STOCKS

News


మెటల్‌ షేర్ల వెలుగులు

Wednesday 10th October 2018
Markets_main1539152140.png-21011

9శాతం లాభపడి నాల్కో షేరు
మెటల్‌ షేర్లు ర్యాలీ రెండోరోజూ కొనసాగుతోంది. క్రితం ట్రేడింగ్‌లో 1.50శాతం నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ బుధవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 2.25శాతం లాభపడింది. ఉదయం గం.11:15నిల.కు నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ గతముగింపు(3,373.75)తో పోలిస్తే 1.75శాతం పెరిగి 3,433.25 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి  ఈ సూచీలో భాగమైన 15 షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. సూచీలో అత్యధికంగా నాల్కో 9శాతం లాభపడింది. జేఎస్‌ఎల్‌ హిస్సాఆర్‌ స్టీల్‌ 7శాతం పెరిగింది. హిందూస్థా్‌న్‌ కాపర్‌, మెయిల్‌, వెల్‌స్పాన్‌ కార్పోరేషన్‌ 4శాతం ర్యాలీచేశాయి. వేదాంత, జిందాల్‌స్టీల్‌, సెయిల్‌, ఎన్‌ఎండీసీ షేర్లు 3శాతం లాభపడ్డాయి. టాటాస్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 1శాతం ర్యాలీ చేయగా, కోల్‌ ఇండియా, హిందూస్థాన్‌ జింక్‌, ఏపిల్‌ అపోలో, హిందాల్కో షేర్లు అరశాతం లాభపడ్డాయి.
నాల్కో షేరుకు బైబ్యాక్‌ ఆఫర్‌ బూస్టింగ్‌:-
 బైబ్యాక్‌ ఆఫర్‌ వార్తలు వెలుగులోకి రావడంతో నాల్కో షేరు ఎన్‌ఎస్‌ఈలో బుధవారం ట్రేడింగ్‌లో ప్రారంభంలోనే 9శాతానికి పైగా ర్యాలీ చేసింది. నేడు ఎన్‌ఎస్‌ఈలో నాల్కో షేరు రూ.61.20ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. బై బ్యాక్‌ ఆఫర్‌పై చర్చించేందకు కంపెనీ బోర్డు సభ్యులు అక్టోబర్‌ 12న సమావేశం అవుతారనే వార్తలు ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చాయి. ఫలితంగా షేరుకు కొనుగోళ్ల మద్దతు పెరగడంతో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 9శాతం ర్యాలీ చేసి రూ.66.85 ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఉదయం గం.11:15నిల.కు నాల్కో షేరు గతముగింపు(రూ.61.20)తో పోలిస్తే 8.50శాతం లాభంతో రూ.66.80ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.56.55లు, రూ.97.60లుగా నమోదయ్యాయి.



You may be interested

10400 పాయింట్లకు అటు ఇటుగా నిరోధం?!

Wednesday 10th October 2018

నిఫ్టీపై గిన్నిస్‌ సెక్యూరిటీస్‌ అంచనా దేశీయ మార్కెట్లు బుధవారం రిలీఫ్‌ ర్యాలీ చూపుతున్నాయి. మంగళవారం పాజిటివ్‌ జోరును కొనసాగించలేక సూచీలు నెగిటివ్‌గా క్లోజయ్యాయి. బుధవారం ఆరంభం నుంచే సూచీలు లాభాల్లో కొనసాగడం ఆరంభించాయి. సాంకేతికంగా చూస్తే నిఫ్టీకి 10400 పాయింట్ల వద్ద  తక్షణ నిరోధం ఎదురుకావచ్చు. ఒక వేళ ఈ స్థాయిని దాటితే 10550 పాయింట్ల వద్ద మరో గట్టి నిరోధం ఎదురుకానుంది. ఈ స్థాయిని కూడా దాటి బలంగా క్లోజయితే

రిలీఫ్‌ ర్యాలీ..

Wednesday 10th October 2018

♦ భారీ లాభాల్లో బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు ♦ 10,400పైకి నిఫ్టీ ♦ సెన్సెక్స్‌ 400 పాయింట్లు అప్‌ ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ రిలీఫ్‌ ర్యాలీ చేస్తోంది. మార్నింగ్‌ లాభాలతో ప్రారంభమైన ఇండెక్స్‌లు అదే జోరు కొనసాగిస్తున్నాయి. సెన్సెక్స్‌ 400 పాయింట్లకు పైగా లాభాల్లో ఉంది. నిఫ్టీ 130 పాయింట్లకు పైగా పెరిగింది. ఉదయం 11:19 సమయంలో సెన్సెక్స్‌ 398 పాయింట్ల లాభంతో 34,697 వద్ద, నిఫ్టీ 133 పాయింట్ల లాభంతో 10,434 వద్ద ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 10,400 మార్క్‌పైకి

Most from this category