News


లాభాల్లో లోహ షేర్లు

Tuesday 16th October 2018
Markets_main1539672419.png-21198

ముంబై:- గత రోజు నష్టాలతో ముగిసిన లోహ షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో లాభాల బాట పట్టాయి. ఎన్‌ఎస్‌ఈలో లోహ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ లోహ సూచీ ఇంట్రాడేలో 1.50శాతం లాభపడి 3,474.35 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఉదయం గం.11:30ని.లకు నిఫ్టీ లోహ సూచీ 1శాతం లాభంతో 3440 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈ సూచీలో హిందాల్కో(అర శాతం నష్టం) షేరు తప్ప మిగతా అన్ని షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.  అత్యధికంగా ఏపిల్‌అపోలో 7శాతం లాభపడింది. వెల్‌స్పన్‌ కార్పోరేషన్‌, టాటాస్టీల్‌, హిందూస్థాన్‌ కాపర్‌ షేర్లు 2శాతం పెరిగాయి. అలాగే నాల్కో, హిందూస్థాన్‌ జింక్‌, వేదాంత, మెయిల్‌, జిందాల్‌ స్టీల్‌, జేఎస్‌ఎల్‌హిస్సార్‌ షేర్లు 1శాతం ర్యాలీ చేశాయి. వాటితో పాటు ఈ ఇండెక్స్‌లో భాగమైన కోల్‌ ఇండియా, సెయిల్‌, ఎన్‌ఎండీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు అరశాతం లాభపడ్డాయి. 



You may be interested

ఈ మూడు రంగాల స్టాక్స్‌తో జాగ్రత్త!

Tuesday 16th October 2018

దేశీ వ్యాపారాలపై దృష్టి కేంద్రీకరించిన కంపెనీల స్టాక్స్‌, వినియోగ ఆధారిత స్టాక్స్‌, రిటైల్‌ లెండింగ్‌కు ప్రాధాన్యమిస్తున్న ఫైనాన్షియల్‌ సంస్థల స్టాక్స్‌తో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు నిర్మల్‌ బ్యాంగ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ గిరీశ్‌ పాయ్‌. వీటిల్లో వ్యాల్యుయేషన్స్‌ ఎక్కువగా ఉన్నాయన్నారు. రానున్న రోజుల్లో వీటిపై ఒత్తిడి పెరగొచ్చని అంచనా వేశారు. ప్రస్తుత మార్కెట్‌ కరెక‌్షన్‌లో ఆటో స్టాక్స్‌కు దూరంగా ఉండటం మంచిదని సూచించారు. మారుతీ సుజుకీ ఎర్నింగ్స్‌ వృద్ధి

రూపీ@ 100 తప్పదు!

Tuesday 16th October 2018

ప్రముఖ ఇన్వెస్టర్‌ మార్క్‌ ఫాబెర్‌ అంచనా రాబోయే కాలంలో డాలర్‌తో రూపాయి మారకం విలువ 100ను చేరడం తధ్యమని స్విస్‌ ఇన్వెస్టర్‌ మార్క్‌ ఫాబెర్‌ అంచాన వేశారు. ప్రస్తుతానికి రూపీ ఓవర్‌  సోల్డ్‌ జోన్‌లో ఉన్నందున కొంత రికవరీ ఉండొచ్చని, కానీ దీర్ఘకాలంలో మాత్రం దిగజారడు తప్పదని చెప్పారు.  ఈ ఏడాది చివరకు నిఫ్టీ 30000 పాయింట్ల దిగువకు రావచ్చని ఆయన అంచనా వేశారు. స్వల్పకాలానికి రూపీలో రికవరీ రావచ్చని త్వరలో

Most from this category