STOCKS

News


మెటల్‌ షేర్ల పతనం

Thursday 18th April 2019
Markets_main1555572239.png-25204

మార్కెట్‌ నష్టాల్లో భాగంగా గురువారం మెటల్‌ భారీగా నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ నేడు 2శాతం నష్టపోయింది. నేడు ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి మెటల్‌ షేర్లలో అమ్మకాలు జరిగాయి. ఫలితంగా జేఎస్‌డబ్లూ‍్య స్టీల్‌ 4శాతం, సెయిల్‌ 3.50శాతం, వేదాంత, హిందాల్కో 3శాతం, జేఎస్‌ఎల్‌ హిస్సార్‌ స్టీల్‌, నాల్కో షేర్లు 2.50శాతం నష్టపోయాయి. టాటాస్టీల్‌, హిందూస్థాన్‌ కాపర్‌, వెల్‌స్పాన్‌ కార్ప్‌ జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, మెయిల్‌ షేర్లు 1.50శాతం క్షీణించాయి.  మెయిల్‌ 1శాతం పతనమైంది. ఎన్‌ఎండీసీ, కోల్‌ ఇండియా, ఏపిల్‌ అపోలో, హిందూస్థాన్‌ జింక్‌ షేర్లు 1శాతం అరశాతం నష్టపోయాయి. మధ్యాహ్నం గం.12:30 ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(3,149.90    )తో పోలిస్తే 1.75శాతం నష్టపోయి 3,094.70 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 
ఇక ప్రధాన సూచీల విషయానికొస్తే... అధిక వెయిటేజీ కలిగిన ఇన్ఫోసిస్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, భారతీ ఎయిర్‌టెల్‌, ఎల్‌ అండ్‌ టీ షేర్ల పతనంతో మధ్యాహ్నం గం.12:30 ని.లకు సెన్సెక్స్‌ 85 పాయింట్ల పతనంతో 39,190.74 వద్ద, నిఫ్టీ 29 నష్టంతో 11,758 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.You may be interested

అరశాతం నష్టపోయిన బ్యాంక్‌ నిఫ్టీ

Thursday 18th April 2019

ప్రభుత్వరంగ షేర్ల పతనంతో గురువారం ఎన్‌ఎస్‌ఈలోని కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ గురువారం ట్రేడింగ్‌లో 0.75శాతానికి పైగా నష్టపోయింది. నేడు బ్యాంకు నిఫ్టీ 30,656.50 వద్ద ప్రారంభమైంది. యస్‌ బ్యాంక్‌ 3.5శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పంజాజ్‌ నేషనల్‌ బ్యాంక్‌ 3శాతం నష్టపోయాయి. ఇండస్‌ ఇండ్‌ 2శాతం, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ), ఇడీఎఫ్‌సీఫస్ట్‌ బ్యాంక్ 1.50శాతం క్షీణించాయి. ఫెడరల్‌ బ్యాంక్‌ 1శాతం పతనమైంది. వాటితో పాటు ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ

బ్యాంకులు, ఎఫ్‌ఎంసీజీలపై ఎఫ్‌ఐఐల మక్కువ

Thursday 18th April 2019

ఎన్నికల సీజన్‌ ఆరంభమవుతున్న తరుణంలో విదేశీ మదుపరులు దేశీ సూచీల్లో ఇబ్బడిముబ్బడిగా నిధులు కుమ్మరించారు. దీంతో నిఫ్టీ, సెన్సెక్స్‌లు ఆల్‌టైమ్‌ హైని తాకాయి. ఈ నేపథ్యంలో ఎఫ్‌ఐఐలు దేశీ మార్కెట్లో ఎక్కువగా బ్యాంకింగ్‌, కన్జూమర్‌ స్టాపిల్స్‌ రంగాలపై ఎక్కువ పెట్టుబడులు పెట్టినట్లు ఎన్‌ఎస్‌డీఎల్‌ డేటా చెబుతోంది. ఎఫ్‌ఐఐల మొత్తం పెట్టుబడుల్లో 32 శాతం ఈ రెండు రంగాల్లోకి మరలినట్లు తెలిపింది. ఆర్థిక సేవల కంపెనీలను కూడా కలుపుకుంటే ఈ మొత్తం

Most from this category