News


నష్టాల్లో మెటల్‌ షేర్లు

Wednesday 2nd January 2019
Markets_main1546405554.png-23355

అంతర్జాతీయంగా మెటల్‌ షేర్ల పతనంతో దేశీయ మార్కెట్లో ఈ రంగ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 2శాతం వరకు క్షీణించింది. చైనా ఉత్పాదక రంగం నెమ్మదించడంతో అంతర్జాతీయ మార్కెట్లో మెటల్ షేర్లు నష్టాల బాట పట్టాయి. మరోవైపు ప్రముఖ రేటింగ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ జేఎస్‌డబ్లూ‍్య స్టీల్‌,  టాటా స్టీల్‌ షేర్ల ధరలకు రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేయడంతో జేఎస్‌డబ్లూ‍్య స్టీల్‌, జిందాల్‌ స్టీల్‌, టాటాస్టీల్‌, సెయిల్‌ కంపెనీలకు చెందిన షేర్లు 4నుంచి 2శాతం నష్టపోయాయి. ఉదయం గం.10:15ని.లకు నిఫ్టీ ఇండెక్స్‌ 2.04శాతం నష్టంతో 3,071.25 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో అత్యధికంగా జిందాల్‌ స్టీల్‌ 4శాతం నష్టపోయింది. అలాగే జేఎస్‌డబ్ల్యూ స్టీ్‌ల్‌, హిందాల్కో, వేదాంత, టాటాస్టీల్‌ 3నుంచి 2శాతం క్షీణించాయి. జేఎస్‌ఎల్‌ హిస్సార్‌, సెయిల్‌, హిందూస్థాన్‌ కాపర్‌, నాల్కో, 1.50శాతం పతనమయ్యాయి. ఏపిల్‌ అపోలో, వెల్‌స్పాన్‌ కార్పోరేషన్‌ షేర్లు 1శాతం పడిపోయాయి. మెయిల్‌, హిందూస్థాన్‌ జింక్‌, కోల్‌ ఇండియా షేర్లు అరశాతం నష్టపోయాయి. మరోవైపు జనవరి 08వ తారీఖున జరిగే బోర్డు షేర్ల బైబ్యాక్‌ అంశాన్ని చర్చిస్తామని ఎన్‌ఎండీసీ ఎక్చే‍్సంజ్‌లకు సమాచారం ఇవ్వడంతో ఈ కంపెనీ షేరు ఇంట్రాడేలో 3శాతం లాభపడింది. ఇదే సమయానికి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ-50 సూచీలో టాప్‌-5 లూజర్లలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హిందాల్కో, వేదాంత షేర్లు (3-2.50శాతం నష్టం) చోటు దక్కించుకున్నాయి.



You may be interested

కొత్త సీరిస్‌లో ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ భారీగా మారిన షేర్లివే!

Wednesday 2nd January 2019

మూడో త్రైమాసిక ఫలితాల సీజన్‌తో జనవరి నెల హడావుడిగా ఉండబోతోంది. జనవరి సీరిస్‌లో అధిక ఓపెన్‌ ఇంట్రెస్ట్‌(ఓఐ) నమోదు చేసిన ఐదు స్టాకులపై బ్రోకరేజ్‌ల విశ్లేషణలు ఇలా ఉన్నాయి.. 1. సీమెన్స్‌: జనవరి సీరిస్‌లో ఓఐ 15.4 శాతం, ధర 3 శాతం పెరిగాయి. కన్సాలిడేషన్‌ తర్వాత పాజిటివ్‌ బ్రేకవుట్‌ సాధించినట్లు చార్టులు చెబుతున్నాయి. స్టాకు రూ. 1045కు పైన కొనసాగినంత కాలం పాజిటివ్‌గా భావించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మోతీలాల్‌ ఓస్వాల్‌

లాభాల్లో పసిడి

Wednesday 2nd January 2019

ఆసియా మార్కెట్ల నష్టాల ట్రేడింగ్‌ పసిడి ధరకు కలిసొస్తుంది. ఈ ఏడాదిలో పసిడికి తొలి ట్రేడింగ్ రోజైన బుధవారం ఆసియా ట్రేడింగ్లో ఉదయం సెషన్లో 4డాలర్లు లాభపడింది. అమెరికా ఫ్యూచర్లు నష్టాల ట్రేడింగ్‌ సైతం పసిడి ర్యాలీకి సహకరిస్తుంది. ఉదయం 9:45ని.లకు ఔన్స్ పసిడి ధర 3.55 డాలర్లు లాభపడి 1,284.85 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.  ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమనంతో చైనా ఉత్పాదక రంగం 2107 మే

Most from this category