STOCKS

News


మెటల్‌ షేర్ల హవా..!

Wednesday 19th September 2018
Markets_main1537345692.png-20382

ఒడిదుడుకుల మార్కెట్‌ ట్రేడింగ్‌లో భాగంగా బుధవారం మిడ్‌ సెషన్‌ సమయానికి మెటల్‌ షేర్ల హవా సాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగుతున్న మెటల్‌ షేర్ల ర్యాలీలో భాగంగా నేటి ఇంట్రాడేలో మెటల్‌ షేర్లు ర్యాలీ చేస్తున్నాయి. మరోవైపు రూపాయి పతనాన్ని నివారించే చర్చల్లో భాగంగా స్టీల్‌ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను పెంచాలని కేంద్ర స్టీల్‌ మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ప్రస్తుతం 5 శాతం నుంచి 12.5 శాతంగా ఉన్న  స్టీల్‌ ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పెంచాలని కేంద్రం యోచిస్తోంది. ఈ కారణాల నేపథ్యంలో ఇంట్రాడేలో మెటల్‌ కంపెనీల షేర్లు ర్యాలీ చేస్తున్నాయి. ఎన్ఎస్‌ఈలోని అన్ని సూచీల్లోకి నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ అత్యధికంగా 2శాతం వరకు లాభపడింది. ఈ సూచీలో మొత్తం 15 షేర్లకు గానూ 11 షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా 4 షేర్లు మాత్రమే నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా 3.50శాతం లాభపడిన కోల్‌ఇండియా షేరు నిఫ్టీ-50 సూచీలోని టాప్‌-5 గెయినర్లలో చోటుదక్కించుకుంది. ఇదే సూచీలోని జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, సెయిల్‌, టాటాస్టీల్‌ షేర్లు 2శాతం పెరిగాయి. వాటితో పాటు​జేఎస్‌ఎల్‌ హిస్సార్‌, నాల్కో, జిందాల్ స్టీల్‌ షేరు ఒక శాతం లాభపడగా, హిందాల్కో, హిందూస్థాన్‌ కాపర్‌, హిందూస్థాన్‌ జింక్‌, ఏపిల్‌ అపోలో షేర్లు అరశాతం లాభపడ్డాయి. మరోవైపు మెయిల్‌, ఎన్‌ఎండీసీ, వెల్‌స్పాన్‌ కార్పోరేషన్‌, వేదాంత షేర్లు అరశాతం వరకు నష్టపోయాయి.



You may be interested

నిఫ్టీ ఏడాది టార్గెట్‌ 12,000!

Wednesday 19th September 2018

మాక్క్వైరీ భారత సైక్లిక్‌ రికవరీ విస్తృతమవుతోందని ప్రముఖ బ్రోకింగ్‌ దిగ్గజం మాక్కై‍్వరీ అభిప్రాయపడింది. తాజాగా నిఫ్టీ ఏడాది టార్గెట్‌ను మాక్కై‍్వరీ 12,000 పాయింట్లకు పెంచింది. 2020 ఎర్నింగ్స్‌ అంచనాలకు ఈ టార్గెట్‌ 16.6 రెట్లు అధికం.  ఇన్‌ఫ్రాలో క్రమానుగత మార్పు కనిపిస్తోందని, రియల్టీ సంధికాలంలో ఉందని మాక్కై‍్వరీ తెలిపింది. ఎకానమీలో స్థూల ఆర్థిక సమస్యలు కాస్త పెరిగాయని, కానీ ఆందోళన చెందే స్థాయికి రిస్కుల్లేవని తెలిపింది. ట్రేడ్‌వార్‌, రూపీ క్షీణత, చమురు

20 నెలల తర్వాత 200 డీఎంఏ దిగువకు

Wednesday 19th September 2018

దిగజారిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేరు బుధవారం ట్రేడింగ్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తన 200 రోజుల డీఎంఏ స్థాయి దిగువకు వచ్చింది. గత 20 నెలల్లో బ్యాంకు షేరు బలమైన 200 రోజుల డీఎంఏ స్థాయి దిగువకు రావడం ఇదే తొలిసారి. ప్రస్తుతం బ్యాంకు షేరు దాదాపు ఒక శాతం నష్టంతో రూ. 1975 వద్ద కదలాడుతోంది. చార్టుల్లో ఎంఏసీడీ ఇండికేటర్‌ లైన్‌సైతం తన సిగ్నల్‌ లైన్‌కు దిగువన కదలాడుతోంది. దీన్ని బట్టి

Most from this category