News


మార్కెట్‌కు అండగా మెటల్‌ షేర్లు

Thursday 1st November 2018
Markets_main1541065729.png-21639

మార్కెట్‌ మిడ్‌సెషన్‌ అనంతంరం స్తబ్దుగా ట్రేడ్‌ అవుతోంది. మెటల్‌ షేర్ల ర్యాలీ మార్కెట్‌ పతనాన్ని అడ్డుకుంటుంది. నేటి ఇంట్రాడేలో ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ ఇండెక్స్‌ 2.50శాతం ర్యాలీ చేసి 3,351.65 గరిష్టాన్ని నమోదు చేసింది. మధ్యహ్నం గం.2:45ని.లకు 2శాతం లాభంతో 3,341.95 ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి మెటల్‌ సూచీలో భాగమైన మొత్తం 13 షేర్లలో 11 షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా 2 షేర్లు మాత్రం నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. హిందాల్కో, వెల్‌స్పాన్‌ కార్పోరేషన్‌, ఎన్‌ఎండీసీ షేర్లు అత్యధికంగా ​5శాతం లాభపడ్డాయి. సెయిల్‌ 4శాతం, హిందూస్థాన్‌ కాపర్‌, జిందాల్‌స్టీల్‌, నాల్కో షేర్లు 2శాతం, జేఎస్‌ఎల్‌హిస్సార్‌ స్టీల్‌, వేదాంత, జేఎస్‌డబ్ల్యూ షేర్లు 1శాతం చొప్పున ర్యాలీ చేశాయి. టాటా స్టీల్‌, హిందూస్థాన్‌ జింక్‌, ఏపిఎల్‌ అపోలో షేర్లు అరశాతం లాభపడ్డాయి. మరోవైపు కోల్‌ ఇండియా 2.50శాతం, మెయిల్‌ 2శాతం నష్టపోయాయి. హిందాల్కో షేరు 5శాతం లాభపడి నిఫ్టీ-50 సూచీలోని టాప్‌-5 గెయినర్లలో రెండో స్థానంలో ట్రేడ్‌ అవుతోంది.You may be interested

స్వల్ప నష్టంతో ముగింపు

Thursday 1st November 2018

10400 దిగువకు నిఫ్టీ ఫ్లాట్‌గా ముగిసిన సెన్సెక్స్‌ సూచీలు ప్రారంభ లాభాలను నిలుపులేకపోవడంతో మార్కెట్‌ గురువారం స్వల్ప నష్టంతో ముగిసింది. సెన్సెక్స్‌ 10 పాయింట్లు కోల్పోయి 34,432 వద్ద, నిఫ్టీ 6 పాయింట్ల నష్టపోయి10,380 వద్ద ముగిశాయి. ఎన్‌ఎస్‌లోని మరో కీలకమైన సూచీ నిఫ్టీ బ్యాంక్‌ 155పాయింట్లు పెరిగి 25,323.6 వద్ద ముగిసింది.  మెటల్‌, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ షేర్లు ర్యాలీ చేయగా, ఐటీ, ఫార్మా, ఎఫ్‌ఎంజీసీ, అటో రంగాలకు చెందిన సూచీలు

ఈ 25 షేర్లు.. తారాజువ్వలు..!

Thursday 1st November 2018

- పండుగ సీజన్‌లో పలు బ్రోకింగ్‌ సంస్థ సిఫార్సులు దీపావళి పండుగ సందర్భంగా కస్టమర్లను ఆకట్టుకోవడానికి పలు వర్తకులు బంపర్‌ ఆఫర్లను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఆఫర్ల వర్షం ఆన్‌లైన్‌ అంగళ్లు, రిటైల్‌ షోరూంలోనే కాదు.. దలాల్‌ స్ట్రీట్‌లోనూ కురుస్తోందని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ అరుణ్ తుక్రాల్ వ్యాఖ్యానించారు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టీవ్ ధమాకా డేస్ మాదిరిగా స్టాక్‌ మార్కెట్‌లో

Most from this category