STOCKS

News


మెటల్‌ షేర్ల మెరుపులు

Thursday 15th November 2018
Markets_main1542273768.png-22051

మిడ్‌సెషన్‌ నుంచి పెరిగిన కొనుగోళ్లతో మార్కెట్‌లో మెటల్‌ షేర్లు మెరుస్తున్నాయి. ఎన్‌ఎన్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతనిథ్యం వహిస్తున్న నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ ఇంట్రాడేలో 1.50శాతం ర్యాలీ చేసింది. మధ్యాహ్నం గం.2:30ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(3382.15)తో పోలిస్తే దాదాపు 1.25శాతం లాభంతో 3,424.55 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి సూచీలో భాగమైన మొత్తం 15 షేర్లలో 11 షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా, 4 షేర్లు మాత్రం నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. అత్యధికంగా జిందాల్‌ స్టీల్‌ 4శాతం లాభపడింది. వెల్‌స్పాన్‌కార్ప్‌ 3శాతం, వేదాంత, హిందాల్కో 2శాతం ర్యాలీ చేశాయి. మొయిల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హిందూస్థాన్‌ జింక్‌, సెయిల్‌, టాటా స్టీల్‌ షేర్లు 1శాతం పెరిగాయి. నాల్కో, ఏపిల్‌అపోలో అరశాతం లాభపడ్డాయి. మరోవైపు హిందూస్థాన్‌ కాపర్‌ 2శాతం నష్టపోయింది. అదేబాటలో జేఎస్‌డబ్ల్యూ హిస్సార్‌ ఒకశాతం, కోల్‌ ఇండియా, ఎన్‌ఎండీసీ షేర్లు అరశాతం చొప్పున నష్టపోయాయి.



You may be interested

వచ్చే ఏడాది మార్కెట్‌ మెరుగు!!

Thursday 15th November 2018

వచ్చే ఆర్థిక సంవత్సరం బాగుంటుందంటున్నారు సీఎల్‌ఎస్‌ఏ ఇండియా స్ట్రాటజిస్ట్‌ మహేశ్‌ నండూర్కర్‌. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలోకి వెళ్లే కొద్ది లిక్విడిటీ సమస్య ప్రభావాలు కనిపిస్తాయని, నిధుల సమీకరణ వ్యయం పెరుగుతుందని పేర్కొన్నారు. ఆయన ఒక ఆం‍గ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు. ఇండియన్‌ మార్కెట్లపై కొంత కాలం జాగ్రత్తతో ఉండాలని హెచ్చరించారు. గత కొన్ని నెలలుగా పలు సవాళ్ల కారణంగా మార్కెట్లు కరెక‌్షన్‌కు గురవుతూ

బ్రోకరేజ్‌లు మెచ్చిన 5 షేర్లు

Thursday 15th November 2018

విదేశీ ఇన్వెస్టర్లు గత త్రైమాసికంలో అధిక శాతంలో షేర్లను విక్రయించినప్పటికీ.. పలు షేర్లలో మాత్రం హోల్డింగ్స్‌ పెంచారు. పెరిగిన వీరి వాటాల ఆధారంగా 47 శాతం వరకు రాబడిని ఇవ్వగలిగిన 5 షేర్లను బ్రోకరేజ్‌ సంస్థలు సూచిస్తున్నాయి.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2(జూలై-సెప్టెంబర్‌)కాలంలో విదేశీ ఇన్వెస్టర్లు నికర అమ్మకందారులుగా నిలిచారు. అంతకుముందు వరుసగా రెండు నెలల్లోనూ పాజిటీవ్‌గా కొనసాగిన వీరి నిధుల ప్రవాహం.. అమెరికా-చైనా మధ్య కొనసాగిన వాణిజ్య యుద్ధం, ముడిచమురు

Most from this category