STOCKS

News


నష్టాల్లో మెటల్‌ షేర్లు

Thursday 22nd November 2018
Markets_main1542875152.png-22309

 గురువారం మిడ్‌సెషన్‌ సమయానికి మెటల్‌ షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ సూచీలకు ప్రాతినిథ్యం వహిస్తున్న నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 2శాతం నష్టపోయింది. ముఖ్యంగా హిందాల్కో, నాల్కో, ఎంఎండీసీ, టాటాస్టీల్‌ షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవ్వడం సూచీ పతనానికి కారణమైంది. మధ్యాహ్నం గం.1:30ని.లకు ఇండెక్స్‌ గతముగింపు( 3,272.70)తో పోలిస్తే 1.60శాతం నష్టంతో 3,220.15 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి సూచీలో భాగమైన మొత్తం 15 షేర్లలో 13 షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అ‍త్యధికంగా హిందాల్కో షేరు 3శాతం నష్టపోయింది. ఎన్‌ఎండీసీ, నాల్కో హిందూస్థాన్‌ కాపర్‌, టాటాస్టీస్‌, సెయిల్‌ , జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు 2శాతం క్షీణించాయి. జేఎస్‌ఎల్‌హిస్సార్‌, కోల్‌ ఇండియా, హిందూస్థాన్‌ జింక్‌, వేదాంత షేర్లు 1శాతం పడిపోయాయి. ఏపిల్‌ అపోలో షేరు  అరశాతం నష్టపోయింది. మరోవైపు వెల్‌స్పన్‌ కార్పొరేషన్‌  2శాతం ర్యాలీచేయగా, మెయిల్‌ షేరు అరశాతం పెరిగింది. ఎన్‌ఎస్‌ఈలో ప్రధాన సూచీ నిఫ్టీ -50లో 3శాతం నష్టపోయిన హిందాల్కో షేరు టాప్‌-5 లూజర్లలో రెండోస్థానంలో ట్రేడ్‌ అవుతోంది.You may be interested

ర్యాలీకి ఇంకా సమయం ఉంది

Thursday 22nd November 2018

భారత ఈక్విటీ మార్కెట్‌లో కరెక్షన్‌ దాదాపుగా పూర్తయ్యింది. అయితే, సంపద సృష్టికి మాత్రం ఇంకా సమయం ఉందని వ్యాఖ్యానించిన వాల్యూక్వెస్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సీఐఓ రవి ధరామ్షీ  ముంబై: ముడిచమురు ధరలు భారీగా పతనంకావడం వల్ల ఈక్విటీ మార్కెట్‌లో నూతన ఉత్సాహం నెలకొన్నప్పటికీ, అంతర్జాతీయంగా నెలకొంటున్న ద్రవ్య లభ్యత సమస్య కారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాల స్టాక్‌ మార్కెట్లు వేగంగా పెరిగేందుకు ఇప్పట్లో అవకాశం లేదని రవి ధరామ్షీ అన్నారు. పలు సమయాల్లో

ఐడీఎఫ్‌సీ గ్రూప్‌ షేర్ల ర్యాలీ..

Thursday 22nd November 2018

7 శాతానికిపైగా అప్‌ ఐడీఎఫ్‌సీ గ్రూప్‌ షేర్లు గురువారం ర్యాలీ చేస్తున్నాయి. ఐడీఎఫ్‌సీ, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌, క్యాపిటల్‌ ఫస్ట్‌ షేర్లు నిఫ్టీ ఎఫ్‌అండ్‌వో సెక్యూరిటీస్‌ విభాగంలో టాప్‌ గెయినర్లుగా ఉన్నాయి. మధ్యాహ్నం 1:22 సమయంలో క్యాపిటల్‌ ఫస్ట్‌ షేరు 7.4 శాతం పెరుగుదలతో రూ.533 వద్ద, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ షేరు 7.01 శాతం వృద్ధితో రూ.39 వద్ద, ఐడీఎఫ్‌సీ షేరు 4.25 శాతం పెరుగుదలతో రూ.40 వద్ద ట్రేడవుతున్నాయి.  ఎందుకీ ర్యాలీ? ఐడీఎఫ్‌సీకి చెందిన బ్రోకరేజ్‌

Most from this category