STOCKS

News


‍కళ తప్పిన మెటల్‌ షేర్లు

Tuesday 22nd January 2019
Markets_main1548139787.png-23727

మార్కెట్‌ పతనంతో భాగంగా మెటల్‌ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మెటల్‌ షేర్ల క్షీణత దేశీయ మెటల్‌ షేర్ల ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపింది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ మంగళవారం ట్రేడింగ్‌లో 2.50శాతానికిపైగా నష్టపోయింది. ఉదయం గం.11:45ని.లకు ఇండెక్స్‌ గతముగింపు(2,945.80) ధరతో పోలిస్తే 2.50శాతం క్షీణతో 2,868.75 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇండెక్స్‌లో అత్యధికంగా జిందాల్‌ స్టీల్‌ 5.50శాతం క్షీణించింది. అలాగే సెయిల్‌ 4శాతం, వేదాంత 3.50శాతం, హిందూస్థాన్‌ జింక్‌, టాటాస్టీల్‌, జేఎస్‌డబ్లూ‍్య స్టీల్‌, హిందాల్కో షేర్లు 3శాతం పతనమయ్యాయి. జేఎస్‌ఎల్‌హిస్సార్‌, హిందూస్థాన్‌ కాపర్‌, ఏపిల్‌ అపోలో షేర్లు అదేబాటలో 2.50శాతం నష్టపోయాయి. నాల్కో, కోల్‌ ఇండియా, ఎన్‌ఎండీసీ, మెయిల్‌, వెల్‌స్పాన్‌కార్పోరేషన్‌ షేర్లు 1శాతం క్షీణించాయి.You may be interested

సాంక్టమ్‌ వెల్త్‌ స్వల్పకాల సిఫార్సులు

Tuesday 22nd January 2019

రాబోయే నెల రోజుల్లో దాదాపు 15 శాతం వరకు రాబడినిచ్చే ఐదు స్టాకులను సాంక్టమ్‌ వెల్త్‌ రికమండ్‌ చేస్తోంది. 1. యునైటెడ్‌ బ్రూవరీస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1700. స్టాప్‌లాస్‌ రూ. 1410. గత సెప్టెంబర్‌లో గరిష్ఠాలను తాకి తిరిగి అక్టోబర్‌ నాటికి రూ. 1100 స్థాయికి పతనమైంది. అప్పటినుంచి తిరిగి క్రమానుగత రికవరీ చూపుతోంది. సోమవారం తాజా బ్రేకవుట్‌ సాధించింది జీవితకాల గరిష్ఠాన్ని చేరింది. బోలింగర్‌ బ్యాండ్‌ సహా ఇండికేటర్లు

మధ్యంతర బడ్జెట్లో ఏం ఆశించొచ్చు?

Tuesday 22nd January 2019

వచ్చే నెల 1న ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సాధారణంగా ఇలాంటి మధ్యంతర బడ్జెట్లో పెద్దపెద్ద నిర్ణయాలుండవు. కానీ ఈదఫా పాత సాంప్రదాయాన్ని బద్దలుకొడతామని, మధ్యంతర బడ్జెట్లో పెద్ద నిర్ణయాలనే ప్రకటిస్తామని జైట్లీ చెప్పారు. ఈ నేపథ్యంలో కొత్త బడ్జెట్లో మార్కెట్‌ ఏం ఆశిస్తుందన్న విషయమై బ్రోకరేజ్‌ల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి... -  ఐడీబీఐ క్యాపిటల్‌: ట్రేడింగ్‌పై ఎస్‌టీటీ ఎత్తివేయడం లేదా కార్పొరేట్‌ టాక్స్‌ తగ్గింపు,

Most from this category