ్‌ హై???

Wednesday 11th July 2018

పరిస్థితులన్నీ సానుకూలంగా కనిపిస్తున్నాయి.. మార్కెట్‌ పండితుల అంచనా రెండు మూడునెలల పతనం, కన్సాలిడేషన్‌ అనంతరం సూచీలు మరోమారు సత్తా చాటుతున్నాయి. నిఫ్టీ 10900 పాయింట్ల పైకి, సెన్సెక్స్‌ 36వేల పాయింట్ల పైకి చేరాయి. బుల్స్‌ పట్టు డీస్ట్రీట్‌పై బిగుస్తోన్న సూచనలు స్పష్టమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ సూచీలు ఆగస్టు లోపే మరో ఆల్‌టైమ్‌ హైని తాకుతాయని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెల్లోనే ఈ ఫీట్‌ సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు.

Most from this category