STOCKS

News


నష్టాల్లో మెటల్‌ షేర్లు

Wednesday 24th April 2019
Markets_main1556090560.png-25316

స్వల్పలాభాల మార్కెట్‌ ట్రేడింగ్‌లో మెటల్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ అరశాతం నష్టపోయింది. ఇండెక్స్‌లోని జిందాల్‌ స్టీల్‌ అత్యధికంగా 2శాతం నష్టపోగా, వేదాంత, 1.50శాతం, ఏపిల్‌ అపోలో 1శాతం, నాల్కో, హిందాల్కో 0.75శాతం, టాటాస్టీల్‌, కోల్‌ ఇండియా షేర్లు అరశాతం క్షీణించాయి. హిందూస్థాన్‌ జింక్‌, మెయిల్‌, ఎన్‌ఎండీసీ షేర్లు పావుశాతం పతనమయ్యాయి. అలాగే సెయిల్‌ 3.50శాతం, వెల్‌స్పాన్‌ కార్పోరేషన్‌ 2.50శాతం, జేఎస్‌డబ్లూ‍్య స్టీల్, హిందూస్థాన్‌ కాపర్‌, జేఎస్‌ఎల్‌హిస్సార్‌ షేర్లు అరశాతం పెరిగాయి. ఇండెక్స్‌ మధ్యాహ్నం గం.12:30ని.లకు అరశాతం నష్టంతో 3,028.15 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

ఇక ఇదే సమయానికి బెంచ్‌ మార్క్‌ ఇండెక్స్‌లైన నిఫ్టీ 32 పాయింట్ల లాభంతో 11600 పాయింట్లపై 11,608 వద్ద, సెన్సెక్స్‌ 100 పాయింట్ల లాభంతో 38,665ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అటో, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌ రంగ షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండగా,  మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికం ఐటీ షేర్లు ర్యాలీ చేస్తున్నాయి.



You may be interested

ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ స్టాక్స్‌ జంప్‌

Wednesday 24th April 2019

అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ ధర ఆరునెలల గరిష్టస్థాయిలను రికవరీ కావడంతో బుధవారం ట్రేడింగ్‌లో పెట్రోరంగ షేర్లు ర్యాలీ చేస్తున్నాయి. బీఎస్‌ఈలో ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ కంపెనీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఎన్‌అండ్‌పీ బీఎస్‌ఈ అయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఇండెక్స్‌ 2శాతం లాభపడింది. ఇరాన్‌ నుంచి దిగుమతి అయ్యే ముడిచమురు మీద అగ్రరాజ్యమైన అమెరికా ఆంక్షలు విధించడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఆరునెలల గరిష్టానికి చేరుకున్న సంగతి తెలిసిందే.

4నెలల కనిష్టం వద్దే పసిడి ధర

Wednesday 24th April 2019

డాలర్‌ బలపడటం, ఈక్విటీ మార్కెట్ల ర్యాలీ కారణంగా ప్రపంచమార్కెట్లో పసిడి ధర బుధవారం 4నెలల కనిష్టం వద్దే స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 1డాలరు స్వల్పలాభంతో 1,271 డాలరు వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇటీవల అమెరికా విడుదల చేసిన గృహనిర్మాణ గణాంకాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించడంతో ఆ దేశంలో ఆర్థిక మందగమన ఆందోళనలు తగ్గుముఖం పట్టాయనే సూచిస్తుంది. పటిష్టమైన ఆర్థికగణాంకాల నమోదు కారణంగా

Most from this category