STOCKS

News


నష్టాల్లో మెటల్‌ షేర్లు

Thursday 9th May 2019
Markets_main1557391724.png-25639

ప్రపంచమార్కెట్‌ ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయ మార్కెట్లోనూ గురువారం మెటల్‌ భారీగా నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ నేడు దాదాపు 2శాతం క్షీణించింది. అమెరికా - చైనాల వాణిజ్య యుద్ధం మళ్లీ తెరపైకి వచ్చిన నేపధ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో మెటల్‌ షేర్లు భారీగా పతనమయ్యాయి. ఆ ప్రతికూల ప్రభావంతో నేటి ట్రేడింగ్‌లో మెటల్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. నిఫ్టీ మెటల్‌ ఇంండెక్స్‌లోని జిందాల్‌ స్టీల్‌ 4.50శాతం, కాపర్‌ ఇండియా 3శాతం, అపోలోఏపిల్‌ 2.50శాతం, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌ 2శాతం క్షీణించింది. సెయిల్‌, హిందాల్కో, హిందూస్థాన్‌ జింక్‌, వేదాంత షేర్లు 1.50శాతం పతనమయ్యాయి. అలాగే ఎన్‌ఎండీసీ , టాటాస్టీల్‌, మెయిల్‌ షేర్లు 1శాతం నష్టపోగా, జేఎస్‌ఎల్‌హిస్సార్‌, నాల్కో, హిందూస్థాన్‌ కాపర్‌ షేర్లు అరశాతం క్షీణించాయి. అయితే వెల్‌స్పాన్‌ కార్పోరేషన్‌ షేర్లు 1.50శాతం లాభపడ్డాయి. మధ్యాహ్నం గం.1:45ని.లకు షేరు గతముగింపు(2,959.50)తో పోలిస్తే 1.75శాతం నష్టపోయి 2,909.80 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. 
ఇదే సమయానికి బెంచ్‌ మార్క్‌ సూచీలైన నిఫ్టీ ఇండెక్స్‌ 90.85 పాయింట్లు నష్టంతో 11,265.50 వద్ద, సెన్సెక్స్‌ 307 పాయింట్లను కోల్పోయి 37,482.08 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

ఏడురోజూ నష్టాలే..!

Thursday 9th May 2019

అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు డాలర్‌ మారకంలో రూపాయి విలువ పతనంతో మార్కెట్‌ గురువారం నష్టాలతో ముగిసింది. ఎనర్జీ, ఇంధన, ఫార్మా, పవర్‌ రంగ షేర్ల పతనంతో సెన్సెక్స్‌ 230 పాయింట్లు నష్టపోయి 37,559 వద్ద, నిఫ్టీ 57.65 పాయింట్లు నష్టపోయి 11,301.80 వద్ద ముగిసింది. సూచీలు ఇది వరుసగా ఏడోరోజూ నష్టాల ముగింపు కావడం గమనార్హం. అమెరికా - చైనాల మధ్య వాణిజ్య వివాదం మరింత ముదరడంతో అటు

2నెలల కనిష్టానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

Thursday 9th May 2019

ప్రైవేట్‌ రంగ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు గురువారం ట్రేడింగ్‌లో 3శాతం నష్టపోయింది. ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేయడం షేరు పతనానికి కారణమైంది. రానున్న రెండేళ్ల కాలంలో రిలయన్స్‌ కంపెనీ ఆదాయాలు పరిమితం కావడంతో పాటు కీలకమైన ఇంధన వ్యాపారంలో ఎదురవనున్న సమస్యలు దృష్ట్యా షేరు రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసినట్లు బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. అలాగే కంపెనీకి పెరుగుతున్న రుణభారం, స్థూల రీఫైనరీ మార్జిన్లు

Most from this category