STOCKS

News


మెటల్‌ షేర్ల పతనం

Tuesday 20th November 2018
Markets_main1542698292.png-22223

మార్కెట్‌ పతనంలో భాగంగా మంగళవారం మెటల్‌ షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ప్రపంచట్రెండ్‌కు అనుగుణంగా దేశీయ మెటల్‌ షేర్ల ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపింది. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ నేటి ట్రేడింగ్‌లో అత్యధికంగా 2శాతం నష్టపోయింది.  మధ్యాహ్నం గం.12:00లకు ఇండెక్స్‌ గతముగింపు(3,395.35)తో పోలిస్తే 2శాతం నష్టంతో రూ.3,329.45ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి సూచీలో భాగమైన మొత్తం 15 షేర్లలో 11 షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండగా, 4షేర్లు మాత్రం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఈ సూచీలో అత్యధికంగా హిందాల్కో 4.50శాతం నష్టపోయింది. జిందాల్‌ స్టీల్‌, నాల్కో 3శాతం క్షీణించాయి. టాటాస్టీల్‌ 2.50శాతం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, సెయిల్‌, ఏపిల్‌ అపోలో జిందాల్‌ హిస్సార్‌ షేర్లు 2శాతం పతనమయ్యాయి. అలాగే వేదాంత, మెయిల్‌ 1శాతం, హిందూస్థాన్‌ జింక్‌ అరశాతం నష్టపోయాయి. మరోవైపు ఇదే సూచీలోని వెల్‌స్పాన్‌కార్ప్‌, హిందూస్థాన్‌ కాపర్‌ షేర్లు 2శాతం లాభపడ్డాయి. కోల్‌ ఇండియా, ఎన్‌ఎండీసీ షేర్లు అరశాతం లాభపడ్డాయి. హిందాల్కో షేరు 4.50శాతం నిఫ్టీ - 50 సూచీలో టాప్‌-5 లూజర్లలో  రెండోస్థానంలో ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

క్యాపిటల్‌ నిబంధనల సడలింపుతో బ్యాంకులకు చేటు!!

Tuesday 20th November 2018

రిజర్వు బ్యాంక్‌ తాజాగా బ్యాంకులకు బాసెల్‌-3 నిబంధనలను అమలు చేసేందుకు, అవసరమైన మూలధనాన్ని సమకూర్చుకునేందుకు మరింత సమయం ఇవ్వడమనే నిర్ణయం ‍ప్రభుత్వ బ్యాంకులకు క్రెడిట్‌ నెగటివ్‌ చర్య అని మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ పేర్కొంది. ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న పలు వివాదాల పరిష్కారం కోసం సోమవారం ఇరు వర్గాల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ మీటింగ్‌ అనంతరం.. ఇండియన్‌ బ్యాంకులకు బాసెల్‌-3 నిబంధనల అమలుకు అవసరమైన నిధుల సమీకరణ

10 లార్జ్‌క్యాప్‌ సిఫార్సులు.. 40% వరకు రాబడి..!

Tuesday 20th November 2018

ముంబై: ఆగస్టులో నమోదైన జీవితకాల గరిష్టస్థాయి నుంచి చూస్తే.. సూచీలు ఇప్పటికీ 9 శాతం నష్టాల్లో ఉన్నాయి. తాజా కరెక్షన్‌లో అనేక నాణ్యమైన షేర్లు 52-వారాల గరిష్టస్థాయి దిగువకు పడిపోయాయి. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ తరహా షేర్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆకర్షణీయ లాభాలను పొందవచ్చని మోతిలాల్ ఓస్వాల్ సూచిస్తోంది. నాణ్యమైన షేర్ల జాబితాలోని 10 లార్జ్‌క్యాప్‌ షేర్లు 52-వారాల గరిష్టస్థాయి నుంచి 27 శాతం పడిపోగా.. వీటిలో

Most from this category