STOCKS

News


మార్కెట్‌కు అండగా మెటల్‌ షేర్లు

Thursday 28th February 2019
Markets_main1551346329.png-24379

ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో మెటల్ షేర్ల ర్యాలీ మార్కెట్‌ అండగా నిలుస్తోంది. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 1.50శాతం లాభపడింది. వేదాంత లిమిటెడ్‌, కోల్‌ ఇండియా, ఎన్‌ఎండీసీ, ఏపిల్‌ అపోలో షేర్లు 3శాతం లాభపడ్డాయి. హిందూస్థాన్‌ కాపర్‌, నాల్కో, వెల్‌స్పాన్‌కార్ప్‌, హిందాల్కో, హిందూస్థాన్‌ జింక్‌, మెయిల్‌ ఇండియా షేర్లు 2శాతం నుంచి 1శాతం లాభపడ్డాయి. జేఎస్‌ఎల్‌ హిస్సార్‌, జేఎస్‌డబ్లూ‍్య స్టీల్‌ షేర్లు అరశాతం లాభపడ్డాయి. మధ్యాహ్నం గం.2:45ని.లకు ఇండెక్స్‌ గతముగింపు(2892)తో 1శాతం లాభంతో 2,888.65ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. మరోవైపు ఇదే ఇండెక్స్‌లో జిందాల్‌ స్టీల్‌ 1శాతం నష్టపోగా, సెయిల్‌ టాటాస్టీల్‌ షేర్లు అరశాతం నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ-50 ఇండెక్స్‌లో వేదాంత లిమిటెడ్‌ (3శాతం లాభం) రెండో స్థానంలో ట్రేడ్‌ అవుతోంది. You may be interested

ఈ షేర్లలో బుల్లిష్‌ మూమెంటమ్‌

Thursday 28th February 2019

ఇండోపాక్‌ ఉద్రిక్తతల కారణంగా నిఫ్టీ-50...200 డీఎంఏ, 50 డీఎంఏ స్థాయల్ని కోల్పోయినప్పటికీ, 50 వరకూ షేర్లు రానున్న రోజుల్లో పెరిగే సంకేతాల్ని అందిస్తున్నాయి. ఎస్‌బీఐ, హీరోమోటో, ఇంద్రప్రస్థ గ్యాప్‌ తదితర షేర్లు సాంకేతికంగా బుల్లిష్‌ క్రాసోవర్‌ను కనపరుస్తున్నాయి. మూమెంటమ్‌ ఇండికేటర్‌ అయిన మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జెన్స్‌ (ఎంఏసీడీ) ఆధారంగా చూస్తే ఆయా షేర్లు రానున్న ట్రేడింగ్‌ సెషన్లలో బుల్లిష్‌ మూమెంటమ్‌ ప్రదర్శించే అవకాశాలున్నాయి. బుల్లిష్‌ క్రాసోవర్‌ కనపర్చిన షేర్లలో

వెలుగులోకి ప్రభుత్వరంగ షేర్లు

Thursday 28th February 2019

ఆరంభ లాభాల్ని కోల్పోయిన మార్కెట్లో ప్రభుత్వరంగ షేర్లు రాణిస్తున్నాయి. బీఎస్‌ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ పీఎస్‌యూ ఇండెక్స్‌ గురువార ట్రేడింగ్‌లో 1శాతం లాభపడింది. ప్రభుత్వరంగానికి చెందిన ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా, ఐఓసీ, గెయిల్‌, ఎన్‌టీపీసీ షేర్లు 3.50శాతం నుంచి 2శాతం   వరకూ లాభపడ్డాయి. మధ్యాహ్నం గం.2:15ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు (6,654.59)తో పోలిస్తే 1శాతం లాభంతో 6725.86 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ

Most from this category