STOCKS

News


మెటల్స్‌లో షార్ట్‌ కవరింగ్‌కు ఛాన్స్‌!!

Saturday 1st December 2018
Markets_main1543658795.png-22568

మెటల్‌ స్టాక్స్‌లో షార్ట్‌ కవరింగ్‌కు ఛాన్స్‌ ఉందని మోనార్క్‌ నెట్‌వర్క్‌ క్యాపిటల్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ అర్పన్‌ షా తెలిపారు. గత కొన్ని రోజులుగా వీటిల్లో అమ్మకాల ఒత్తిడి తీవ్రంగా ఉంటూ వస్తోందని పేర్కొన్నారు. లాంగ్‌ పొజిషన్లకు జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌ వంటి స్టాక్స్‌కు ప్రాధాన్యమివ్వొచ్చని పేర్కొన్నారు. అలాగే ఆయన 6-15 శాతం రాబడిని అందించే ఐదు స్టాక్స్‌ను సిఫార్సు చేశారు. అవేంటో చూద్దాం..

ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌
ఈ స్టాక్‌కు తన 50, 200 రోజుల మూవింగ్‌ యావరేజ్‌ వద్ద మద్దతు లభించింది. అక్కడి నుంచి బౌన్స్‌బ్యాక్‌ అయ్యింది. ప్రస్తుత స్థాయిల్లో కొంత కాలం కన్సాలిడేషన్‌ ఉండొచ్చు. అయితే తర్వాత స్టాక్‌ ధర రూ.600 స్థాయికి చేరొచ్చు. రూ.520 స్టాప్‌లాస్‌తో రూ.590 టార్గెట్‌ ప్రైస్‌ కోసం ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు. దాదాపు 8 శాతం రిటర్న్‌ అంచనా వేయవచ్చు.

కెనరా బ్యాంక్‌
ఈ స్టాక్‌ తన 200 రోజుల మూవింగ్‌ యావరేజ్‌్‌ను దాటేసింది. ఈ స్థాయికి పైనే స్థిరపడింది. స్టాక్‌ ధరలో అప్‌ట్రెండ్‌ ఉండొచ్చు. రూ.249 స్టాప్‌లాస్‌తో రూ.300 టార్గెట్‌ ప్రైస్‌ కోసం ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు. 14 శాతం రిటర్న్‌ అంచనా వేయవచ్చు.

టాటా స్టీల్‌
ఈ మెటల్‌ స్టాక్‌లో గత కొంత కాలంగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. అలాగే ఓవర్‌సోల్డ్‌ ప్రాంతంలో ట్రేడ్‌ అవుతోంది. ఇది రివర్స్‌ ట్రెండ్‌ను సూచిస్తోంది. రానున్న రోజుల్లో షార్ట్‌ కవరింగ్‌ ఉండొచ్చు. రూ.505 స్టాప్‌లాస్‌తో రూ.565 టార్గెట్‌ ప్రైస్‌ కోసం ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు. 6 శాతం రిటర్న్‌ అంచనా వేయవచ్చు.

ఎస్కార్ట్స్‌
ఈ స్టాక్‌ తన కన్సాలిడేషన్‌ జోన్‌ నుంచి బయటకు వచ్చేసింది. అప్‌సైడ్‌ ర్యాలీని ప్రారంభించింది. మోమెంటమ్‌ ఇండికేటర్లు కూడా సానుకూలముగా ఉన్నాయి. రూ.640 స్టాప్‌లాస్‌తో రూ.750 టార్గెట్‌ ప్రైస్‌ కోసం ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు. 7 శాతం రిటర్న్‌ అంచనా వేయవచ్చు.

డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌
గత కొన్ని రోజులుగా ఈ స్టాక్‌ రూ.2,450-రూ.2,650 శ్రేణిలో కన్సాలిడేట్‌ అవుతూ వస్తోంది. అయితే శుక్రవారం ఈ రేంజ్‌ను బ్రేక్‌ చేసింది. మోమెంటమ్‌ ఇండికేటర్లు పాజిటివ్‌గా ఉన్నాయి. రానున్న రోజుల్లో ఇది ఔట్‌పర్ఫార్మ్‌ చేయవచ్చు. రూ.2,550 స్టాప్‌లాస్‌తో రూ.2,850 టార్గెట్‌ ప్రైస్‌తో ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు. 7 శాతం రిటర్న్‌ అంచనా వేయవచ్చు. 



You may be interested

హెచ్‌డీఎఫ్‌సీ రూ.9,000 కోట్ల బాండ్ల విక్రయం

Saturday 1st December 2018

ముంబై: దేశీ అతి పెద్ద మార్జిగేజ్‌ లెండర్‌ హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్‌డీఎఫ్‌సీ) ఈ ఏడాదిలోనే అత్యంత అధిక మొత్తంలో బాండ్లను విక్రయించినట్లు వెల్లడైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బాండ్ల విక్రయం ద్వారా నిధుల సమీకరకు రాగా, ఇందుకు ఏకంగా మూడు రెట్లు అధిక స్పందన వచ్చిందని.. ఇందులో భాగంగా రూ.9,000 కోట్ల మేరకు విక్రయాలు జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నిజానికి రూ.13,000 కోట్లకు బిడ్లు రాగా,

నిఫ్టీ చార్టులో డోజీ..!

Saturday 1st December 2018

శుక్రవారం నిఫ్టీ 10,876.75 వద్ద ముగిసింది. 10,892 వద్ద ప్రారంభమైన నిఫ్టీ.. ఇంట్రాడేలో 10,922 పాయింట్ల గరిష్టస్థాయిని, 10,835 పాయింట్ల కనిష్టస్థాయిని తాకింది. వరుసగా 5వ రోజు లాభపడిన ఈ సూచీ.. డిసెంబర్‌ సిరీస్‌లో తొలిసారిగా 'డోజీ క్యాండిల్' నమోదుచేసిందని చార్ట్‌వ్యూ ఇండియా డాట్‌ ఇన్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రేడింగ్‌ అడ్వైజరీ చీఫ్‌ స్ట్రాటజిస్‌ మజర్‌ మహమద్‌ అన్నారు. 10,850 స్థాయిని నిలబెట్టుకున్న నిఫ్టీ.. డైలీ చార్టులో డోజీ

Most from this category