News


మెటల్‌ షేర్లలో అమ్మకాలు

Thursday 7th March 2019
news_main1551947186.png-24471

స్తబ్దుగా సాగుతున్న మార్కెట్‌ ట్రేడింగ్‌లో భాగంగా మెటల్‌ షేర్లు నష్టాల బాట పట్టాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ గురువారం ఇంట్రాడేలో ట్రేడింగ్‌లో 1.50శాతం నష్టపోయింది. మధ్యాహ్నం గం.1:00లకు ఇండెక్స్‌ గత ముగింపు(3021.30)తో పోలిస్తే అరశాతానికి పైగా నష్టంతో 3,000.80 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అత్యధికంగా కోల్‌ ఇండియా, హిందూస్థాన్‌ కాపర్‌ షేర్లు 2శాతం నష్టపోయాయి. అలాగే జేఎస్‌ఎల్‌హిస్సార్‌, వేదాంత, నాల్కో షేర్లు 1.50శాతం పతనమయ్యాయి. అలాగే సెయిల్‌, మెయిల్‌, హిందాల్కో షేర్లు అరశాతం క్షీణించాయి. మరోవైపు వెల్‌స్పాన్‌ కార్పోరేషన్‌ 1.50శాతం లాభపడింది. అలాగే జిందాల్‌ స్టీల్‌, ఎన్‌ఎండీసీ, షేర్లు 1శాతం లాభపడగా, ఏపిల్‌ అపోలో, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, టాటాస్టీల్‌, హిందూస్తాన్‌ జింక్‌ షేర్లు అరశాతం లాభపడ్డాయి. ఇదే సమయానికి కోల్‌ ఇండియా 2శాతం పతనంతో ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ - 50 సూచిలోని టాప్‌-5 లూజర్లలో మూడోస్థానాన్ని దక్కించుకుంది.  అలాగే నిఫ్టీ ఇండెక్స్‌ 10 పాయింట్లు నష్టపోయి 11,050 స్థాయి దిగువకు 10493 వద్ద, సెన్సెక్స్‌ సెన్సెక్స్‌ 20 పాయింట్ల స్వల్ప లాభంతో 36,656 వద్ద ట్రేడ్‌ అవుతోంది. You may be interested

ఆగని ర్యాలీ...70 స్థాయికి రూపాయి

Thursday 7th March 2019

డాలర్‌ మారకంలో రూపాయి ర్యాలీ కొనసాగుతూనే ఉంది. ఫారెక్స్‌ మార్కెట్లో గురువారం ఇంట్రాడేలో మరో 33పైసలు బలపడింది. నేడు రూపాయి గత ముగింపు(70.27)తో పోలిస్తే 19 బలపడి 70.08 వద్ద ప్రారంభమైంది. అమెరికా క్రూడాయిల్‌ ఉత్పత్తి, నిల్వలు రికార్డు చేరుకోవడంతో అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరల క్షీణించడటం, ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ బలహీనత, దేశీయ మార్కెట్లో విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరగడంతో పాటు భారత్‌-పాక్‌ల మధ్య యుద్ధ

పీఎస్‌యూ బ్యాంకింగ్‌ షేర్ల జోరు

Thursday 7th March 2019

లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్న మార్కెట్లో ప్రభుత్వరంగ షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ గురువారం ట్రేడింగ్‌లో 1.50శాతం లాభపడింది. ఉదయం గం.11:45ని.లకు ఇండెక్స్‌ గత ముగింపుతో పోలిస్తే 1.25శాతం పెరిగి 2,940 వద్ద ట్రేడ్‌ అవుతోంది. పంజాజ్‌నేషనల్‌బ్యాంక్‌ 4.50శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 4శాతం, యూనియన్‌ బ్యాంక్‌ 3శాతం పెరిగాయి. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఓరియంటల్‌ బ్యాంక్‌, సిండికేట్‌ బ్యాంక్‌

Most from this category