STOCKS

News


మెటల్ షేర్ల ర్యాలీ

Monday 31st December 2018
Markets_main1546237821.png-23330

ఉక్కు షేర్ల ర్యాలీ అండతో సోమవారం ఉదయం సెషన్‌లో మెటల్ షేర్లు లాభాల బాట పట్టాయి. అమెరికా ప్రభుత్వం ఉక్కు దిగుమతులపై విధిస్తున్న భారీ సుంకాలను తగ్గించాలని భారత ప్రభుత్వం అమెరికా అధికారులను కోరినట్లు శుక్రవారం కేంద్ర ఉక్కు కార్యదర్శి బినోయ్ కుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఉక్కు దిగుమతులపై సుంకాలు తగ్గొచ్చనే అంచనాలు షేర్ల లాభాల ట్రేడింగ్‌కు కారణమయ్యాయి.  నేటి ట్రేడింగ్‌లో  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 1.50శాతం లాభపడింది.  ఉదయం గం.11:30లకు ఇండెక్స్‌ గత ముగింపు(3,089.00)తో పోలిస్తే 0.80శాతం లాభంతో 3,115శాతం వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి సూచీలోని మొత్తం 15షేర్లలో 12 షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా, 3 షేర్లు మాత్రం న‌ష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అ‍త్యధికంగా సెయిల్ 6.50శాతం లాభ‌ప‌డింది. ఎన్ఎండీసీ 4శాతం, జేఎస్ఎల్ఆర్ హిస్సార్ 3.50శాతం లాభప‌డ్డాయి. నాల్కో, వేదాంత, జిందాల్ స్టీల్ షేర్లు 3శాతం ర్యాలీ చేశాయి. హిందాల్కో, మెయిల్‌, టాటాస్టీల్‌, హిందూస్థాన్ జింక్ షేర్లు 2 శాతం పెరగ్గా, హిందూస్థాన్ కాప‌ర్ షేరు స్వ‌ల్పంగా అర‌శాతం పెరిగింది. మ‌రోవైపు అపోలోఏపిల్, కోల్ ఇండియా, వెల్‌స్పన్ కార్పోరేష‌న్ షేర్లు న‌ష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
ఇదే స‌మ‌యానికి...
ఆరంభ లాభాల్ని కోల్పోయిన సూచీలు ఉద‌యం సెష‌న్‌లో స్వ‌ల్ప‌లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ సూచీ 10900 మార్క్‌ను కోల్పోయి 15 పాయింట్ల స్వ‌ల్ప‌లాభంతో 10,875 వద్ద, సెనెక్స్ సూచీ 50 పాయింట్ల లాభంతో 36,111 వద్ద ట్రేడ్ అవుతోంది.



You may be interested

స్వల్ప నష్టాల్లో పసిడి

Monday 31st December 2018

అమెరికా చైనాల మ‌ధ్య వాణిజ్య యుద్ధ చ‌ర్చ‌లు స‌ఫ‌లం కావ‌చ్చ‌నే అంచ‌నాల నేప‌థ్యంలో సోమ‌వారం ప‌సిడి ధ‌ర‌ స్వ‌ల్పంగా న‌ష్ట‌పోయింది. ఆసియా ట్రేడింగ్లో ఉదయం సెషన్లో 3.50డాలర్లకు పైగా నష్టపోయింది. డాలర్ ఇండెక్స్ వారం రోజుల కనిష్టం నుంచి కోలుకోవడం కూడా పసిడి ట్రేడింగ్ పై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. చైనా అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ తన ట్వీట్లో పేర్కోనడంతో

స్వల్పంగా పెరిగిన రూపాయి

Monday 31st December 2018

వివిధ కరెన్సీలతో డాలరు బలహీనపడిన నేపథ్యంలో సోమవారం భారత్‌ రూపాయి సైతం ఇతర ఆసియా కరెన్సీలబాటలోనే బలపడింది. ముంబైలోని ఇంటర్‌బ్యాంక్‌ ఫారిన్‌ ఎక్సే‍్ఛంజ్‌ మార్కెట్లో డాలరుతో పోలిస్తే మారకపు విలువ 13 పైసలు పెరిగి 69.81 స్థాయికి చేరింది. అయితే 2018లో ఆసియా కరెన్సీల్లోకెల్లా అత్యధికంగా నష్టపోయింది రూపాయే. ఈ ఏడాది ఇది 9 శాతం పతనమయ్యింది. 2011లో 15.8 శాతం నష్టపోయిన తర్వాత రూపాయి అధ్వాన్న పనితీరు కనపర్చడం ఈ

Most from this category